ప్రొ.నాగేశ్వర్ : నాలుగు రాష్ట్రాల కంటే ముందే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయా..?

నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు.. ఎన్నికలు జరిగేలా.. అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేశారని ప్రచారం జరిగింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూంటే..ఆ రాష్ట్రాల కంటే ముందే ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపిస్తోందని.. ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీని రద్దు చేసినప్పుడు.. కచ్చితంగా ఆరు నెలలలోపు ఎన్నికలు నిర్వహించాలనేది రాజ్యాంగ పరమైన బాధ్యత. గతంలో ఇదే విషయాన్ని నేను చాలా సార్లు చెప్పారు.

ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగవిధి..!

2002లో గుజరాత్ ఇష్యులో ముందస్తు ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు చెప్పినట్లులుగానే ఇప్పుడు జరుగుతున్నాయి. అసెంబ్లీ రద్దును గవర్నర్ ఆమోదించారు. ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ చెప్పింది. అయితే.. ఓటర్ల జాబితా తయారు కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కొంత మంది వాదించారు. కానీ ఎన్నికల సమయానికి అందుబాటులో ఉన్న జాబితానే ఓటర్ల జాబితా. దానితో ఎన్నికలు నిర్వహిస్తామనీ ఈసీ స్పష్టంగా చెప్పింది. రాష్ట్రపతి పాలనకు బీజేపీ లాంటి పార్టీలు డిమాండ్ చేస్తామని ప్రకటించాయి. ఇప్పుడు డిమాండ్లు లేవు.. మాటలు లేవు.. అందరూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. రాజ్యాంగం తెలియకుడా.. చాలా మంది అనేక ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఆరు నెలల లెక్క ప్రకారం.. మార్చి ఆరో తేదీలోపు.. కొత్త సభ కొలువు దీరాల్సి ఉంది.

తెలంగాణకు ముందు ఎన్నికలు జరిగితేనే బీజేపీకి లాభం..!

నవంబర్, డిసెంబర్‌లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్ ఎన్నికలు జరగనున్నాయి. వాటి కంటే ముందే తెలంగాణ ఎన్నికలు జరిగితే.. కేంద్రంలో ఉన్న పెద్దలకు అవి ఉపయోగపడతాయి. ఎందుకంటే… ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే.. బీజేపీ పెద్దలంతా.. ఆ రాష్ట్రంపైనే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఆ మూడు రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు. ఓటమి ఖాయమని సర్వేలు వెల్లడవుతున్నాయి. ఆ రాష్ట్రాలను కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అయా రాష్ట్రాలతో పాటు తెలంగాణలో ఎన్నికలు జరిగితే.. మోడీ, షాలకు తెలంగాణలో ప్రచారం చేసే సమయం దక్కదు. అందుకే తెలంగాణపై దృష్టి పెట్టాలనే… ముందుగా ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందుకే తెలంగాణ బీజేపీ నేతలకు… అమిత్ షా.. తాను ముందు ఉండి .. ఎన్నికలను ఎదుర్కొందామని భరోసా ఇచ్చినట్లు చెబుతున్నారు. పైగా ఇప్పటికీ ప్రతిపక్షం యునైట్ కాలేదు. ఆ పార్టీలన్నీ టిక్కెట్ల పంచాయతీల్లో ఉన్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ఓడిపోతే… మోడీ అడ్వాంటేజ్ తీసుకుంటారు..!

భారతీయ జనతా పార్టీకి… తెలంగాణ కీలకమైన రాష్ట్రం. ప్రత్యక్షంగా గెలుచుకునే సీట్లు ఏమీ ఉండవు కానీ.. పరోక్షంగా మాత్రం బీజేపీకి చాలా కీలకమైన రాష్ట్రం. కేంద్రంలో ఈ సారి ప్రభుత్వం ఏర్పడాలంటే.. కేసీఆర్ కీలకం కావొచ్చు. పైకి టీఆర్‌ఎస్‌ను ఓడించమని చెబుతున్నారు. కానీ… కేసీఆర్ ను ఓడించడం బీజేపీ లక్ష్యం కాదు. కేసీఆర్, బీజేపీ కోరుకునేది.. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం. కాంగ్రెస్ ఇక్కడ ఓడిపోతే.. బీజేపీకి బలం వస్తుంది. ఆ మూడు రాష్ట్రాల కన్నా.. ముందే తెలంగాణలో ఎన్నికలు జరిగి.. కాంగ్రెస్ ఓడిపోతే.. ఆ మూడు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మోడీ చేసే ఉపన్యాసాలు చాలా తేడాగా ఉంటాయి. తెలంగాణలో గెలవలేని కాంగ్రెస్ .. రాజస్థాన్‌లో ఎలా గెలుస్తుందని.. ఆయన ప్రచారం చేస్తారు. అందుకే… బీజేపీకి ముందే ఎన్నికలు జరగాలి… కేసీఆర్ కూ ముందే ఎన్నికలు జరగాలి. వీలైనంత ముందు ఎన్నికలు జరిగితే లాభమనే.. కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. అందుకే ఉభయపార్టీలకు ఆ మూడు రాష్ట్రాలకు ఎన్నికల ముందే ఎన్నికలు జరగడానికి ప్రయత్నం చేస్తాయి.

ఏ చిన్న అవకాశం దొరికినా ముందే ఎన్నికలు..!

పరిస్థితులు ఏ మేరకు అనుకూలించినా.. ఆ రాష్ట్రాల కంటే ముందే నిర్వహించారు. అయితే ఎన్నికలు నిర్వహించాలి అనుకోగాలనే నిర్వహించలేరు. ఈసీ అడ్మినిస్ట్రేట్ చేయగలగాలి. పారా మిలటరీ బలగాల దగ్గర్నుంచి ప్రభుత్వయంత్రాగాన్ని సిద్దం చేయాలి. ఇవన్నీ చేయగలిగితే.. కచ్చితంగా.. ఆ మూడు రాష్ట్రాల కన్నా ముందే.. ఎన్నికలు నిర్వహిస్తారు. ఎందుకంటే.. ముందుగా ఎన్నికలు జరగడం… అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్‌కు లాభం కాబట్టి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com