ప్రొ.నాగేశ్వర్ : వాజ్‌పేయి నుంచి బీజేపీ నేర్చుకోవాల్సిందేమిటి..?

భారత రాజకీయాల్లో అటల్ బిహారీ వాజ్ పేయి… అందరి ఆమోదం పొందిన వ్యక్తి. సహజంగా ఓ పార్టీని ఎవరైనా వ్యతిరేకిస్తే.. ఆ పార్టీ నాయకుడ్ని కూడా ఆటోమేటిక్ గా వ్యతిరేకిస్తారు. కొన్నాళ్ల క్రితం… కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ.. బీజేపీకి అంటరాని పార్టీగా చూశారు. కానీ వాజ్‌పేయి విషయంలో ఆ పరిస్థితి లేదు. బీజేపీ నాయకడిగా.. వాజ్‌పేయిని మాత్రం ఆమోదించారు. విచ్చిన్నకర శక్తుల ప్రాబల్యం కలిగిన పార్టీలో ఆమోదయోగ్యమైన పబ్లిక్ ఫేస్ గా …. వాజ్‌పేయిని అభివర్ణిస్తారు. బీజేపీ దరిదాపుల్లోకి కూడా పార్టీలు రాని సమయంలో వాజ్‌పేయిని చూసి… డీఎంకే, టీడీపీ, తృణమూల్ లాంటి పార్టీలు.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరాయి.

వాజ్‌పేయిని బీజేపీ ముసుగుగా వాడుకుందా..?

బీజేపీలో వాజ్‌పేయి పాత్ర ఎప్పుడూ సంక్లిష్టమే. గోవిందాచార్య అనే బీజేపీ సీనియర్ నేత, వాజ్‌పేయి సహచరుడు… బీజేపీకి వాజ్‌పేయి మా ముసుగు మాత్రమే. మా భావాలు, సిద్ధాంతాలు ఎప్పుడూ మాకుంటాయన్న ప్రకటన చేశారు. జనం ముందు చూపించడానికి మాత్రమే…వాజ్‌పేయిని ఓ ముసుగుగా చెప్పుకొచ్చారు. అది ఓ పెద్ద వివాదం అయింది కూడా. ఇలా అన్నది ప్రత్యర్థులు కాదు. బీజేపీలోని అగ్రశ్రేణి నాయకుడు. నిజంగానే.. బీజేపీకి వాజ్‌పేయి ముసుగా..? లేక… పార్టీలో మార్పు తేవడానికి ప్రయత్నించారా..? అన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. రాజకీయాల్లో వివాదాస్పదమైన వ్యక్తులుంటారు. విపరీతమైన పోలరైజింగ్ ఫిగర్స్ ఉంటారు. నరేంద్రమోడీని చూస్తే.. పూర్తిగా పోలరైజింగ్ ఫిగర్. కానీ అందర్నీ ఒకతాటికిపైకి తెచ్చి.. అందరితోనూ ఆమోదయోగ్యత పొందగలిగిన నేత… బీజేపీ తొలి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి. మోడీని అభిమానించేవారు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారో.. మోడీని వ్యతిరేకించేవారు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉన్నారు.

ప్రజలకు చీల్చే రాజకీయాలకు అటల్ దూరం..!

రాజకీయం చేయాలంటే రాజీ పడాలి. కానీ ప్రామాణికమైన మానవీయ విలువల విషయంలో మాత్రం రాజీ పడకూడదు. మోడీ ఇప్పుడు బీజేపీకి పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వానికి ప్రధాని. వాజ్‌పేయి .. బీజేపీకి 182 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పుడు ప్రధాని బాధ్యతలు చేపట్టారు. బహుశా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంతకన్నా భిన్నమైన నాయకుడు ఉండి ఉంటే… సంకీర్ణ రాజకీయాలు సాధ్యమయ్యేది కాదు. అలా అని ఆయన బీజేపీ పార్టీ వ్యక్తి కాదు.. ఆయన బీజేపీ సిద్ధాంతాలు పాటించలేదు అని అనలేం. ఆయన కచ్చితంగా బీజేపీ నాయకుడే. బీజేపీ సిద్దాంతాలను విశ్వసించారు. బీజేపీలో కూడా అంతర్గత సిద్దాంతాల సంఘర్షణ ఉంది. బీజేపీ ఎలాంటి విలువలు, సిద్దాంతాలు పాటించాలన్నదానిపై నిరంతర సంఘర్షణ ఉండేది. ప్రజల్ని నిలువునా చీల్చేలా… సిద్దాంతాలు ఉండాలా.. ప్రజలను కలిపేలా…. ఉండాలా అన్నదానిపై వాజ్‌పేయి ఓ వైఖరి తీసుకుని.. దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు మనకు కనిపిస్తుంది.

బీజేపీలో అతివాద భావాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిన అటల్..!

భిన్నమతాలు, సంస్కృతులు ఉన్న భారతదేశంలో అందర్నీ కలుపుకుని వెళ్లడం తప్ప మరో మార్గమే లేదని.. వాజ్‌పేయి చెప్పారు. అది ఆయన రాజకీయ దార్శనికతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఓ రాజకీయ నేతగా.. తన పార్టీ పరిధులు దాటి.. సిద్దాంతాలను దాటి… ఓ విస్తృతమైన విశాలమైన భావజాలాన్ని.. వ్యాప్తి చేసే ప్రయత్నం చేశారు. బాబ్రీమసీదు కూల్చివేత.. రామజన్మభూమి నిర్మాణం విషయంలో… బీజేపీ పూర్తిగా రాజకీయంగా లాభపడింది. ఆ సమయంలో.. దేశమంతా ఉద్రిక్తతలు సృష్టించింది. బీజేపీ నేత అడ్వాణీ రథయాత్ర చేశారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ మొత్తం… అడ్వాణీ వెంట నడిచింది. కానీ అటల్ బిహారీ వాజ్‌పేయి మాత్రం.. ఈ రథయాత్ర ఇమేజ్‌ను డీమార్కెట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ రథయాత్ర ఆయనకు ఇష్టం లేదు. ప్రజలను చీలుస్తుందని ఆయన భావించారు. కానీ ఆయన రథయాత్రకు వ్యతిరేకంగా ఎక్కడా మాట్లాడలేదు. కారణం.. ఆయనకు పార్టీపై ఉన్న విధేయత, గౌరవం కావొచ్చు. అందుకే ఆయనను రైట్ మ్యాన్ ఇన్ రాంగ్ పార్టీ అని అంటూంటారు. చాలా సందర్భాల్లో మీరు భావాలకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో మీరు కొనసాగుతారా..? వైదొలుగుతారా అన్న ప్రశ్నలను ఆయన ఎదుర్కొన్నారు. తాను ఎక్కడికి వెళ్లగలనని.. .వాజ్‌పేయి అనేక సందర్భాల్లో ఎదురు ప్రశ్నించారు. అమెరికాలో ఓ సందర్భంలో ఈ విషయంపై స్పష్టమైన సమాధానం చెప్పారు. ప్రధానిగా కొన్నాళ్లు ఉండొచ్చు.. ఆ తర్వాత ఉండకపోవచ్చు. కానీ అ స్వయం సేవకునిగా… ఎప్పుడైతే ప్రయాణం ప్రారంభించానో.. చనిపోయే వరకూ.. స్వయం సేవకునిగానే ఉంటానని చెప్పుకొచ్చారు. అంటే ఆయన ఆరెస్సెస్ కుఅంత నిబద్ధుడన్నమాట. ఆయన తన ఆరెస్సెస్, బీజేపీ భావజాలానికి విరుద్దమైన వ్యక్తిగా చెప్పలేం. కానీ అతి వాద భావాలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. అందులో ఆయన చాలా సార్లు విఫలమై ఉండొచ్చు.

మోడీ రాజధర్మాన్ని అతక్రమించారని తేల్చిన అటల్..!

గుజరాత్ లో గోద్రా అల్లర్లు చెలరేగినప్పుడు బీజేపీ మొత్తం నరేంద్రమోడీ వెంట నిలబడింది. కానీ వాజ్‌పేయి మాత్రం వ్యతిరేకించారు. ప్రజలను చీల్చడం ఆమోదయోగ్యం కాదని వాజ్‌పేయి వాదించారు. బాబ్రీమసీదు కూల్చివేత సమయంలోనూ ఇలాంటి ప్రస్తావనే తీసుకు వచ్చారు. మోడీని పదవి నుంచి దింపేయాలన్న పట్టుబట్టిన వ్యక్తి… వాజ్‌పేయి. ఆ ఘటన జరిగినప్పుడు బీజేపీ అత్యున్నత సమావేశంలో మోడీ రాజధరాన్ని అతిక్రమించాడని వాజ్‌పేయి తేల్చారు. అధికారంలో ఉన్నప్పుడు.. కులాలు, మతాల కారణంగా ప్రజల్ని వేరుగా చూడకూడదని తేల్చి చెప్పారు. ఇది మోడీ సమక్షంలోనే అన్నారు. అయితే ఆ సమయంలో మోడీకి అడ్వానీ మద్దతుగా నిలిచారు. దాంతో మిగతా నేతలంతా మోడీ రాజీనామా చేయకూడదన్నారు. దాంతో మోడీ రాజీనామా చేయకూడదని బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటీవ్ కమిటీ తీర్మానించింది. అప్పుడు వాజ్‌పేయి కాంప్రమైజ్ అయ్యారు.

ప్రత్యర్థుల్ని కూడా గౌరవించే విలువలు అటల్ సొంతం..!

విచిత్రం ఏమిటంటే.. అదే అడ్వాణీని ఈ రోజు మోడీని అవమానిస్తున్నారు. అంటే ప్రత్యర్థుల్ని కూడా గౌరవించగలిగే మనస్థత్వం వాజ్‌పేయిది. 2003లో కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం పెట్టినప్పుడు… వాజ్‌పేయి.. వ్యక్తిగతంగా నేను ఏమీ అననని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధానాలపైనే … ఆ పార్టీ రాజకీయాలపైనే స్పందిస్తానన్నారు. కానీ అదే సమావేశంలో బీజేపీ నేత సుష్మాస్వరాజ్ మాత్రం సోనియాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. రాజీవ్ గాంధీ… వితంతువుగా త ప్ప… సోనియాకు ఉన్న అర్హతలేమిటని ప్రశ్నించారు. డిబేట్ లో కూడా… సోనియాను వాజ్‌పేయి పల్లెత్తు మాట అనలేదు. అందుకే సోనియాగాంధీ కూడా… వాజ్‌పేయి సంతాప సందేశంలో అదే డిగ్నిటీ ప్రదర్శించారు. అంటే వాజ్ పేయి.. ప్రత్యర్థుల్ని కూడా అదే స్థాయిలో గౌరవించేవారు. కానీ ఇప్పుడు బీజేపీని ఎవరైనా వ్యతిరేకిస్తే.. మోడీ సేన.. అందర్నీ వ్యక్తిగతంగా దూషిస్తారు.

రాజకీయ భిన్నాభిప్రాయాలు వ్యక్తిగత దూషణలకు దారి తీయకూడదు..!

రాజకీయాల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన వ్యక్తిగతంగా దూషించకూడదు. ఈ విషయాన్ని వాజ్‌పేయి నుంచి బీజేపీ నేర్చుకోవాలి. సంతాపం దినాల కాన్సెప్ట్ ఏమిటంటే.. ఆయన విలువల్ని పాటించడమే. ఒకే ఒక్క ఎంపీ ఓటు తగ్గడంతో రాజీనామా చేశారు వాజ్ పేయి . ప్రధానమంత్రి పదవిని వదులుకున్నారు. ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు… ఒక్క ఓటు కొనుగోలు చేయలేరా..? కానీ అది ఆయన విలువరకు విరుద్దం. ఇప్పుడు వాజ్‌పేయి మహానాయకుడు అంటున్న వారెవరూ దీన్ని పట్టించుకోవడం లేదు. ప్రమాణికమైన రాజకీయ విలువలను పాటించడమే తన లక్ష్యమని… వాజ్‌పేయి చెబుతూంటారు. నెహ్రూని… గొప్ప దేశభక్తినిగా… ఆధునిక భారత నిర్మాతగా.. మానవతావాదిగా..గొప్ప రాజకీయ నేతగా కొలుస్తారు. కానీ ఇప్పుడు నెహ్రూపైన ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేస్తూంటారు. ఓ వైపు… తాము వాజ్ పేయి వారసులంటూనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటారు. నెహ్రూ విధానాలతో… వాజ్‌పేయి విధానాలతో ఏకీభవించకపోవచ్చు. కానీ దేశానికి వారి కంట్రిబ్యూషన్ పట్ల సంయమనంతో వ్యవహరించాలి.

బీజేపీ ఆ విలువలకు ప్రాధాన్యం ఇస్తుందా..?

బంగ్లాదేశ్ విమోచనాద్యమంలో… ఇందిరాగాంధీ పోషించిన పాత్రను.. వాజ్‌పేయి మనస్ఫూర్తిగా అభినందించారు. ఆమెను దుర్గాదేవిగా పోల్చారు. ఆమె ఎవరు..? వాజ్ పేయి చిరకాల రాజకీయ ప్రత్యర్థి. వాజ్‌పేయి… ప్రతిభను ఎప్పుడో గుర్తించిన నెహ్రూ.. ఈ యువకుడు…ఏదో ఒక నాటికి భారత ప్రధాని అవుతారని ప్రశంసించారు. ఆ రోజుల్లో ఉన్న విలువలు అలాంటివి. అందుకే.. ఏవైనా నేతకు… సంతాపం ప్రకటించడం..నివాళులు అర్పించడం అంటే… ప్రకటనలు కాదు… ఆయన విలువలను పాటించాలి. పూర్తి స్థాయిలో కాకుండా.. కొంత వరకైనా పాటించాలి. పార్టీ పరిధులు దాటి అయినా దాటి… విశాలమైన దృక్పథంతో దేశ ప్రజల కోసం పని చేయాలి. అలా చేయబట్టే.. చైనా, పాకిస్థాన్ లు… వాజ్‌పేయిని ఇప్పటికీ గౌరవించాయి. ఇలాంటి విలువలు ఉండబట్టే.. ఆయనను అందరూ గౌరవిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆయనకు.. చనిపోయిన తర్వాత అమితమైన గౌరవం ఇవ్వడం కాదు. ఆయన విలువలను పాటించే ప్రయత్నం చేయాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close