స్టార్ హీరోయిన్…రిజస్టర్డ్ మ్యారేజ్…

Priyamani
Priyamani

ఆమె ఒకప్పుడు తెలుగులో దుమ్ముదలిపింది. తమిళం లో కేక పుట్టించింది. కన్నడలో కాక పుట్టించింది. మళయాలీలపై మత్తు జల్లింది. అవును ఆమె ఎవరో కాదు జాతీయ ఉత్తమనటి అవార్డు గ్రహీత ప్రియమణి. సహజనటిగా మంచి మార్కులు కొట్టిన ఈ అమ్ముడు పెళ్లికూతరు కాబోతోంది. బెంగళూరులోని బనశంకరిలోని ఆమె స్వగృహంలో తన కుటుంబసభ్యుల మధ్య చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారి, ప్రియుడు ముస్తఫా రాజ్‌తో నిశ్చితార్థం తంతును ముగించింది. ఆడాంబరాలంటే తనకు ఇష్టంలేదని… రిజస్టర్డ్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు ప్రకటించింది. ఏడాది కిందటే తాను ముస్తాఫాను ప్రేమిస్తున్నానని… అది అరెంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్ అంటూ ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com