ప్రొ.నాగేశ్వర్: త్వరలో జగన్‌, కేసీఆర్‌లకు అగ్నిపరీక్ష ..!

త్వరలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. మామూలగా అయితే ఈ ఎన్నికకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు.కానీ ఈ సారి ఎన్నిక మాత్రం. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి శీల, అగ్నిపరీక్షగా మారబోతున్నాయి. ఈ రెండు పార్టీలు.. ఇప్పటి వరకు బీజేపీ విషయంలో దాగుడుమూతలాడుతున్నాయి. కేసీఆర్ .. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అని చెబుతున్నారు. కానీ…ఢిల్లీకి వెళ్తే… కేజ్రీవాల్ పోరాటానికి మద్దతు ఇవ్వలేదు. కేజ్రీవాల్ అటు కాంగ్రెస్ కు.. ఇటు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయినా మద్దతివ్వలేదు. ఆయన వ్యవహరించిన తీరుపై కాస్త అనుమానాలు రేకెత్తించారు. ఇక ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఏం చేయబోతున్నాయి..?

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల విధానమేనా..?
రాజ్యసభలో పరిస్థితి ఏమింటే.. బీజేపీ, కాంగ్రెస్ లకు కానీ..వాటి కూటములకు కానీ మెజార్టీ లేదు. బీజేపీకి 69, కాంగ్రెస్‌కు 51 సీట్లు ఉన్నాయి. ఎన్డీఏకు 106, యూపీఏకు 112 సీట్లు ఉన్నాయి. ఎవరూ కూడా సొంతంగా డిప్యూటీ చైర్మన్ పోస్టును పొందలేరు. అందుకే ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకం. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలన్నీ… కాంగ్రెస్, బీజేపీల వైపు చీలిపోయాయి. కానీ రెండు జాతీయ పార్టీల మధ్య దాగుడుమూతలాడుతున్న పార్టీలు నాలుగు ఉన్నాయి. ఒడిషాలో బీజేడీ, తమిళనాడులో అన్నాడిఎంకే, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలంగాణలో టీఆర్ఎస్. ఇప్పటికే బీజేడీ, అన్నాడీఎంకే కొన్ని చర్యల ద్వారా కాంగ్రెస్ కు దూరమని స్పష్టం చేశాయి. అంటే బీజేపీకి దగ్గరవుతున్న వాతారవణాన్ని కల్పించాయి. ఇక మిగిలింది.. వైఎస్ఆర్ కాంగ్రెస్, టీఆర్ఎస్. ఈ రెండు పార్టీలు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకే మద్దచిచ్చారు. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతామని చెబుతూ.. ఆ పార్టీ అభ్యర్థులకు ఎలా మద్దతిచ్చారని వచ్చిన విమర్శలకు.. రాజ్యాంగ పదవులకు పోటీని కోరుకోమని..అందుకే అధికార పార్టీ అభ్యర్థికి మద్దచిచ్చామని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరో వాదన కూడా చెప్పుకొచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా.. ప్రణబ్ ముఖర్జీకి మద్దతిచ్చినట్లు చెప్పుకొచ్చింది. అప్పుడు,ఇప్పుడు ఒకే విధానాన్ని పాటించామని చెప్పుకొచ్చింది.

సంప్రదాయాల్ని కాదని మరీ బీజేపీకి మద్దతిస్తారా..?
ఇప్పుడు రాజ్యసభ చైర్మన్ పోస్టు కూడా రాజ్యాంగ పదవే. ఒక సారి చైర్మన్ గా, రాజ్యసభ చైర్మన్ గా ఎన్నికయితే.. పార్టీలకు సంబంధం లేనట్లే. మరి ఇప్పుడు బీజేపీకి మద్దతిస్తారా..? ఈ ఎన్నికలతో ఈ రెండు పార్టీలు దాగుడు మూతలు ఆడటానికి అవకాశం లేదు. ఎందుకంటే.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మెజార్టీ ఉంది. అందుకే అప్పుడు ఏ వైఖరి తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ఇప్పుడు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కోసం .. ఎన్డీఏకు మెజార్టీ లేదు. భారకత పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం.. న్యాయంగా డిప్యూటీ చైర్మన్, డిప్యూటీ స్పీకర్ పదవులు ప్రతిపక్షాలకు రావాలి. ఈ ప్రకారం చూసినా… వైసీపీ కానీ.. టీఆర్ఎస్ కానీ.. ప్రతిపక్షాల అభ్యర్థికే మద్దతు ఇవ్వాలి. రాజ్యాంగబద్ద పదవులకు పోటీ ఉండకూడదన్న థీసిస్ ఇక్కడ పని చేయదు. ఇప్పుడు కూడా ఇలాగే వాదిస్తే… పార్లమెంటరీ సంప్రదాయాల్ని కూడా కాదని బీజేపీకి మద్దతు ఇచ్చినట్లే. ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ప్రజల ముందు ఓపెన్ గా చెప్పాలి.

కేసీఆర్‌కు ఎటో చెప్పుకోవాల్సిందే..!
మిత్రపక్షాల అభ్యర్థిని నిలబెట్టే ఎత్తుగడల్లో బీజేపీ, కాంగ్రెస్..!
బీజేపీ, కాంగ్రెస్ ఇంకో ఎత్తుగడ వేస్తున్నాయి. బీజేపీకి మెజార్టీ లేదు. బీజేడీ, అన్నాడీఎంకే,. టీఆర్ఎస్, వైసీపీలు మద్దతివ్వడానికి ఇబ్బందులు ఉంటే… మిత్రపక్షం అయిన శివసేన అభ్యర్థిని రంగంలోకి దించాలని ఆలోచిస్తోంది. అప్పుడేం చేస్తారు…?. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు కాబట్టి.. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి మద్దతివ్వరు. కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెట్టి.. శివసేనతో పోటీ పడితే… చంద్రబాబు ఎవరికి మద్దతిస్తారు..?. ఈ విషయంలో చంద్రబాబుకు ఓ సానుకూలత ఉంది. కాంగ్రెస్ కూడా.. తన అభ్యర్థిని కాకుండా.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీని నిలబెట్టాలని ఆలోచిస్తోందని తెలుస్తోంది. తృణమూల్ అంటే… వామపక్షాలు మద్దతివ్వవు. వారు ఓటింగ్ నుంచి బాయ్ కాట్ చేస్తారు. ఒక వేళ తృణమూల్ కాకుండా.. డీఎంకే అభ్యర్థిని పెట్టారనుకుందాం.. అప్పుడు చంద్రబాబునాయుడుకు సమస్య ఉండదు. అప్పుడు టీఆర్ఎస్‌కు ఎవరికి మద్దతిస్తుంది..? ఇప్పటి వరకు కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల కూటమి పేరుతో కేసీఆర్ పలువురు నేతలతో సమావేశమయ్యారు. కేసీఆర్ సమావేశమైన వారిలో మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, దేవేగౌడ, స్టాలిన్ లతో సమావేశమయ్యారు. ఈ పార్టీల నుంచి.. ఎవరైనా అభ్యర్థి నిలబడితే.. కేసీఆర్ కచ్చితంగా వారికే మద్దతివ్వాలి. కాంగ్రెసేతర, బీజేపీయేతర అభ్యర్థికి మద్దతివ్వాలి. అలా ఇవ్వనప్పుడు టీఆర్ఎస్ బీజేపీ వైపు ఉన్నట్లే. అంటే బీజేపీకి మిత్రపక్షమా కాదా అన్నది తేలిపోతుంది.

వైసీపీ, టీఆర్ఎస్‌లకు ఇక దాగుడు మూతలు కుదరవు..!
పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి.. ఏ పార్టీ తరపున, ఏ కూటమి తరపున ఎవరు పోటీ పడతారని తేలిన తర్వాత… టీఆర్ఎస్ , వైసీపీలు ఓ స్పష్టమైన విధానం ప్రకటించక తప్పదు. అప్పుడు దాగుడు మూతలు ఆడటానికి అస్సలు అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు దీనికి విరుగుడుగా అంటూ ఓ కొత్త విధానాన్ని కూడా… ప్రచారంలోకి తెస్తున్నారు. దాని ప్రకారం.. టీఆర్ఎస్ ఎంపీ కేకేని… రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇటీవలి ఢిల్లీలో కేసీఆర్ కూడా.. దీనిపై … మోదీతో చర్చించారని ప్రచారం జరుగుతోంది. ఇలా జరిగినా టీఆర్ఎస్ తన విధానాన్ని దాచుకోవడానికి అవకాశం లేదు. కేకేని అభ్యర్థిగా నిలబెట్టి.. ఎన్డీఏ మద్దతు ప్రకటించిందంటే.. దానర్థం. టీఆర్ఎస్ బీజేపీ కూటమిలో ఉన్నట్లేగా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...
video

‘మ‌న‌మే’ ఫ‌స్ట్ సింగిల్: సోలో లైఫే సోబెట‌రంటున్న శ‌ర్వా!

https://www.youtube.com/watch?v=XGJtiqVzZiA ఈమ‌ధ్య టాలీవుడ్ లో గ‌ట్టిగా వినిపిస్తున్న పేరు... హేష‌మ్‌ అబ్దుల్ వాహ‌బ్‌. 'ఖుషి', 'హాయ్ నాన్న‌' సినిమాల్లో సూప‌ర్ హిట్ పాట‌లు ఇచ్చారు. ఇప్పుడు శ‌ర్వానంద్ 'మ‌న‌మే' చిత్రానికీ ఆయ‌నే స్వ‌రాలు అందిస్తున్నారు....

ఇంకా “బలమైన” భ్రమల్లోనే కేటీఆర్ !

కేటీఆర్ నియోజకవర్గాల వారీ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డిని తిట్టి... ఎన్నికల్లో దున్నిపారేస్తామని ప్రసంగించి వెళ్లిపోతున్నారు. గ్రౌండ్ లెవల్లో పరిస్థితిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం లేదు. కనీసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close