పైసా వ‌సూల్‌… రేట్లు చూస్తే హ‌డ‌ల్‌

బాల‌య్య సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఎన్ని ఫ్లాపులు వ‌చ్చినా, బాల‌య్య నుంచి ఓ సినిమా వ‌స్తోందంటే మార్కెట్ వ‌ర్గాల్లో ఆస‌క్తి మొద‌లైపోతుంది. దానికి తోడు పూరి జ‌గ‌న్నాథ్‌తో కాంబో అంటే ఆ ఆస‌క్తి రెట్టింపు అవ్వ‌డం ఖాయం. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి త‌ర‌వాత, పూరి జ‌గ‌న్నాథ్‌తో జ‌ట్టు క‌ట్టాడు బాల‌య్య‌. ‘పైసా వ‌సూల్‌’ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకొంటోంది. పూరి సినిమా అంటే మాస్ అంశాల‌కు కొద‌వ ఉండ‌దు. దానికి తోడు.. ఈ సినిమాకి పైసా వ‌సూల్ అంటూ మాస్‌కి న‌చ్చే టైటిలే పెట్టారు. అంతే కాదు.. `పైసలు వ‌సూల్‌` చేసుకొనేందుకు నిర్మాత కూడా రెడీ అయిపోయాడు. ఈ కాంబో ఎప్పుడైతే సెట్ అయ్యిందో, అప్పుడే మార్కెట్ ఓపెన్ అయిపోయింది. అన్ని ఏరియాల నుంచీ ఎంక్వైరీలు వ‌చ్చేస్తున్నాయి. అయితే… నిర్మాత మాత్రం రేట్లు ఎక్కువ చెప్పి పంపిణీదారుల్ని హ‌డ‌లెత్తిస్తున్నాడ‌ట‌. ఓవ‌ర్సీస్ అడిగితే.. ఏకంగా రూ.5 కోట్లు చెల్లించ‌మంటున్నార్ట‌. లెజెండ్ లాంటి సినిమాలే అక్క‌డ రూ.2 కోట్లు చేయ‌లేదు. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణి సినిమాని సొంతంగా విడుద‌ల చేసుకొన్నారు నిర్మాత‌లు. బాల‌య్య‌కు ఓవ‌ర్సీస్‌లో అంత డిమాండ్ ఉండ‌దు. మ‌హా అయితే.. ఓవ‌ర్సీస్ రూ.2 కోట్ల‌కు అమ్ముడుపోతుంది. అలాంటిది రూ.5 కోట్లు చెప్పేస‌రికి వ‌చ్చిన‌వాళ్లు వ‌చ్చిన‌ట్టు వెన‌క్కిపోతున్నార్ట‌. ఈ సినిమాని అమ్మ‌డంలో… నిర్మాత‌ల స్ట్రాట‌జీ ఏంటో అర్థం కావ‌డం లేదు. ఎక్కువ రేట్లు చెప్ప‌డం వ‌ల్ల‌.. సినిమాకి హైప్ మ‌రింత పెంచాల‌ని భావిస్తున్నారేమో..??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com