ప్రొ.నాగేశ్వర్: బీజేపీకి గత ఎన్నికల్లో కన్నా సీట్లు పెరిగే అవకాశం ఉందా..?

భారతీయ జనతా పార్టీ.. వచ్చే ఎన్నికల్లోనూ తాము అఖండ విజయం సాధించబోతున్నట్లు ప్రకటిస్తోంది. జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అదే ప్రకటన చేశారు. గత ఎన్నికల కంటే ఎక్కువ మెజార్టీ తెచ్చుకుంటామని ఆ పార్టీ చీఫ్ అమిత్ షా చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. అఖండ మెజార్టీ సాధించింది. కానీ ఈ సారి అది సాధ్యమా..?

ఒడిషా, బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయా..?

బీజేపీ చెబుతున్నట్లు… మెజార్టీ సీట్లు సాధించడానికి అవకాశం ఉందో లేదో.. రాష్ట్రాల వారీగా పరిశీలిద్దాం. బీజేపీకి సీట్లు పెరగాడనికి అవకాశం ఉన్న రాష్ట్రాలను చూద్దాం. ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఈనాశ్య రాష్ట్రాల్లో.. గతం కన్నా బీజేపీకి సీట్లు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఒడిషాలో 21 సీట్లు ఉన్నాయి. గతంలో ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఒడిషాలో బీజేపీ కొంచెం బలం పుంజుకుంది. ఈ సారి కనీసం పది, పన్నెండు సీట్లు అయినా వస్తాయని అంచనా. బిజూదనతాదళ్‌ను తక్కువ అంచనా వేయలేం. అక్కడ ముక్కోణపు పోటీ ఉంటుంది. కాంగ్రెస్, బీజేపీ, బిజూ జనతాదళ్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ పోటీలో బీజేడీకి అత్యధిక సీట్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అయినా కూడా.. ఒడిషాలో.. బీజేపీకి అదనంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. అసోంలో గత ఎన్నికల్లో 7 సీట్లు గెల్చుకుంది. అక్కడ పధ్నాలుగు సీట్లు ఉన్నాయి. ఇటీవల వెల్లడవుతున్న సర్వేల్లో బీజేపీ వెనుకబడి ఉందన్న ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఒక వేళ వెనుకబడి లేదు.. బాగానే ఉందని అనుకున్నాం. అలా అనుకున్నారు.. మూడు, నాలుగు సీట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఒడిషా, అసోంలలో కలిపి… పదిహేను సీట్ల వరకూ పెరగొచ్చు. పశ్చిమబెంగాల్‌లో ప్రస్తుతం ఒక్క సీటే ఉంది. అక్కడ చదుర్ముఖ పోటీ ఉంటుంది. ఇలా పోటీ జరిగితే తృణమూల్ కాంగ్రెస్‌కి మెజార్టీ సీట్లు వస్తాయి. ఎలా చూసినా.. ఇక్కడ ఓ నాలుగైదు సీట్ల వరకూ బీజేపీ పెంచుకునే అవకాశం ఉంది. ఇక నార్త్ ఈస్ట్ లో కలిపి.. దాదాపు పది సీట్లు ఉన్నాయి. వీటిలో ఓ మూడు , నాలుగు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఒడిషా, బెంగాల్, నార్త్ ఈస్ట్, అసోంలలో ఉన్న 87 స్థానాల్లో బీజేపీకి కచ్చితంగా 25 నుంచి 30 వరకూ వచ్చే అవకాశం ఉంది.

హిందీబెల్ట్‌లో బీజేపీకి పరిస్థితి దారుణంగా ఉందా..?

మరి బీజేపీ పోగొట్టుకునే సీట్లు ఎన్ని ఉంటాయి. 325 సీట్లలో బీజేపీ పోగొట్టుకునేవే ఎక్కువ ఉంటాయి. ఉదాహరణకు.. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను గెలుచుకుంది. ఉపఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. ఇప్పుడు యూపీలో బీజేపీ ఎదురీదుతోంది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. యూపీలోనే బీజేపీ.. 40 నుంచి 50 సీట్లు కోల్పోతుంది. అంటే… ఒడిషా, నార్త్ ఈస్ట్‌లో గెలుచుకున్న వాటితో పోలిస్తే.. రెట్టింపు యూపీలో పోతాయి. ఇక గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్‌లలో బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గుజరాత్‌లో వెనుకబడిపోయింది. ఢిల్లీలో ఓడిపోయింది. ఈ సారి ఆయా రాష్ట్రాల్లో కనీసం సగం సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. అలాగే జార్ఘండ్, ఉత్తరాఖండ్..లలోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో గెలిచిన వాటిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇదే పరిస్థితి రాజస్థాన్, మధ్య ప్రదేశ్‌లలో కూడా ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ -జేడీఎస్ లు కలసి పోటీ చేస్తే… సింగిల్ డిజిట్ సీట్లకే పడిపోయింది. ఇప్పుడు అక్కడ బీజేపీకి 17మంది ఎంపీలున్నారు. ఇక మహారాష్ట్రలో మిత్రపక్షం శివసేనతో కలిసి గత ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించింది. ఇప్పుడు రెండు పార్టీల మధ్య పరిస్థితి బాగా లేదు. విడివిడిగా పోటీ చేస్తామంటున్నారు. కలసి పోటీ చేసినా.. విడిపోయి పోటీ చేసినా… ఇప్పుడు ఉన్న సీట్లు రావడం కూడా కష్టమే.

కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో ఒక్క సీటు అయినా వస్తుందా..?

ఇక మిగిలింది కర్ణాటక కాకుండా మిగిలిన దక్షిణ భారతదేశం. తెలంగాణలో గత ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చింది. ఈ సారి అది కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. ఏపీలో టీడీపీ మద్దతుతో వచ్చిన సీట్లు అవి. ఇప్పుడు టీడీపీతో పొత్తు లేదు కనుక ఒక్క సీటు కూడా రాలేదు. తమిళనాడులో సీటే లేదు. వచ్చే అవకాశం కూడా లేదు. కేరళలో కూడా అందే. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో ఉన్న 101 సీట్లలో బీజేపీకి ఒకటి, రెండు కూడా వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ఇక బీహార్‌లో మిత్రపక్షాలతో కలిసి గత ఎన్నికల్లో 70 శాతం సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆర్జేడీ క్లీన్ స్వీప్ చేసే పరిస్థితి కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ పుంజుకుకంటేమో మోడీని అపగలరా..?

రాష్ట్రాల వారీగా పరిస్థితుల్ని చూస్తే.. ఒడిషా, బెంగాల్, ఈశాన్యరాష్ట్రాల్లో ఓ ఇరవై సీట్లు పెరగవచ్చు కానీ… యూపీ నుంచి బీహార్ వరకు.. కనీసం 150 సీట్లు తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఏ రకంగా బీజేపీ.. అత్యధిక సీట్లను… సాధిస్తుంది..?. లేని సీట్లను ఎక్కడ్నుంచి తీసుకొస్తుంది. 2014 ఎన్నికల్లో.. బీజేపీ.. హిందీ రాష్ట్రాల్లో ఎంతగా విజయం సాధించాలో.. అంత సాధించింది. ఇక అక్కడ సాధించే అవకాశం లేదు. అందువల్లే.. తగ్గేచాన్సే కానీ… పెరిగే అవకాశం లేదు. దీన్ని బట్టి తెలిసిందేమింటే.. బీజేపీకి వచ్చే ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ వచ్చే అవకాశం లేదు. బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాదా.. అన్న విషయంపై క్లారిటీ రావాలంటే.. బీజేపీకి ఎన్ని సీట్లు తగ్గుతాయన్నది కాదు చూడాల్సిందే.. కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు పెరుగుతాయన్నదే చూడాలి. కాంగ్రెస్ గనుక.. గణనీయమైన సీట్లు తెచ్చుకోగలిగితేనే మోడీని ఆపగలుగుతారు. కాంగ్రెస్‌ బలంగా ఉంటే.. ప్రాంతీయ పార్టీలు… కాంగ్రెస్ వైపు ఉంటాయి. లేకపోతే.. ఎవరు ఎటు వెళ్తారో తెలియదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.