అల్ల‌రోడు ఇక ఖాళీనా?

బెల్లం చుట్టూ ఈగ‌లు, హిట్ల చుట్టూ ప్రొడ్యూస‌ర్లు చేర‌డం కామ‌న్‌. దాన్ని త‌ప్పుప‌ట్ట‌లేం కూడా! చేతిలో విజ‌యాలున్న‌ప్పుడే ఆద‌ర‌ణ‌. విజ‌యాలు మొహంచాటేస్తున్న‌ప్పుడు ప్రొడ్యూస‌ర్లు కూడా లైట్ తీసుకొంటారు. ఇప్పుడు అల్ల‌రి న‌రేష్ విష‌యంలో ఇదే జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు చేతిలో ఎప్పుడూ నాలుగు సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేవాడు న‌రేష్‌. యేడాదికి క‌నీసం నాలుగు సినిమాలైనా వ‌చ్చేవి. అందుకే… న‌రేష్ అతి తొంద‌ర‌గానే 50 సినిమాల మైలు రాయి అందుకొన్నాడు. అయితే ఆఖ‌రి పాతిక‌లో హిట్లు ఒక‌టో రెండో ఉన్నాయంతే. దాంతో.. న‌రేష్ కెరీర్ ఒక్క‌సారిగా కుదేలైంది. మ‌ధ్య‌లోనిర్మాత‌గా మారి ప్ర‌య‌త్నాలు చేసినా అవేం స‌రైన ఫ‌లితాల్ని అందించ‌లేదు. కాస్త విరామంతో ‘మేడ‌మీద అబ్బాయి’గా వ‌స్తున్నాడు. ఈసినిమాకీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏమాత్రం జ‌ర‌గ‌లేదు. శాటిలైట్ అయినా.. ఇప్ప‌టి వ‌ర‌కూ టీవీ ఛాన‌ల్ వాళ్లు డ‌బ్బులు ఇవ్వ‌లేదంటే న‌రేష్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవొచ్చు.

మేడ‌మీద అబ్బాయి వ‌చ్చి వెళ్లిపోతే.. న‌రేష్ ప‌రిస్థితి ఖాళీనే. ఒక‌రిద్ద‌రు ప్రొడ్యూస‌ర్లు ఉన్నా వాళ్లు కూడా మేడ‌మీద అబ్బాయి రిజ‌ల్ట్ కోసం ఎదురుచూస్తున్నార్ట‌. ఈ సినిమా హిట్ట‌యితే … న‌రేష్‌కి అడ్వాన్స్ ఇద్దాం అని కాచుకొని కూర్చున్నారు. అటూ ఇటూ అయితే… ఆ ఇద్ద‌రూ గాయ‌బ్‌! న‌రేష్ కెరీర్ మ‌రో ప‌ది సినిమాల పాటు సాగాలంటే.. మేడ‌మీద అబ్బాయి హిట్ కొట్ట‌డం కంప‌ల్స‌రీ. న‌రేష్‌లాంటి న‌టుడికి విజ‌యాలు ద‌క్కాల్సిందే. ఎందుకంటే ఓ హిట్టు కొడితే తానొక్క‌డే బిజీ అవ్వ‌డు. త‌న‌తో పాటు వంద‌మందికి ఉపాధి క‌ల్పిస్తాడు. కాక‌పోతే.. క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్పు చేస్తున్నాడు.ఎప్పుడూ మూస ప‌ద్ధ‌తిలోనే సినిమాలు తీస్తున్నాడు. జ‌న‌రేష‌న్ మారింది. వాళ్ల‌కు కావ‌ల్సిన కామెడీ కూడా మారింది. ఈ విష‌యాన్ని న‌రేష్ ఎంత తొంద‌ర‌గా గ్ర‌హిస్తే అంత మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

కెలికి మరీ తిట్టించుకోవడం ఇదే-వైసీపీకి షర్మిల అదిరిపోయే కౌంటర్..!!

ఈ ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ రెడ్డికి తన చెల్లి షర్మిల పంటికింది రాయిలా మారింది. అన్న వైఫల్యాలను చాటింపు వేస్తూనే.. ప్రభుత్వ అసమర్ధత, మంత్రుల దోపిడీ, వివేకా హత్యకేసుపై దూకుడుగా మాట్లాడుతోంది....

కడప కోర్టు తీర్పుపై న్యాయవర్గాల్లో విస్మయం !

వివేకా హత్య కేసులో మాట్లాడుతున్నారని ఎవరూ మాట్లాడవద్దని ఆర్డర్స్ ఇవ్వాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోర్టుకెళ్లారు. కోర్టు అయన కోరినట్లుగా ఎవరూ మాట్లాడవద్దని ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాలు... అందులో ఉన్న పదజాలం చూసి...

హ్యాపీ బర్త్ డే : ఏపీ నీడ్స్ చంద్రబాబు !

చంద్రబాబునాయుడు .. అభివృద్ధి రాజకీయాలు, యువతకు ఉపాధి, టెక్నాలజీ విషయాల్లో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే అద్భుతాలు చేయవచ్చని నిరూపించిన నాయకుడు. ఆయనను అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు......

HOT NEWS

css.php
[X] Close
[X] Close