ప్రొ.నాగేశ్వర్ : కూకట్‌పల్లి బరిలో హరికృష్ణ కుమార్తె..! చంద్రబాబు లక్ష్యాలు ఏమిటి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో… కూకట్ పల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ… కుమార్తె సుహాసినిని టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు నిలబెడుతున్నారు. ఈ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకోవాలన్న ఉద్దేశంతోనే… లేక గట్టి అభ్యర్థి అవుతారన్న ఉద్దేశంతోనే.. చంద్రబాబు.. సుహాసినిని అక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం లేదు. చంద్రబాబు అనేక లక్ష్యాలు.. అనేక ఉద్దేశాలతో.. వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం ఇది.

1. తెలంగాణపై తనకు దీర్ఘకాలిక వ్యూహం ఉందని చెప్పదల్చుకున్నారా..?

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రిగా చేశారు. ఇప్పుడు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఉంది. నేతలు ఉన్నారు. కార్యకర్తలు ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి చంద్రబాబునాయుడు.. తెలంగాణ రాజకీయాలను వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ జగన్మోహన్ రెడ్డికి అలాంటి పరిస్థితి లేదు కాబట్టి వదిలేశారు. కానీ.. బ్యాక్‌గ్రౌండ్ కారణంగా..చంద్రబాబు పార్టీని నడిపించాలి కాబట్టి నడిపిస్తున్నారనే అభిప్రాయం పార్టీలో ఉంది. ఇప్పుడు.. నందమూరి వంశానికి చెందిన.. వ్యక్తిని రంగంలోకి దింపడం ద్వారా… తానేమీ.. తెలంగాణ రాజకీయాల్ని ఆషామాషీగా తీసుకోవడం లేదని చెప్పదల్చుకున్నారు. సుదీర్ఘ కాలం.. దీర్ఘ కాలిక లక్ష్యాలతోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం వ్యూహారాలు సిద్ధం చేస్తున్నారని.. నిరూపించడానికి.. సుహాసినిని రంగంలోకి తీసుకు వచ్చినట్లు చెప్పుకోవచ్చు.

2. తెలంగాణలో ఏం పని అనేవారికి సమాధానమా..?

రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ… ఏపీలో అధికారంలోకి వచ్చింది. అక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో… టీడీపీకి…చంద్రబాబుకు తెలంగాణతో ఏం పని అని.. టీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఇప్పుడు బీజేపీ కూడా ఇదే ప్రశ్నిస్తోంది. 2014లో .. ఏం పని ఉందని.. బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఇలాంటి విమర్శలకు కాను.. నేను… పారిపోను… తెలంగాణ రాజకీయాల్లో ఉంటానని నొక్కి చెప్పడానికి తన కుటుంబం నుంచి.. అంటే నందమూరి కుటుంబం నుంచి.. ఓ నేతను తెచ్చి పెడుతున్నారు. అంటే.. తనకు .. తెలంగాణలో పని ఉందని.. దీని ద్వారా చంద్రబాబు తనకు విమర్శించిన వారికి సందేశం పంపారు.

3. తెలంగాణ టీడీపీ నాయకత్వాన్ని అందిస్తున్నారా..?

తెలుగుదేశం పార్టీ.. హైదరాబాద్ కేంద్రంగా.. రాజకీయాలు చేస్తే.. ఒక్క సీమాంధ్ర ఓటర్లలోనే కాదు.. అర్బన్ ఓటర్లలో టీడీపీకి ఆదరణ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఐటీని చంద్రబాబు అభివృద్ధి చేశారు. యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఆ ఇమేజ్ ఉంటుంది. ఈ విషయాన్ని కేటీఆర్ కూడా.. పలుమార్లు చెప్పుకొచ్చారు. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. అయినా ఓటుకు నోటు కేసు తర్వాత… ఆయన తెలంగాణ రాజకీయాల నుంచి దాదాపుగా తప్పుకున్నారు. అంతకు ముందు తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా ఉండేవారు. కానీ ఆయన విజయవాడకు వెళ్లడంతో… టీ టీడీపీ నేతలకు నాయకత్వం లేకుండా పోయింది. దీనికి విరుగుడుగా… ఇప్పుడు చంద్రబాబు తాను వెళ్లిపోతే.. వ్యూహాత్మకంగా అడుగు వెనక్కి వేశాను. ఇప్పుడు.. సుహాసినిని రంగంలోకి దింపడం ద్వారా.. రెండు అడుగులు ముందుకేస్తున్నానని… సందేశాన్ని చంద్రబాబు పంపారు.

4. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పదల్చుకున్నారా..?

నందమూరి కుటుంబాన్ని చంద్రబాబునాయుడు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. హరికృష్ణ సొంత పార్టీ పెట్టుకుని… మళ్లీ వచ్చి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ పదవి ఇచ్చినప్పటికీ.. పెద్ద ప్రాధాన్యత ఏమీ లభించలేదు. అదే సమయంలో..వియ్యంకుడిగా మారిన బాలకృష్ణకు చంద్రబాబు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇక నందమూరి కుటుంబంలో… ముఖ్యంగా హరికృష్ణ కుటుంబంలో ఎవరినైనా ఏపీ రాజకీయాల్లోకి తీసుకు వస్తే… లోకేష్‌కు ఇబ్బందికరమని.. ఆయన భావిస్తున్నారే మో.. కానీ ఇప్పటి వరకూ తీసుకు రాలేదు. కానీ తెలంగాణ రాజకీయాల్లో.. హరికృష్ణ కుమార్తెకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల… నందమూరి కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన నిరూపించకోవాలనుకుంటున్నారు.

5. ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుదన్న విమర్శలకు చెక‌ పెట్టినట్లేనా..?

తెలంగాణలో ఇప్పటి వరకూ… టీఆర్ఎస్‌ కానీ.. ఇతర పార్టీలు కానీ.. ఎన్టీఆర్‌ను డిఫెండ్ చేస్తున్నారు. చంద్రబాబును విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని.. ఎన్టీఆర్ ఆత్మను క్షోభకు గురి చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మనవరాలే.. కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉండటం ద్వారా.. ఈ విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ గొప్పవారని.. కేసీఆర్, కేటీఆర్ అంటున్నారు.. అలాంటి గొప్ప వ్యక్తి మనవరాలు… ఇప్పుడు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. తెలంగాణలో అమరవీరుల స్థూపానికి ఇంత వరకూ స్థలం లేదు కానీ… హరికృష్ణ స్మారక చిహ్నానికి మాత్రం స్థలం కేటాయించారు. అలా కేసీఆర్, కేటీఆర్ ఆరాధించే.. ఎన్టీఆర్ మనవరాలే… మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేస్తోంది. ఈ విషయాన్ని చంద్రబాబు గట్టిగా చెప్పదల్చుకున్నారు.

6. సీమాంధ్రులకు చంద్రబాబు భరోసానా..?

తెలంగాణలో.. పెద్ద సంఖ్యలో సీమాంధ్రులు ఉన్నారు. వారంతా ఇక్కడే స్థిరపడి ఇక్కడే ఓటు హక్కులు తెచ్చుకున్నారు. వీరందరికి సీమాంధ్రతో ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. అమెరికాలో తెలుగు వారు ఏవరైనా అక్కడి ఎన్నికల్లో పోటీ చేసి.. గెలిస్తే.. గొప్పగా చెప్పుకుంటాం.. అలాంటి ఎమోషనల్ కనెక్షన్ సీమాంధ్రలో ఉంటుంది. అక్కడి వాళ్లు తెలంగాణ ఎన్నికల్లో ఎవరైనా నిలబడి గెలిస్తే… గొప్పగా చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల తర్వాత… తన చెల్లెలు షర్మిలను తెలంగాణ రాజకీయాలకు పరిమితం చేస్తానని చెప్పారు. కానీ ఆ తర్వాత పూర్తిగా.. ఏపీకి పరిమితమయ్యారు. కానీ.. చంద్రబాబు మాత్రం… తాను తెలుగువాళ్ల కోసం పోరాడుతానని.. అండగా ఉంటానని.. కుటుంబంతో సహా రాజకీయం చేస్తానని.. చంద్రబాబు .. సందేశాన్ని పంపుతున్నారని అనుకోవచ్చు.

7. ఓటు బ్యాంకును కాపాడుకోవాడనికి..!

టీ టీడీపీ నేతలు.. గతంలో… చంద్రబాబు ఏపీ రాజకీయాలు చూసుకున్నా.. తమకు లోకేష్ ను నాయకత్వంగా ఇవ్వమని కోరారు. కానీ చంద్రబాబు.. ఏపీలో లోకేష్‌కు మంత్రిని చేశారు. దాంతో.. ఆయన ఏపీకి రాజకీయాలకే పరిమితమవుతారు. మరి టీ టీడీపీ శ్రేణుల్ని… టీడీపీ సంప్రదాయ ఓటు బ్యాంకుని.. అండగా ఉండే సామాజికవర్గాలకు ఉత్సాహాన్నిచ్చే విధంగా చంద్రబాబు సుహాసినిని కూకట్‌పల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు.

అందుకే.. కూకట్‌పల్లి స్థానం గెలుచుకోవడానికో… గట్టి పోటీ ఇవ్వడానికో.. నందమూరి సుహాసినిని చంద్రబాబు అభ్యర్థిగా ఖరారు చేయలేదు. ఓ దూరదృష్టి.. అంతకు మించిన రాజకీయ లక్ష్యాలతో.. ఆమెను కూకట్ పల్లి అభ్యర్థిగా ఖరారు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com