ప్రొ.నాగేశ్వర్ : హరీష్‌ను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని చేస్తుందా..?

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు విభిన్న పరిస్థితి ఉంది. హంగ్ ఏర్పడితే వచ్చే పరిస్థితులపై.. విస్తృతమైన చర్చ జరుగుతోంది. అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ.. హరీష్‌రావును ప్రొత్సహించి.. ముఖ్యమంత్రి అయ్యేలా అవకాసం ఇస్తుందన్న ప్రచారం జరుగుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే. వాళ్లు.. గెలిచిన తర్వతా మనసా , వాచా, కర్మణా… ఎలాంటి పరిస్థితులు వచ్చినా.. వారంతా టీఆర్ఎస్‌తో ఉంటారని గట్టిగా చెప్పలేము. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.

హరీష్ రావు మరో నాదెండ్ల అవుతారా..?

రాజకీయాల్లో ఏ రకమైన డెవలప్‌మెంట్స్ జరగడానికైనా అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకులు.. ఈ రోజు ఉదయం మాట్లాడింది.. సాయంత్రానికి మర్చిపోతారు. ప్రపంచంలోనే భారత దేశ రాజకీయ నాయకులు.. ఓ ప్రత్యేకమైన వారు. ఇంకెక్కడా ఉండరు. కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా.. భవిష్యత్ రాజకీయాల్లో తమ పాత్రేమిటన్నదాన్ని కూడా.. ఆలోచించుకుంటారు. హరీష్ రావు మరో నాదెండ్ల భాస్కర్ రావు కావాలని అనుకోరుగా..! ఏదో ఒక అవకాశం వచ్చింది కదా.. అని అంది పుచ్చుకుని.. రాజకీయ జీవితాన్ని ముగించాలనుకోరు కదా..! . ఇవన్నీ కలసి వస్తే.. ఏదైనా జరగవచ్చు. హరీష్ రావు అయినా.. మరొక నేత అయినా.. తమ రాజకీయ భవిష్యత్ ఎక్కువ కాలం ఉంటుందని అనుకుంటేనే కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

ప్రజాకూటమి గెలిస్తే చంద్రబాబు పెత్తనం ఉంటుందా..?

తెలంగాణలో ప్రజాకూటమి ప్రయోగం విజయవంతం అయితే.. కచ్చితంగా అది చంద్రబాబుకు అతి పెద్ద విజయం. ఆంధ్రప్రదేశ్‌లో చాలా పేరు వస్తుంది. ఏపీలో ఆయన మొనగాడుగా మారిపోతారు. అలాగే చాలా మంది టీఆర్ఎస్ నేతలు విమర్శించినట్లుగా.. చంద్రబాబునాయుడు తెలంగాణలో తిష్టవేద్దామనో.. తెలంగాణ రాజకీయాల్ని ప్రభావితం చేద్దామనో.. పెత్తనం చేద్దామనో.. ఆయనకు వచ్చే ఏడెనిమిది సీట్లతో ఏదో చేస్తాడని కూడా నేను అనుకోను. ప్రజాకూటమిలో చేరడం అనేది.. వ్యూహాత్మకమైన నిర్ణయం. ఏర్పడనున్న.. బీజేపీ వ్యతిరేక కూటమిలో ఓ బలమైన స్థానం పొందడానికి.. అవకాశం ఉంటే.. ఢిల్లీలో మరో కుమారస్వామి కావడానికి.. ఓ అవకాశాన్ని కొట్టి పారేయకూడదన్న దూరదృష్టితో చంద్రబాబు ప్రజాకూటమిలో చేరారని అనుకుంటున్నారు.

తెలంగాణ ఫలితంతో దేశ రాజకీయాల్లో వచ్చే మార్పేమిటి..?

అంతే కాకుండా… గత ఎన్నికల్లో మిత్రపక్షాలుగా ఉన్న… బీజేపీ, జనసేనలు టీడీపీకి దూరం అయ్యాయి. వాటి వల్ల ఎంతో కొంత నష్టం ఏర్పడుతుంది. అదే సమయంలో.. ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది. అంటే.. కొత్తగా వచ్చే ఓటు బ్యాంక్ ఏదీ లేకపోతే.. ఏపీలో ప్రమాదఘంటికలు మోగుతాయి. అందుకే కాంగ్రెస్‌లో కలవాలనుకున్నారు. అందు కోసం.. రెండు భూమికలు ఏర్పాటు చేసుకున్నారు. ఒకటి ప్రత్యేకహోదా ఇవ్వడం.. రెండోది బీజేపీని ఓడించడం. బీజేపీకి వ్యతిరేకంగా… ఢిల్లీ స్థాయిలో ఓ జాతీయ స్థాయి వేదిక నిర్మాణంలో భాగం అయ్యారు. తెలంగాణతో పొత్తుల చర్చల్లో భాగంగా ఉత్తమ్‌తో చర్చలు జరపలేదు. చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి.. రాహుల్‌తో సమావేశం అయ్యారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పుకునేందుకు తెలంగాణలో కలిశారు. లగడపాటి చెప్పినట్లు ప్రజాకూటమి తెలంగాణలో విజయం సాధిస్తే.. అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపించే అంశమవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.