ప్రొ.నాగేశ్వర్: జయశంకర్ సార్ స్మారకం ఎందుకు పెట్టలేదు..?

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. ఇప్పుడు ప్రధానంగా సెంటిమెంట్‌ను రేపడానికి ప్రయత్నిస్తున్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో ఆయన సాధించిన విజయాలేమిటన్నదానిపై ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు. కానీ.. టీడీపీ అధినేత చంద్రబాబును టార్గెట్ చేసుకోవడం ద్వారా… మాత్రం సెంటిమెంట్‌ రేపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది వర్కవుట్ అవుతుందా..?

ఆంధ్రా దోపిడీపై ఏం చర్యలు తీసుకున్నారు..?

తెలంగాణ వాదం ఆధారంగా.. పుట్టిన పుట్టిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. తెలంగాణ సెంటిమెంట్ ఆధారరంగా… ఆ పార్టీ నడుస్తోంది. అందుకే ఆ పార్టీ అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుంటోంది. అది అందరూ చేసే పనే. ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా.. అవకాశం వచ్చినప్పుడల్లా.. హేత బద్ధత లేకుండా రాష్ట్రాన్ని విభజించారు. కట్టుబట్టలతో పంపారు… అని అని చెబుతూ ఉంటారు. అది సమైక్య సెంటిమెంట్ పెంచడాన్ని ఉపయోగించుకోవడమే. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి.. ఇప్పుడు విభజన వాదాన్ని వినిపించడం తగ్గించారు. ఇప్పుడు ప్రత్యేకహోదా నినాదాన్ని మాత్రమే వినిపిస్తున్నారు. అదే విధంగా కేసీఆర్ సెంటిమెట్ వాడుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్రుల కాళ్లలో ముల్లు గుచ్చుకుంటే తీస్తానన్నారు. ఇప్పుడు మళ్లీ ఆంధ్రులు దోపిడి దారులని మాట్లాడుతున్నారు. 80 ఏళ్ల కిందట వచ్చిన వాళ్లు మా వాళ్లే అన్నారు. ఉద్యమం సమయంలో ఇవన్నీ ఏమయ్యాయి. పద్మాలయా భూముల సంగతేమయింది..?. హరీష్ రావు సహా చాలా మంది వెళ్లి ధర్నాలు చేసిన సంగతిని మర్చిపోయారా..?. తెలంగాణ వచ్చిన నాలుగేళ్ల తర్వాత పద్మాలయా స్టూడియోస్ భూమిని ఏమైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుందా..? మరి అప్పుడు అక్రమం అన్నారు.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు..?

లాంకో భూములు ఎందుకు వెనక్కి తీసుకోలేదు..?

లగడపాటి రాజగోపాల్‌కు చెందిన లాంకో హిల్స్‌ పైనా… దాదాపుగా ప్రతి రోజు.. అప్పట్లో టీఆర్ఎస్ నేతలు రగడ సృష్టించారు. అవి వక్ఫ్ భూములు.. తెలంగాణ రాగానే లాక్కుంటామని ప్రకటించారు. ఇప్పుడు ఎవరైనా లాక్కునే ప్రయత్నం చేశారా..? అసలు ఒక్క నోటీసు అయినా ఇచ్చే ప్రయత్నం చేశారా..? అంటే.. ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన సామాన్యుల విషయంలో ఆంధ్రులు.. ఆంధ్రులు… అని అరుస్తారు. మరి ఆంధ్రులైన.. పద్మాలయా భూములు, లగడపాటి భూముల విషయంలో ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. అప్పట్లో అన్నీ సెంటిమెంట్‌ కోసం వాడుకున్నారు. ఉద్యమ సమయంలో… జేసీ ట్రావెల్స్ లాంటి ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై టీఆర్ఎస్ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. తెలంగాణలో బస్సులు నడుపుకుని డబ్బులు సంపాదించుకుని.. ఉద్యమాన్ని అణచి వేస్తున్నారన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా ప్రైవేటు బస్సులు హైదరాబాద్ వరకే వచ్చాయి. ఇప్పుడు మంచిర్యాల వరకూ వెళ్తున్నాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ప్రైవేటు బస్సు ఒక్కటి కూడా ఆగలేదు.

జయశంకర్ సార్ స్మారకం ఎందుకు కట్టలేదు..?

ఇదొక్కటే కాదు.. ప్రైవేటు కాలేజీలపైనా అదే తరహా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ కాలేజీలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లుతున్నాయి. ఈ సెంటిమెంట్..ను తెలంగాణ ఉద్యమ సమయంలో వాడారు. ఆ తర్వాత తెలంగామ ఉద్యమ సమయంలో ఎక్కడా ఆచరించలేదు. కొద్ది రోజుల క్రితం నందమూరి హరికృష్ణకు స్మారక స్థూపం కడతామని కేసీఆర్ ప్రకటించారు. మరి జయశంకర్ సార్ గురించి ఏమైనా ఆలోచించారా..?. ట్యాంక్‌ బండ్‌పై జయశంకర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు. అప్పుడేమన్నారు.. గుర్రం జాషువా, గురజాలను కూడా ఆంధ్రా వాళ్లన్నారు. అలా అన్న వాళ్లు జయశంకర్ విగ్రహాన్ని ఎందుకు ట్యాంక్‌బండ్‌పై పెట్టరు. తెలంగాణ జాతి పిత అని చెబుతారు కదా..! . తెలంగాణ జాతి పిత అని చెబుతారు… అయినా విగ్రహాన్ని ట్యాంక్‌ బండ్‌పై పెట్టలేదు. గురజాడ, శ్రీశ్రీ, జాషువా లాంటి వాళ్లకు ప్రాంతాలు అంటగట్టకండి. వీరు మహనీయులు..వీళ్లు తెలుగుకే… నాగరికతకే మాన్యులు అని నేను అప్పట్లో… చెప్పారు. అప్పుడు అందరూ నా మీద విమర్శలు చేశారు. కానీ ఇన్నేళ్లయినా.. ట్యాంక్‌బండ్‌పై జయశంకర్ సార్ విగ్రహం లేదు. జాతిపితగా చెప్పుకునే ఆయనకు హైదరాబాద్ లో ఎలాంటి స్మారకం లేదు.

ఎన్నికలొచ్చినప్పుడే సెంటిమెంట్ వాడకమా..?

అందుకే.. సెంటిమెంట్‌ను ఎన్నికలు వచ్చినప్పుడు వాడుకోవడం.. భావోద్వేగాలు రెచ్చగొట్టడం.. ఆ తర్వాత.. పక్కన పడేయడం కామన్‌గా మారిపోయింది. మళ్లీ ఇప్పుడు ఎన్నికలొచ్చాయి. కేసీఆర్ సెంటిమెంట్ అస్త్రం బయటకు తీశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.