మోడీపై ప్రియాంక పోటీ..! ప్రకటన ఆలస్యం వెనుక పెద్ద వ్యూహమే..!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీచేస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని వారాణసి నియోజకవర్గంలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని దించాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు.. ముఖ్యంగా.. మోడీ మళ్లీ ప్రధాని కాకూడదని కోరుకుంటున్న వారంతా… ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. సోనియా, రాహుల్‌లపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రియాంక కూడా సమరానికి సై అంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ఆమె ప్రకటించారు.

వారణాసి బరిలో ప్రియాంక పోటీచేస్తేనే పోటీ హోరాహోరీ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు… ఇప్పటికే కాంగ్రెస్‌ శ్రేణులు ఇప్పటికే ఆమెపోటీ చేయాలన్న డిమాండ్లు చేస్తున్నారు. నేను వారాణసి నుంచి పోటీ చేయనా ? వద్దా? అని ప్రియాంక గత నెలలో రాయ్‌బరేలీ ప్రచార సమయంలో కార్యకర్తలతో మాట్లాడినపుడు వ్యాఖ్యానించి సంచలనం రేపారు. అప్పట్నుంచి ఆమె పోటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. పోటీ చేయాలా వద్దా అన్నది ప్రియాంక ఇష్టమని రాహుల్‌ కూడా వ్యాఖ్యానించి ఉత్కంఠ మరింత పెంచారు. తాజా పరిణామాలతో గాంధీల కుటుంబం రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవచ్చంటున్నారు. పశ్చిమ యూపీ బాధ్యతలు తీసుకున్న ప్రియాంక గాంధీ.. చురుగ్గా వెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీపై మాటల దాడి సమయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రియాంక రాకతో యూపీలో కాంగ్రెస్‌ పొజిషన్‌ మారిందంటున్నారు నేతలు. అయితే అసలు పోటీ ఇస్తామా..? లేదా..? అన్న పరిస్థితి నుంచి.. ఇపుడు సత్తా చాటే పోజిషన్‌కు వచ్చామన్న అభిప్రాయం కాంగ్రెస్‌ నేతల్లో కనిపిస్తోంది. ప్రియాంక వచ్చిన తర్వాత పరిస్థితి మారిందన్నది ఆ పార్టీ నేతల బావన.

యూపీలో ఇప్పుడు సంకుల సమరం నడుస్తోంది. ఇప్పుడు… కులాల సమీకరణే.. అక్కడ విజయానికి మొదటి మెట్టుగా ఉంది.ఈ అంశంలో విపక్షాలు ముందు ఉన్నాయి. ప్రియాంక పోటీ చేస్తే.. నరేంద్రమోడీకి.. కచ్చితంగా గడ్డు పరిస్థితే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. ప్రియాంక అభ్యర్థిత్వం విషయంలో.. కాంగ్రెస్ పార్టీ నాన్చడం వెనుక అసలు కారణం.. వేరే ఉంది. మోడీ .. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయకుండా నిలువరించే వ్యూహాన్ని అమలు చేస్తున్నారంటున్నారు. ప్రియాంక అభ్యర్థిత్వాన్ని ఇప్పుడే ప్రకటిస్తే..మోడీ మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ.. అలాంటి చాన్స్ లేకుండా చివరి దశ నామినేషన్లు ప్రారంభమయినప్పుడే.. ఈ ప్రకటన చేయాలనే ఆలోచన చేస్తున్నారంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close