ప్రొ.నాగేశ్వర్ : గ్యాస్ సిలిండర్ల ధరలు ఎందుకు నియంత్రించడం లేదు..?

తెలంగాణలో రాజకీయ వేడి పెరిగింది. ప్రచారం ఊపందుకుంది. రాజకీయ పార్టీలన్నీ మ్యానిఫెస్టోలు విడుదల చేస్తున్నాయి. రకరకాల సంక్షేమ హామీలు ప్రకటిస్తున్నాయి కానీ.. నిత్యావసర వస్తువుల ధరల ప్రస్తావన మాత్రం ఏ పార్టీ తీసుకు రావడం లేదు. గత నాలుగేళ్లలో జరిగిన అనూహ్య పరిణామం.. గ్యాస్ , పెట్రోల్ , డీజిల్ ధరలు పెరిగిపోవడం. గతంలో ఒక రూపాయి.. రెండు రూపాయలు పెంచినప్పుడు.. రాజకీయ పార్టీలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు నిర్వహించేవి. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలకు అలవాటైపోయింది.

రెండేళ్లలో రూ. 400 పెరిగిన గ్యాస్ సిలండర్..!

రేట్లు పెంచిన ప్రతీసారి కేంద్రం ఓ మాట చెబుతూ ఉంటుంది. తాము పెంచిన ధరులు పేదవాడిపై భారం కాదని చెబుతూ ఉంటుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే.. అది సామాన్యుడిపై భారం కాదా..? ఉదాహరణకు గ్యాస్ సిలిండర్ రేటు పెరిగితే…సామాన్యులు భరించలేరు. ఉదాహరణకు.. దాదాపుగా ఐదు కోట్ల గ్యాస్ కనెక్షన్లను.. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఉచితంగా ఇచ్చామని కేంద్రం చెబుతోంది. రోజుకు 131 రూపాయల కన్నా.. తక్కువ ఆదాయం ఉన్న వారిని… దారిద్ర రేఖ కన్నా.. దిగువన ఉన్నవారిగా చెబుతారు. ఇలాంటి వారికి .. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద ఐదు కోట్ల మందికి కనెక్షన్లు ఇచ్చామని చెబుతున్నారు. కనెక్షన్ ఉచితంగా ఇచ్చినా… సిలిండర్ కొనుక్కోవాలి కదా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యి దాటింది. అంటే.. వారం రోజుల ఆదాయాన్ని గ్యాస్ సిలిండర్‌కే కేటాయిచాలి. 2016-18 మధ్య కాలంలో.. సబ్సిడీ సిలిండర్ ధర 25శాతం పెరిగింది. సబ్సిడీ లేని సిలిండర్ ధర 80 శాతం పెరిగింది. 2016లో రూ. 527 ఉన్న సిలిండర్… ఇప్పుడు.. 2018 నవంబర్ లో..942 అయింది. రెండేళ్లలోనే రూ. 400కుపైగా రేటు పెంచింది. ఈ మొత్తం సామాన్యునిపైన భారమే.

కనెక్షన్లు పెరిగినా వాడేవాళ్లు తగ్గిపోతున్నారా..?

గ్యాస్ కనెక్షన్లు దేశంలో పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారు. పల్లెటూళ్లలో గ్యాస్ వినియోగం పెరుగుతోంది. 2016లో 16 కోట్ల 63 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. 2018లో 23 కోట్ల 45 లక్షలు అయ్యాయి. అంటే గ్యాస్ కనెక్షన్లు పెరుగుతున్నాయి. ఇంటింటికి గ్యాస్ ఇస్తున్నామని.. కేంద్రం చెబుతోంది కానీ.. వాస్తవం మాత్రం వేరేగా ఉంది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారమే.. యాక్జివ్ కన్జూమర్స్ గణనీయంగా తగ్గారు. అంటే..సిలిండర్ అయిపోయినా కొనుగోలు చేయని వాళ్లు. మూడు నెలల వరకూ.. సిలిండర్ అయిపోయినా… మళ్లీ సిలిండర్ కొనుగోలు చేసేవాళ్లు తక్కువగా ఉన్నారు. అంటే.. సిలిండర్ అయిపోయినా కూడా.. సిలిండర్ కొనడం లేదంటే.. అర్థం .. ఆర్థికంగా భారం కావడమనే కదా.. !. ఇంట్లో గ్యాస్ ఉంటుంది… ఎమర్జెన్సీలో వాడతారు. అంటే.. కేంద్ర చెబుతున్న ఉజ్వల్ పథకం ఎక్కడికిపోతుంది..? కేంద్రం అద్భుతాలు చేస్తున్నామని చెబుతున్నప్పుడు.. ఇలా ఎందుకు జరుగుతుంది. 23 కోట్ల 45 లక్షల గ్యాస్ కనెక్షన్లలో మూడున్నర కోట్ల మంది… ఇన్ యాక్టివ్ కన్జూమర్స్ గా మారారు. వీళ్లందరూ గ్యాస్ వాడటం లేదని అర్థం. ఇదందా కేంద్రం చెబుతున్న లెక్క.

క్రూడాయిల్ రేట్లు తగ్గుతున్నా గ్యాస్ ధర ఎందుకు పెరుగుతోంది..?

2016 గతంలో సగటున ఓ వ్యక్తి…తలసరి గ్యాస్ వినియోగం తొమ్మిది కేజీలకు పైగానే.. ఉండేది. అది ఇప్పుడు ఎనిమిది కేజీలకు తగ్గిపోయింది. కనెక్షన్లు పెరుగుతున్నా… ఎందుకు తగ్గిపోతోంది. అంటే.. ప్రజలు.. గ్యాస్ వాడటం లేదు. ధర భారం పెరిగిపోవడం వల్ల ప్రజలు పాద పద్దతుల్లో.. వంట చేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు. రెండేళ్లలో రూ. 4 వందలు పెరిగినా ఏ రాజకీయ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు. దానికి మాట్లాడటం. దీని ధర కేంద్రం చేతుల్లో ఉంటుంది… కాబట్టి… లోక్ సభ ఎన్నికల నాటికి అయినా ఇష్యూ అవుతుందా.. అన్నది ప్రశ్నార్థకమే. ప్రభుత్వాలను ప్రతిపక్ష పార్టీలు అనేక రకాల సమస్యలపై ప్రశ్నిస్తున్నాయి కానీ.. సామాన్యుడిగా గుదిబండగా మారిన గ్యాస్ ధరలపై మాత్రం మాట్లాడటం లేదు. దీనికి కారణం ఏమిటి..? పరిష్కారం ఏమిటి..? ప్రపంచ చమురు మార్కెట్లో అంతర్జాతీయ ముడి ధరలు పడిపోతున్నాయి. అయినప్పిటకీ.. ఎందుకు ధరలు పెరుగుతున్నాయి. దీనికి సమాధానం ఉండాలి కదా..? ఇలాంటి మౌలిక మైన సమస్యలపై.. ఎన్నికల్లో చర్చకు రావాలి. మీడియాలో కూడా.. దీనిపై చర్చ జరగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.