ఇది కూడా ప‌బ్లిసిటీ కోస‌మేనా చ‌ర‌ణ్‌..??

ఈమ‌ధ్య హీరోలు కూడా ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు నేర్చారు. ఏదోలా.. త‌మ సినిమానో, త‌మ‌నో ప్ర‌మోట్ చేసుకోవ‌డంలో బిజీ అవుతున్నారు. తాజాగా రామ్‌చ‌ర‌ణ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఈమ‌ద్య చ‌ర‌ణ్ త‌న సినిమాల ప‌బ్లిసిటీ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉంటున్నాడు. కేవ‌లం ప్ర‌మోష‌న్ల‌ను స్పీడ‌ప్ చేయ‌డానికి ఉపాస‌న‌నీ సాయం తీసుకొచ్చాడు. సుకుమార్‌తో చేస్తున్న సినిమా విష‌యాలు ఎప్ప‌టిక‌ప్పుడు ట్విట్ట‌ర్‌లో అప్‌డేట్ పెడుతున్నాడు. ఒక ర‌కంగా త‌న సినిమాని తానే పీఆర్ అయిపోతున్నాడు. అందులో భాగంగానే ఈమ‌ధ్య ఫేస్‌బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘సుకుమార్ సినిమా టైటిల్ విష‌యంలో సాయం చేయండి’ అంటూ ఫ్యాన్స్‌ని వేడుకున్నాడు. సుకుమార్ ద‌గ్గ‌ర నాలుగైదు టైటిళ్లు రెడీగా ఉన్నాయ‌ని, అందులో ఒక‌టి ఫిక్స్ చేయాల్సిందిగా ఒత్తిడి పెంచ‌మ‌ని.. ఫ్యాన్స్‌ని కోరుకొన్నాడు. ఓ హీరో.. టైటిల్ కోసం ఫ్యాన్స్ స‌హాయం తీసుకోవ‌డం బ‌హుశా ఇదే తొలిసారేమో.

అయితే ఇదంతా ప‌బ్లిసిటీ ట్రిక్ గానే క‌నిపిస్తోంది. సినిమా టైటిలేంటో సామాన్య జ‌నానికి తెలియ‌క‌పోవొచ్చు. హీరో రామ్‌చ‌ర‌ణ్ కైనా సుక్కు చెప్పేసి ఉంటాడు క‌దా? టైటిల్ విష‌యంలో సుక్కు ప‌డుతున్న టెన్ష‌న్ చెర్రీకి తెలియంది కాదు. ఇప్పుడు ఫ్యాన్స్ నుంచి ప్ర‌త్యేకంగా ఒత్తిడి తీసుకురావ‌డం ఎందుకు..? ప్ర‌స్తుతానికి చ‌ర‌ణ్ సినిమా షూటింగ్ జ‌రుపుకోవ‌డం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్ డేట్ బ‌య‌ట‌కు రాలేదు. ఆ గ్యాప్‌ని ఫిల్ చేద్దామ‌ని… టైటిల్‌ని చ‌ర‌ణ్ అడ్డుపెట్టుకొన్నాడేమో అనిపిస్తోంది. ‘రేప‌ల్లె’ టైటిల్ దాదాపుగా ఫిక్స‌యిపోయింది. ఈ సినిమాకి వ‌ర్కింగ్ టైటిల్ కూడా అదే. ఈ సంగ‌తుల‌న్నీ రామ్ చ‌ర‌ణ్‌కి తెలియ‌నివి కావుగా. అయినా… ఈ వీడియోలు, పోస్టింగులు, ఫ్యాన్స్ స‌హాయాలు ఇవ‌న్నీ ఎందుకు..? ప‌బ్లిసిటీ కోసం కాక‌పోతే..!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close