33 కోట్లు ఖ‌ర్చు పెట్టించావా.. మా నాయ‌నే..!

మిస్ట‌ర్ రూపంలో శ్రీ‌నువైట్ల ఖాతాలోకి మ‌రో డిజాస్ట‌ర్ చేరిపోయింది. ఈ సినిమాపై ఎవ్వ‌రికీ ముందు నుంచి న‌మ్మ‌కాల్లేవు. అయితే మ‌రీ ఇంత దారుణంగా ఉంటుంద‌ని ఊహించ‌లేక‌పోయారు. అన్నిటికి మించి నిర్మాత‌లు ఠాగూర్ మ‌ధు, న‌ల్ల‌మ‌ల‌పు బుజ్జిల‌కు ఇది వ‌రుస‌గా రెండో `మెగా` దెబ్బ‌. ఇంత‌కు ముందు వ‌చ్చిన `విన్న‌ర్‌`కీ వీళ్లే నిర్మాత‌లు. మిస్ట‌ర్ కోసం శ్రీ‌నువైట్ల ఏకంగా రూ.33 కోట్లు ఖ‌ర్చు పెట్టించాడ‌ట‌. ఈ అంకె మ‌రీ టూమ‌చ్‌. పారితోషికాల ప‌రంగా ఎవ్వ‌రికీ పెద్ద‌గా ఇవ్వ‌క‌పోయినా, టేకింగ్ విష‌యంలో రాజీ ప‌డ‌క పోవ‌డం వ‌ల్ల ఈ స్థాయిలో బ‌డ్జెట్ పెట్టాల్సివచ్చింద‌ట‌.

సినిమా విడుద‌ల‌కు వారం రోజుల ముందు ఓ పాట తెర‌కెక్కించార్ట‌. అందుకోసం ఏకంగా రూ.80 ల‌క్ష‌ల‌య్యింద‌ని స‌మాచారం. ఆ పాట వ‌ద్దు… అని నిర్మాత‌లు మొత్తుకున్నా, శ్రీ‌నువైట్ల విన‌లేద‌ట‌. ఓ కామెడీ సీన్ కోసం ఊర్లోఉన్న ఇళ్ల‌ని తెల్ల పెయింట్ వేయించాడ‌ట‌. వంద‌ల మంది జూనియర్ ఆర్టిస్టుల్ని తీసుకొచ్చాడ‌ట‌. అయితే ఆ సీన్ పేల‌లేదు. ఇలాంటి అన‌వ‌స‌ర‌మైన ఖర్చులు చాలా చేయించాడ‌ని, అందుకే బ‌డ్జెట్ త‌డిసిమోపెడ‌య్యింద‌ని తెలుస్తోంది. ఈ సినిమాతో నిర్మాత‌లు పూర్తిగా న‌ష్ట‌పోవ‌డంతో, ప‌రిహారం క్రింద శ్రీ‌నువైట్ల కొంతమొత్తం వెన‌క్కి ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని, అందుకే ఫ్లాట్ అమ్మ‌కానికి పెట్టాడ‌ని స‌మాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com