ప్రొ.నాగేశ్వర్ : ఈవీఎంలపై రచ్చ ఎందుకు..? ఈసీ ఏం చేయాలి..?

తెలంగాణలో ఎన్నికల హడావుడి ముగిసింది. ఫలితాలు వచ్చేశాయి. కేసీఆర్ రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. అయితే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం తమ ఓటమిని విశ్లేషించుకుంటూ.. ఈవీఎంలపైనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. తమను ప్రజలు ఓడించలేదని.. ఈవీఎంలే ఓడించాయని.. వాటిని టీఆర్ఎస్ నేతలు ట్యాంపరింగ్ చేశారని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు.

పోలయిన ఓట్లకు, ఈవీఎంలలో ఓట్లకు తేడా ఎలా వచ్చింది..?

ఈవీఎంలపై…. ఈ తెలంగాణ ఎన్నికల్లో కొన్ని మౌలికమైన విమర్శలు వచ్చాయి. పందొమ్మిది నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాని చెబున్నారు. అలాగే చాలా చోట్ల ఈవీఎంలలో పోలయిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అలాగే.. కొన్ని కోట్ల.. ఈవీఎంలలో పోలయినట్లకు… వీవీ ప్యాట్ స్లిప్‌లకు సంబంధం లేదని… వాటి సంఖ్య కూడా తేడాగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే కొడగంల్‌ నియోజకవర్గంలో కూడా.. రిటర్నింగ్ ఆఫీసర్ల వద్ద ఉన్న డేటాకు.. ఈవీఎంలో పోలయిన ఓట్లకు మధ్య చాలా తేడా ఉందని చెబుతున్నారు. అయితే పోలయిన ఓట్ల కన్నా.. ఈవీఎంలలో నమోదయిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అర్థం. ఇవి నిజం అయితే చాలా సీరియస్ ఇష్యూ అవుతుంది. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలంటే.. అన్ని రకాల ఆధారాలు సమర్పించాలి. ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల అధికారులే కాదు.. ఏజెంట్లు కూడా.. నమోదు చేసుకుంటారు. అంటే.. రికార్డుల్లో ఎంత పోలింగ్ ఉందో… ఈవీఎంలలోనూ అంతే ఉండాలి. అంత కంటే.. ఎక్కువ ఉన్నా.. తక్కువ ఉన్నా… ఫ్రాడ్ జరిగినట్లే అవుతుంది. అందుకే.. కాంగ్రెస్ పార్టీ నేతల ఆరోపణలపై ఈసీ స్పష్టంగా స్పందించాలి. వారి అనుమానాలను నివృతి చేయాలి.లేకపోతే.. ఇది మన ఎన్నికల ప్రక్రియ పైనే అనుమానాలు రేకెత్తిస్తుంది.

కౌంటింగ్‌కు ముందే కాంగ్రెస్ ఎందుకు ఆరోపణలు చేయలేదు..?

ఈవీఎంల అవకతవకల వల్లే… టీఆర్ఎస్ గెలిచిదని.. లేకపోతే.. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చి ఉండేదని.. కొంత మంది విశ్లేషిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంల పని తీరుపై అనుమానాలు వచ్చాయి. అయితే ప్రజాకూటమి నేతలు.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేయడం వల్ల విలువ లేకుండా పోతోంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడో.. ఎన్నికలు అయిపోయిన తర్వాతైనా.. ఈవీఎంలలో అక్రమాలు జరిగాయని.. తాము ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటన చేసి ఉంటే వాటికి విలువ ఉండేది. కానీ కౌంటింగ్ పూర్తయిన తర్వాత..తాము ఓడిపోయిన తర్వాత ఈవీఎంలపై ఆరోపణలు చేయడం వల్ల సహజంగానే సీరియస్‌నెస్ తగ్గుతోంది. పోలింగ్‌కి రిజల్ట్‌కి మధ్య మూడు రోజులు ఉంది. ఈ మూడు రోజుల్లో ఆరోపణలు చేయాల్సింది. అందువల్ల ఇవి ఆకతాలు చేష్టలుగా కనిపిస్తున్నాయి.

కాంగ్రెస్ గెలిచిన మూడు రాష్ట్రాల్లో ఈవీఎంలు బాగా పని చేశాయా..?

ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే ఎవరు చేయాలి..? ఎన్నికల కమిషన్ చేయాలి. కాంగ్రెస్ నేతలు రజత్ కుమార్ మీద చేస్తున్నారు. ఆయన ఈసీ వ్యవహారాలను సమన్వయం చేసే అధికారి మాత్రమే. అసలు ఎన్నికల కమిషన్ ఢిల్లీలో ఉంటుంది. ఓటర్ల జాబితాల్లాంటివి రజత్ కుమార్ చేతిలో ఉన్నా.. ఈవీఎంలు.. ఇతర వ్యవహారాలన్నీ.. ఢిల్లీ నుంచి నడుస్తాయి. అంటే.. ట్యాంపరింగ్ జరిగితే.. ఢిల్లీ నుంచి జరగాలి. ఢిల్లీ ఈసీ అధికారులతో కేసీఆర్‌కు.. టీఆర్ఎస్‌కు అంత సన్నిహిత సంబంధాలు.. అధికారం ఉండదు. ఉంటే.. గింటే.. అది మోడీకి ఉంటుంది. మోడీతో ఉన్న సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చనే అనుమానాలు ఉండొచ్చు. అయితే.. అలా చేయగలిగితే.. మోడీ.. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో.. చేసి ఉండేవారు కదా..! మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ ఓడిపోయింది. తను చేయదల్చుకుంటే.. ఆ మూడు రాష్ట్రాల్లో కూడా గెలిచి ఉండేవారు కదా..! . కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ ఎందుకు చేయడం లేదు..? 2009లో కేసీఆర్ కూడా… ఇలాంటి ఆరోపణలు చేశారని చెబుతున్నారు. గెలిచినప్పుడు.. ఈవీఎంలను ప్రస్తావించకుండా… ఓడినప్పుడు… మాత్రమే ఆరోపణలు చేయడం వల్ల.. సీరియస్‌నెస్ లేదు.

ఈవీఎంలపై ఈసీ అనుమానాలు తీర్చాల్సిందేనా..?

అయితే …నేతలు ఓడినప్పుడే ఇలాంటి ఆరోపణలు నేతలు చేస్తున్నా… ఎన్నికల సంఘం వీటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంది. వాటికి ఓ పరిష్కారాన్ని కనిపెట్టాల్సి ఉంది. కొత్తగా వీవీ ప్యాట్ యంత్రాలను కూడా వాడుతున్నారు కాబట్టి… ఐదు వేల లోపు..మెజార్టీ వచ్చిన నియోజకవర్గాల్లో అయినా.. వీవీ ప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలి. అప్పుడైనా క్లారిటీ వస్తుంది. పోలయిన ఓట్లకు ఎన్నికల అధికారి దగ్గర ఉన్న లెక్కలు, ఈవీఎంలలో ఉన్న ఓట్లు, వీవీ ప్యాట్‌లలో ఉన్న ఓట్లన్నింటినీ.. తక్కువ మార్జిన్ ఉన్న నియోజకవర్గాల్లో అయినా… లెక్కించి అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని నిరూపిస్తే.. ఆరోపణలకు అవకాశం ఉండదు. ఎన్నికల కమిషన్ ఈ అనుమానాలను తీర్చాలి. ఎందుకంటే.. భారత ప్రజాస్వామ్యంపై నమ్మకం .. ఈవీఎంలలో ఉంది. వాటిని కోల్పోతే…. ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.