ప్రొ.నాగేశ్వర్ : దేవుళ్లకు కులం అంటగట్టడం ఏ రకమైన మనుషుల లక్షణం..!?

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకు వచ్చారు. హనుమంతుడు దళితుడు అనే వాదన ఆయన వినిపించడం ప్రారంభించారు. ఆయన గిరిజన దళిత కులానికి చెందిన వారని.. రాముడి ఆదేశం మేరకే.. అన్ని కులాలను ఏకతాటిపైకి తీసుకు వచ్చేందుకు… హనుమంతుడు ప్రకటించడం వివాదం రేపుతోంది. రామాయణ కాలం నాటి.. ఓ క్యారెక్టర్‌ను తీసుకొచ్చి.. వివాదాస్పద రాజకీయంలో కలపడం దేవుడ్ని అవమానించడమే.

రాజకీయాలకు మతాన్ని వాడుకోవడం నిషిద్ధం..!

ఎన్నికల కమిషన్, ఎన్నికల చట్టాల మేరకు… మత సంబంధితమైన చిహ్నాలు కానీ.. నినాదాలు కానీ.. అంశాలను రాజకీయాలకు వాడుకోకూడదు. అది చట్టబద్ధం కాదు. అయినప్పటికీ.. దురదృష్టవశాత్తూ.. అలాంటి అంశాలను రాజకీయాలను వాడుకున్నా.. చట్టబద్ధ సంస్థలు సైలెంట్‌గా ఉంటున్నాయి. చట్టబద్ధమైన వ్యవస్థలు విఫలమవడం వల్ల ఈ సమస్య వస్తోంది. రామభక్తులంతా.. బీజేపీకి ఓటేశారని.. రావణ భక్తులంతా కాంగ్రెస్‌కు ఓటేశారని కూడా చెప్పుకొస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్ తెలుసుకోవాల్సింది.. ఇప్పుడు జరగుతుంది.. రామ, రావణ యుద్ధం కాదని…!. రామ భక్తులందరూ.. బీజేపీకి ఓటేలా వేస్తారు..? ఈ దేశంలో నూటికి 80 శాతం మంది రామభక్తులే. ఇందులో అనుమానమే లేదు. మరి ఎనభై శాతం బీజేపీకి ఓటింగ్ రావాలి కదా..! వస్తుందా..? మొన్న 2014లో… బీజేపీకి వచ్చింది దేశవ్యాప్తంగా 31 శాతం మాత్రమే. ఇదే అత్యధికం. మన దేశంలో ఉన్న ఓటింగ్ విధానం వల్ల 31 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ.. మెజార్టీ సీట్లు తెచ్చుకుంది.

రామభక్తులు బీజేపీకి, రావణాసుర భక్తులు కాంగ్రెస్‌కు ఓటేశారా..?

భారత దేశ ఎన్నికల్లో ఓట్ల లెక్కలు కాదు.. సీట్ల లెక్కలు చూస్తారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పందొమ్మిది శాతం ఓట్లు వస్తే.. 44 సీట్లు మాత్రమే వచ్చాయి. అలాగే 2009 ఎన్నికల్లో బీజేపీకి 18.5 శాతం ఓట్లు మాత్రమ వచ్చాయి. అయినప్పటికీ.. బీజేపీకి 116 సీట్లు వచ్చాయి. సీట్లకు ఓట్లకు సంబంధం లేదు. యూపీబీలో బీఎస్పీకి ఇరవై శాతానికిగా ఓట్లు వచ్చాయి. కానీ ఒక్క సీటు రాలేదు. బెంగాల్‌లో మార్క్సిస్టులకు 30 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. కానీ రెండే సీట్లు వచ్చాయి. ఒడిషాలో.. కాంగ్రెస్ పార్టీకి 25 శాతం ఓట్లు వచ్చాయి. కానీ సీట్లు రాలేదు. ఈ లెక్క ప్రకారం చూస్తే.. బీజేపీకి .. .యాభై శాతం కన్నా ఎక్కువ ఓట్లు రావాలి. కానీ రాలేదు. అంటే.. రామభక్తులందరూ బీజేపీకి ఓటేయలేదన్నమాట. నరేంద్రమోడీ.. నాలుగు రోజుల కిందట తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పూజల గురించి విమర్శలు చేస్తారు. పూజలు చేస్తారని..యాగాలు చేస్తారని విమర్శించారు. కానీ యోగి ఆదిత్యనాథ్ మాత్రం దానికి భిన్నంగా మాట్లాడుతున్నారు. బీజేపీ ఎలాంటి పార్టీ అనేది ఓ ఇండికేటర్. ఇక హనుమంతుడ్ని… దళితుడుగా పోల్చడంలోనూ ఇలాంటి రాజకీయమే ఉంది.

దేవుళ్లకు కులం అంటగట్టి చేసే రాజకీయం ఎలాంటిది..?

దళితులు అంటే.. ఈ దేశంలో సేవకులు అనే దుర్మార్గమైన కుల వ్యవస్థ మన దేశంలో ఉంది. చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న అతి దుర్మార్గమైన విషయం ఏమిటంటే.. దళితులు ఇతర కులాల్లో ఉన్న వారికి సేవలు చేయాలి. హనుమంతుడు ఎక్కడ ఉంటాడు. ఎల్లప్పుడు రాములవారి పాదాల చెంత ఉంటారు. దీన్ని బట్టి చూస్తే.. దళితులు ఇంకా అగ్రకులాల పాదాల దగ్గరే మోకరిల్లాలని.. యోగి ఆదిత్యనాథ్ చెబుతున్నారా..? అది ఇంకా ప్రమాదకరం. ఎందుకు… హనుమంతుడే రాముడి భక్తుడు అయ్యాడు… రాముడు.. హనుమంతుని భక్తులు కావొచ్చు కదా..!. రాముడు దళితుడై అయి ఉండవచ్చు కదా..?. దేవుళ్లు ఎవరైనా దళిత కులంలో ఎందుకు పుట్టలేదనే ప్రశ్న వస్తుంది. శ్రీకృష్ణుడు..యాదవ కులంలో పెరిగారు కానీ… ఆయన జన్మతహా క్షత్రియుడే. ఆ మాటకొస్తే.. దేవుళ్లెవరైనా దళిత కులంలో పుట్టారా అని క్వశ్చన్ వస్తే.. ఏం సమాధానం చెబుతాం. యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్లు చేసే వ్యాఖ్యల వల్ల ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి.

దేవుళ్లను కూడా కించ పరచకపోతే ఓట్లు తెచ్చుకోలేరా..?

ఓ మహత్తర కావ్యం అయిన రామాయణ ఇతి వృత్తానికి అనవసరంగా రాజకీయాన్ని అంట గలిపి… కులాలను అంటగట్టడం సరి కాదు. దేవుళ్లకు కులాలను అంటగట్టడం నీచత్వం. హనుమంతుడు.. మానవాళికి ఓ రక్షణకు ప్రతీకలాంటి వారు. ఆలాంటి ఆయనను.. తమ రాజకీయ ప్రయోజనాల కోసం కులం అంటగట్టి కించ పరచకండి. హనుమంతుడు.. ఈ సకల చరాచర జగత్తుకు రక్షణ ఇచ్చేటటువంటి గొప్ప ప్రదాత. ఎలాంటి కష్టం వచ్చినా.. హనుంతుడ్ని గుర్తు చేసుకుంటారు. అలాంటి మహోన్నతమైన హనుమంతుడికి కులం అంటగట్టి… దారుణమైన రాజకీయాలకు వాడుకోకండి. దేవుళ్లను అయినా దేవళ్లగా ఉండనిచ్చి.. కనీసం మనుషులుగా అయినా మసలుకునే ప్రయత్నం చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.