ప్రొ.నాగేశ్వర్: నదుల అనుసంధానమే పరిష్కారమా..?

దేశంలో ఇప్పుడు విభిన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వైపు కరువు ఉంటే.. మరో వైపు వరదలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అతి వృష్టి.. లేకపోతే అనావృష్టి అన్నట్లు పరిస్థితి ఉంది. భారతదేశం సెంట్రల్ వాటర్ కమిషన్ లెక్కల ప్రకారం.. దేశంలో ఆరో వంతు భూభాగం కరువు పీడిత ప్రాంతం. ఎనిమిదో వంతు ప్రాంతం వరద పీడిత ప్రాంతం. దేశంలో చాలా చోట్ల.. చాలా తక్కువ సమయం వర్షాలు ఉంటాయి. దాదాపుగా ఓ పదిహేను రోజులు మాత్రమే వర్షాలు పడతాయి.

నదుల అనుసంధాన ఆలోచన ఎప్పటిదో..!!

గుజరాత్‌లోని సబర్మతి బేసిన్‌లో అసలు నీళ్లు ఉండవు. కానీ బ్రహ్మపుత్ర బేసిన్‌లో పుష్కలంగా నీళ్లుంటాయి. గోదావరిలో కాళేశ్వరం దిగువన ఇంద్రావతి, ప్రాణహిత కలిసే దాకా నీళ్లు ఉండవు. ఆ తర్వాత నీళ్లు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శబరి నది కలిసిన తర్వాత మరింత ఉద్ధృతంగా గోదావరి ప్రవహిస్తుంది.ఈ ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా… భారతదేశంలో… నదుల్ని అనుసంధానం చేయడం ద్వారా నీరు ఉన్న చోట నుంచి నీరు లేని చోటకు తరలించాలనేది… సమస్యకు పరిష్కారం. ఇది ఇప్పటి ఆలోచన కాదు.. 1960ల్లోనే దీనిపై చర్చ జరిగింది.

ప్రకృతిపై ప్రభావాన్ని అంచనా వేయగలరా..?

నదుల అనుసంధానం అంటే.. నీటిని మళ్లించడం.. నదిని దారి మళ్లించడం. గోదావరి నదిని పట్టిసీమ ద్వారా.. కృష్ణానది వైపు మళ్లించారు. అలాగే గోదావరిని పెన్నాని కలుపుతామంటున్నారు. ప్రకృతికి సిద్ధంగా ఉన్న… నది ప్రవాహ స్వభావాన్ని మార్చడమే… నదుల అనుసంధానం. ఇలా మారిస్తే… ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి..? కేరళలో వరదల పరిస్థితిని… ఇప్పుడు మనం చూస్తున్నాం. ప్రకృతికి చేసిన హాని వల్లే అలాంటి పరిస్థితి వచ్చిందని ఇప్పటికే విశ్లేషణలు వస్తున్నాయి. అలాంటి దేశంలో ఉన్న నదులన్నింటినీ భారీ ఎత్తున అనుసంధానం చేస్తే.. ఎలాంటి విచ్చిన్నకర పరిస్థితులు ఎదురువుతాయి..? ఆ ప్రభావాన్ని ఎవరైనా అంచనా వేయగలరా..?

ప్రకృతి ప్రకోపం వల్లే కేరళ వరదలు..!

వరదల్లో కేరళ పూర్తిగా నీట మునిగింది. అంతా ప్రకృతి ప్రకోపమే. అవసరానికి మించి డ్యాములు నిర్మించడం వల్లే ఈ పరిస్థితి అని కొంత మంది అంచనాలు వేస్తున్నారు. ఒక్క పోలవరం ప్రాజెక్టుల వల్లే.. రెండు లక్షల మంది గిరిజనులు నిర్వాసితులవుతున్నారు. కొన్ని లక్షల ఎకరాలు ముంపునకు గురువుతున్నాయి. పెద్ద ఎత్తున… నదుల అనుసంధానం చేస్తే… 15 లక్షల మంది నిర్వాసితులవుతారు. మూడు వేల డ్యాములు కట్టాలి. ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. రూ. 11 లక్షల కోట్లు ఖర్చవుతుంది. ఇది అంచనానే. కానీ ఖర్చు పెట్టే సరికి రూ. 20 లక్షల కోట్లు అవుతుది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ అవుతుంది. రూ. 20 లక్షల కోట్లు ఖర్చు పెట్టి నదుల అనుసంధానం చేస్తే… ఆ ప్రాజెక్టులకు అయ్యే నిర్వహణ ఖర్చు ఎంత..?. ఓ చెరువు తవ్వి వ్యవసాయం చేస్తే.. ఖర్చు తక్కువ. కానీ ప్రాజెక్టు కట్టి వ్యవసాయం చేస్తే చాలా ఖర్చు ఎక్కువ.

రాష్ట్రాల నీటి వాడకంలో అనూహ్య మార్పులు..!

అలాగే… వాతావరణ పరిస్థితుల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. నీటి లభ్యత తగ్గిపోతోంది. అలాగే నీళ్లు ఉపయోగించుకుంటున్న రాష్ట్రాల అవసరాలు కూడా మారిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు కర్ణాటకలో అంతకు ముందు కావేరీ నీటిని వాడుకునేవారు కాదు. స్వాతంత్ర్యం అనంతరం వ్యవసాయం పూర్తిగా అభివృద్ధి చెందిన తర్వాత కావేరీ నీటి కోసం పోరాడుతున్నారు. అంతకు ముందు కావేరీ నీరు ఎక్కువగా తమిళనాడు వాడుకునేది. కానీ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా కావేరీ జల వివాదం మారింది. కృష్ణా నదిపై తెలంగాణలో పెద్ద ప్రాజెక్టులు లేవు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కృష్ణాపై ప్రాజెక్టులు కట్టుకుంటామని… తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. గోదావరిపైనా అదే పరిస్థితి. మహారాష్ట్రలో కట్టిన చిన్న చిన్న ప్రాజెక్టుల ఎఫెక్ట్.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుపై పడింది.

నదుల అనుసంధానం సాధ్యమయ్యే పని కాదు..!

గోదావరిలో నీళ్లు ఎక్కువ… ప్రాజెక్టులు తక్కువ. కృష్ణానదిలో నీళ్లు తక్కువ ప్రాజెక్టులు ఎక్కువ. గోదావరి నీరు వృధాగా పోతోంది. పోలవరం ద్వారా కానీ.. పట్టి సీమ ద్వారా కానీ.. గోదావరి నీటిని కృష్ణాలోకి తరలించి వాడుకుంటే.. నీటి అవసరాలు తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఏపీ ఇదే చేస్తోంది. ఇలాంటి చిన్నచిన్న లింకులు చేయవచ్చు కానీ… దేశం మొత్తం.. నదులన్నీ అనుసంధానం చేస్తామంటే… దాని వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి ఆలోచించాల్సిందే. నిజానికి ఇలా నదుల అనుసంధానం చేయాలంటే… అంతర్రాష్ట్ర వివాదాలు ఎన్నో వస్తాయి. దీన్ని బట్టి చూస్తే… దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం చేయడం… సాధ్యం అయ్యే పని కాదని చెప్పుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

HOT NEWS

css.php
[X] Close
[X] Close