ప్రొ.నాగేశ్వర్ : టీడీపీతో దోస్తీ కాంగ్రెస్ పార్టీకి వరమా..? శాపమా..?

తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ప్రచారం తారస్థాయికి చేరింది. ఇలాంటి సమయంలో… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు చంద్రబాబును .. ఆంధ్రాబాబుగా విమర్శిన్నారు. టీడీపీని ఆంధ్రాపార్టీగా అభివర్ణిస్తున్నారు. ఈ సందర్భంలో… కాంగ్రెస్ పార్టీకి టీడీపీతో పొత్తు.. లాభమా… నష్టమా.. అన్న చర్చ ప్రారంభమైంది. నిజానికి డిసెంబర్ పదకొండో తేదీన… ఏం జరుగుతుందన్న దానిపై.. ఇప్పుడు తీవ్రమైన ఆసక్తి ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీతో పొత్తు వల్ల లాభం జరుగుతుందా.. నష్టం జరుగుతుందా.. అన్నదానిపై చర్చ నడుపుపుతున్నారు.

టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్‌కు నష్టమా..?

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోకపోయి ఉంటే… తెలంగాణ రాష్ట్ర సమితిపై సునాయాసంగా గెలిచి ఉండేవారని కొంత మంది చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల… కేసీఆర్ చేతిలో బలమైన ఆయుధం పెట్టారని.. అంటున్నారు. తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నంత బలం లేదు. బలం లేకపోయినా పొత్తులు పెట్టుకుని ఆ పార్టీ బలపడటానికి అవకాశం ఇస్తున్నారు. కేసీఆర్ బలంగా దాడి చేయడానికి అవకాశం కల్పించారు. ఇక రెండో … అభిప్రాయం కూడా ఉంది.. టీడీపీ ఎంత బలహీన పడిన కూడా… ఆ పార్టీకి సంప్రదాయక ఓటు బ్యాంక్ ఉంది. అన్నింటికీ మించి లక్షల మంది… సీమాంధ్రులు.. తెలంగాణలో ఉన్నారు.. వారందరి మద్దతు.. లభిస్తుందని అంచనా వేశారు. ఈ రెండు అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ రెండిటిలో ఒకటే కరెక్ట్ అని బలంగా చెప్పడానికి చాన్స్ లేదు. దీనికి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి.

సీమాంధ్రులంతా టీడీపీకి ఓట్లు వేస్తారా..?

తెలంగాణలో ఉన్న సీమాంధ్రులంతా… చంద్రబాబుకు సపోర్ట్ చేయడం లేదు. కూకట్ పల్లిలోనే.. ఇటీవలి కాలంలో.. కమ్మ సామాజికవర్గం ఓటర్లు టీడీపీకి వేస్తున్నా… రెడ్డి సామాజికవర్గం ఓటర్లు.. టీఆర్ఎస్‌కు .. అలాగే కాపు సామాజికవర్గం ఓటర్లు టీఆర్ఎస్ కు ఓటు వేస్తారని చెబుతున్నారు. జగన్ అభిమానులు.. పవన్ అభిమానులు… టీఆర్ఎస్ ను గెలిపించాలని కాకపోయినా… టీడీపీని ఓడించచాలనే పట్టుదతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. అందువల్ల సీమాంధ్రుల బలం మొత్తం టీడీపీకి ఉందని చెప్పలేము. చాలా మంది ఈ విషయంలోనే రాంగ్ ఎనాలసిస్ చేస్తున్నారు.

కూటమిగా ఏర్పడటం వల్ల రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చిందా..?

అయితే… కాంగ్రెస్ పార్టీతో కలిసి… టీడీపీ, టీజేఏఎస్, సీపీఐ పార్టీలు కలిసి కూటమిన ఏర్పాటు చేయడం మాత్రం… రాజకీయంగా వాతావరణం మారడానికి కారణం అయింది. సీపీఐ బలహీనమైన పార్టీ కావొచ్చు.. కోదండరాం పార్టీ ఉంటుందో.. ఉండదో అనే పరిస్థితికి వచ్చి ఉండవచ్చు.. కానీ.. ఈ పార్టీలన్నీ కలవడం వల్ల.. టీఆర్ఎస్ ను ఓడించవచ్చు… అనే ఓ అభిప్రాయాన్ని మాత్రం తీసుకు రాగలిగారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మంచి విజయాన్ని సాధించిందనే చెప్పుకోవాలి. కూటమిలో టీడీపీ ఉందా..మరో పార్టీ ఉందా అని కాదు.. దుర్భేధ్యంగా ఉన్న కేసీఆర్ ను.. ఓడించగలము అన్న నమ్మకాన్ని మహాకూటమి దావారా రాజకీయ పార్టీలు తెచ్చుకున్నాయి. ఇలాంటి వాతావరణం గతంలో లేదు. కానీ.. కీలక సమయంలో… వ్యూహాత్మకంగా వ్యవహరించి…. ప్రత్యామ్నాయం ఉందన్న భావన తీసుకు రాగలిగారు.

టీడీపీతో పొత్తు వల్ల లాభమేనని కాంగ్రెస్ అంచనా వేసుకుందా..?

అయితే పొత్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ లాభనష్టాలు అంచనా వేసుకుని ఉంటుంది. హార్డ్ కోర్ తెలంగాణ వాదులకు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు నచ్చి ఉండదు. కానీ.. ఇలాంటి వాళ్లందరూ… టీఆర్ఎస్ ఓటర్లు. కేసీఆర్ పాలనపై అసంతృప్తికి గురయి… ఈ సారి కాంగ్రెస్ కు ఓటు వేద్దామనుకునేవాళ్లు మళ్ళీ టీఆర్ఎస్ వైపు వెళ్లిపోతారు. ఇలాంటి వాళ్లు ఎంత మంది ఉంటారనేది ముఖ్యం. అలాగే… టీడీపీతో పొత్తు వల్ల..కలసి వచ్చే సంప్రదాయక ఓటు బ్యాంక్… వారి ఓటర్లు… తో పోలిస్తే.. వీరి సంఖ్య… ఎక్కువే ఉంటుందని. అంచనాకు వచ్చింది… అంటే.. కాస్ట్ ప్రాఫిట్ మేనేనేజ్ మెంట్ చూసుకుని… పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ మందడుగు వేసి ఉంటుందని… అనుకుంటున్నాను. ఖమ్మంలో హైదరాబాద్ లో … రాహుల్ గాంధీ – చంద్రబాబు సభలు, సమావేశాలకు వచ్చిన స్పందిన చూసిన తర్వాత.. టీడీపీతో పొత్తు వల్ల తమకు వచ్చేదెంత.. పోయేదెంత అనే లెక్కలు వేసుకుని ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. రాహుల్ – చంద్రబాబు టూర్ కు వచ్చిన స్పందనను.. ఓట్లుగా ఎంత వరకూ మార్చుకుంటారనేది కీలకం.

నమ్మకం లేని స్థితి నుంచి పోరాటానానికి టీడీపీ వల్లే వచ్చిందా..?

అయితే.. అన్ని పార్టీలు కలవడంవల్ల.. టీఆర్ఎస్‌ను ఓడించగలమనే నమ్మకాన్ని తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి టీఆర్ఎస్ ను సవాల్ చేసి ఉంటే… ప్రస్తుతం ఉన్నంత రాజకీయ పోటాపోటీ వాతావరణం ఉండేదే లేదో చెప్పలేము. కానీ అలా సవాల్ చేసే కాన్ఫిడెన్స్ లేని స్థితిలో తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా… ఆ బలం కూడగట్టుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్ ను గట్టిగా ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి వరమే. ఫలితాలు వచ్చిన తర్వాత కూడా… చంద్రబాబు వల్ల కాంగ్రెస్ కు మేలు జరిగిందా లేదా అని చెప్పలేము. చంద్రబాబు వల్లే ఓట్లు రావడం,, పోవడం ఉండదు. కానీ… టీడీపీతో కలవడం కాంగ్రెస్ పార్టీ… నమ్మకంతో.. టీఆర్ఎస్ ను ఢీకొడుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి లాభమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.