ప్రొ.నాగేశ్వర్: మోదీని ఢీ కొట్టడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు..?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఫెడరల్ ఫ్రంట్ మాట కేసీఆర్ నోటి నుండి రావడం లేదు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు కేసీఆర్‌కు మింగుడుపడనివే. అక్కడ జేడీఎస్ .. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందుకే… కేసీఆర్ కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కూడా కేసీఆర్ వెళ్లలేదు. ఒక రోజు ముందుగానే వెళ్లి కుమారస్వామిని అభినందించి వచ్చారు. దానికి ఆయన కలెక్టర్ల మీటింగ్ ఉందని కారణం చెప్పారు. కానీ… అసలు విషయం మాత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో వేదిక పంచుకోవడం ఇష్టం లేకనే కేసీఆర్ వెళ్లలేదన్న విషయం అందరికీ అర్థమయింది. ఆ వేడుక కాంగ్రెస్‌కు లాభం చేకూర్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు బలం చేకూరే ఏ పని కూడా కేసీఆర్ చేయలేరు. ఎందుకంటే.. ఆయనకు తెలంగాణలో కేసీఆర్‌కు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అని చెప్పినా దానిపై రాష్ట్ర స్థాయి రాజకీయాల ప్రభావం కచ్చితంగా ఉంటుంది. వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు.

ఆ నలుగురితో కేసీఆర్ ఎందుకు కలవలేదు..?

నీతి ఆయోగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లారు. అక్కడ జరిగిన డెవలప్‌మెంట్ ఏమిటంటే… నలుగురు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, చంద్రబాబు, కుమారస్వామి, పినరయి విజయన్… ఆందోళన చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించారు. కేజ్రీవాల్ కుటుంబసభ్యులను కలిసి ధైర్యం చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన న్యాయసమ్మతమైనదని తేల్చారు. వీరి వెంట తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లలేదు. ఓ నోటి మాట ద్వారా కూడా కేజ్రీవాల్‌కు మద్దతు పలికే ప్రయత్నం చేయలేదు. నిజానికి కేసీఆర్ పెట్టదలచిన ఫెడరల్ ఫ్రంట్ విషయంలో ఈ నలుగురిలో ముుగ్గురితో కేసీఆర్ చర్చలు జరపడమో.. జరుపుతానని చెప్పడమో జరిగింది. కోల్‌కతా వెళ్లి మమతా బెనర్జీని, బెంగళూరు వెళ్లి కుమారస్వామిని కలిశారు. చంద్రబాబు చిరకాల మిత్రుడు.. ఆయనను కూడా కలుస్తామన్నారు. పైగా ఈ ముఖ్యమంత్రులెవరూ… కాంగ్రెస్‌తో అత్యంత సన్నిహితంగా ఉండటం లేదు. కాంగ్రెస్‌తో ఇప్పటికి పొత్తు పెట్టుకున్నవారు కూడా లేరు. పినరయిన విజయన్ పార్టీ సీపీఎం కూడా .. కాంగ్రెస్‌తో వెళ్లే ప్రసక్తే లేదంటోంది. అరవింద్ కేజ్రీవాల్‌ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నరు. కానీ కాంగ్రెస్‌ ఆయనకు మద్దతు ప్రకటించలేదు. కాంగ్రెస్‌ మద్దతు లేని… బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న కేజ్రీవాల్‌కు మద్దతుగా కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు..?. నలుగురు ముఖ్యమంత్రుల్లో అందరూ… తనతో కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నారని.. కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అయినా మద్దతు తెలిపేందుకు సంఘిభావం తెలిపేందుకు సిద్ధపడలేదు.

కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించకపోవడానికి కారణం ఏమిటి..?

కేజ్రీవాల్… పోరాడతున్న అంశం ఏమిటి..?. లెఫ్టినెట్ గవర్నర్ అజమాయిషీ మీద పోరాడుతున్నారు. కేంద్రం ఆధిపత్యంపై పోరాడుతున్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్రం హోదా కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ .. ఇప్పుడు ఎందుకు కేజ్రీవాల్‌కు మద్దతు తెలుపడం లేదు..?. 1952 నుంచి… కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు.. .ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతున్నాయి. 1967లో అద్వానీ ఢిల్లీ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్నప్పటి నుంచీ ఈ డిమాండ్ ఉంది. ఢిల్లీ నుంచి ఎదిగిన బీజేపీ అగ్రనేతలందరూ… ఈ డిమాండ్‌ను వినిపిచిన వారే. గతంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన డిమాండ్‌ను ఇప్పుడు కేజ్రీవాల్ చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్.. పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం పోరాడుతున్న కేజ్రీవాల్‌కు ఎందుకు మద్దతు ప్రకటించరు..?. ఇప్పిటికీ కేసీఆర్ తాను కేంద్రం ఆధిపత్యంపై పోరాడుతన్నానని .. ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నానని ఇప్పటి వరకూ చెబుతూ వచ్చారు. రాష్ట్రాలకు అధికారాలు ఉండాలి.. రిజర్వేషన్లు రాష్ట్ర పరిధిలో ఉండాలని వాదిస్తున్నారు కేసీఆర్. ఇలా ఏ విధంగా చూసినా… కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపిన నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి ..తాను కూడా సంఘిభావం ప్రకటించాల్సింది. మరి ఎందుకు ఇవ్వలేదు. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరు కాకపోవడానికి రీజన్ ఉంది. కానీ… కేజ్రీవాల్‌కు మద్దతు ప్రకటించకపోవడానికి మాత్రం కారణం లేదు.

బీజేపీకి, మోదీకి ఎదురెళ్లడానికి కేసీఆర్ వెనుకాడుతున్నారు.. !

కేజ్రీవాల్‌ ఎవరిపై పోరాడుతున్నారు. బీజేపీపై పోరాడుతున్నారు. మోదీపై పోరాడుతున్నారు. బీజేపీపై పోరాడేవారికి…మోదీని ప్రశ్నించేవారికి.. మద్దతుగా ఉండటానికి కేసీఆర్ సిద్ధంగా లేరని ఇప్పటి వరకూ విమర్శలు వస్తున్నాయి. అలాగే పదిహేనో ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్… పలు రాష్ట్రాలకు నష్టం కలిగించబోతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకే కాదు పంజాబ్ లాంటి రాష్ట్రాలకు కూడా నష్టమే. తెలంగాణకు ఆ నష్టం మరింత ఎక్కువ. అందుకే ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కు వ్యతిరేకంగా ఆర్థిక మంత్రులు.. ముందుగా కేరళలో ఆ తర్వాత అమరావతిలో సమావశం అయ్యారు. పదిహనో ఆర్థిక సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై అభ్యంతరాలున్నాయని తెలంగాణ ఆర్థిక మంత్రి కూడా.. గతంలోస్పష్టంగా ప్రకటించారు. అయినా తమ అభ్యంతరాలను… నేరుగా కేంద్రానికి చెబుతామన్నారు కానీ.. ఆయా రాష్ట్రాలతో కలిసి పోరాడటానికి మాత్రం ముందుకు రాలేదు. అంటే.. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఆయన సిద్ధంగా లేరని చెప్పుకోవచ్చు.

దేశ్‌ కీ నేత చాన్స్ చంద్రబాబుకి ఇచ్చేశారా..?
నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అంటున్నా కూడా.. బీజేపీని మోదీని డైరక్ట్‌గా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని స్పష్టమవుతోంది. దేశ్‌ కి నేత కేసీఆర్ అనే నినాదాన్ని తెచ్చింది కేసీఆర్. కానీ వచ్చిన అవకాశాల్ని కేసీఆర్ వదిలేసుకుంటున్నారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా వెళ్లిన నలుగురు ముఖ్యమంత్రుల్లో ముందుగా విలేకరులతో చంద్రబాబు మాట్లాడారు. ఏపీ భవన్‌కు వెళ్లి చంద్రబాబుతో.. ముగ్గురు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. అంటే.. వచ్చిన అవకాశాన్ని కేసీఆర్ చంద్రబాబునాయుడుకు ఇచ్చేశారు. అసలు చంద్రబాబునాయుడు ఎన్డీఏకు గుడ్ బై చెప్పక ముందే… కేసీఆర్.. నాన్ బీజేపీ, నాన్ కాంగ్రెస్ అంటూ ఫెడరల్ ఫ్రంట్ ను ప్రకటించారు. అంటే కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలను నడిపించే అవకాశం ఉన్నా కూడా.. కేసీఆర్ దాన్ని వదిలేసుకుంటున్నారు. జాతీయ రాజకీయాల్లో తన పాత్రను వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు కానీ.. బీజేపీని, మోదీని ఢీకొట్టడానికి సిద్ధంగా లేరు. దీని వల్ల 2019 తర్వాత అయినా కేసీఆర్ బీజేపీతో జట్టు కడతారనే అంచనాలు బలంగా ఏర్పడుతున్నాయి.

కాంగ్రెస్‌ సన్నిహిత పార్టీలతోనే సంప్రదింపులు..!

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ కలిసిన వాళ్లంతా… కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్న వాళ్లనో… పొత్తు పెట్టుకోబోయేవాళ్లను మాత్రమే కేసీఆర్ కలిశారు. మమతా బెనర్జీ,కుమారస్వామి, స్టాలిన్, హేమంత్ సోరెన్, అఖిలేష్ లాంటి వాళ్లందర్నీ కేసీఆర్ కలిశారు. కానీ ఎన్డీఏలో ఉండి బీజేపీపై అసంతృప్తితో ఉన్న… శివసేన, పీడీపీ, జేడీయూ, అకాలీదళ్ లాంటి పార్టీలను కలిసేందుకు కేసీఆర్ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. బీజేపీతో స్నేహం చేస్తాయని భావిస్తున్న పార్టీలనూ ఆయన కలవలేదు. కేవలం కాంగ్రెస్‌కు దగరయిన.. దగ్గరవుతాయని భావిస్తున్న పార్టీలతో మాత్రమే సంప్రదింపులు జరిపారు. దీన్ని బట్టి తెలిసిందేమిటంటే… కేసీఆర్… కాంగ్రెసేతర, బీజేపీయేతర కూటముల్లో కాకుండా.. బీజేపీ పంచన చేరడానికే కసరత్తు చేసుకుంటున్నారు. అందుకే… బీజేపీని, మోదీని ఢీకొట్టడానికి పూర్తిగా వెనుకడుగు వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close