ప్రియాంక-మోడీ మీట్ః ప్రియాంకను ఎవ్వరూ ప్రశ్నించకూడదా?

స్త్రీ సమానత్వం, మహిళల హక్కుల విషయంలో విమర్శకులపై ఘాటుగా స్పందిస్తూ ఉండే వాళ్ళను ఎవ్వరూ ఏమీ అనాల్సిన అవసరం లేదు కానీ అలాంటి భావాలను అడ్డుపెట్టుకుని మేం ఏం చేసినా చెల్లిపోతుంది…ఎవ్వరు ప్రశ్నించినా ఒప్పుకోం అని రెచ్చిపోయేవాళ్ళను మాత్రం ప్రశ్నించాల్సిందే. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా రెండో కోవలో ప్రయాణిస్తుందేమో అని అనిపిస్తోంది.

ఎక్స్‌పోజింగ్, స్కిన్ షోలాంటి విషయాల్లో ఇప్పటి వరకూ తెరమీదకు వచ్చిన ఇండియన్ హీరోయన్స్ అందరినీ దాటేసింది ప్రియాంక. ఆ విషయం ఎవ్వరు ఏమి ప్రశ్నించినా …నా శరీరం…నా ఇష్టం అని గడుసుగా సమాధానం చెప్తుంది. ఇక ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా అందాల ప్రదర్శన మొదలెట్టాక స్కిన్ షోతో పాటు మాటల డోసు కూడా పెంచింది. సిగరెట్, మందు కంటే సెక్స్ తప్పేం కాదని ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేసింది. ప్రియాంకలా ఉన్నతం(?)గా ఆలోచించే వాళ్ళ విషయం పక్కన పెడితే ప్రియాంక మాటలు టీనేజర్స్‌పైన ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇక ప్రధానితో మీటింగ్ సందర్భంగా ప్రియాంక వేసుకున్న డ్రెస్ విషయం పక్కన పెడితే కూర్చున్న విధానం మాత్రం కచ్చితంగా ఆక్షేపణీయమే. ఒక భారతదేశ ప్రధానమంత్రితో కలిసిన సందర్భంలో ఎలా ఉండాలో కూడా ప్రియాంకకు తెలియకపోవడం శోచనీయం. ఇక ప్రియాంక కూర్చున్న విధానాన్ని విమర్శించినవాళ్ళకు నా కాళ్ళ అందం చూడండి అన్నట్టుగా తల్లితో ఉన్న ఫొటో షేర్ చేయడం ఏం సంస్కారమో ప్రియాంకకే తెలియాలి. మహిళా హక్కులు, మహిళా స్వేఛ్చ అంటూ భారతీయులతో ఈ స్థాయిలో రెచ్చిపోయే ప్రియాంక హాలీవుడ్ టెలివిజన్ ఛానల్స్‌లో అత్యంత జుగుప్సాకరమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు కూడా ఎందుకు సౌమ్యంగా స్పందిస్తోంది? అవకాశాల కోసమేగా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.