తెదేపా నేతలపై కూడా ఆ బాధ్యత ఉంది: పురందేశ్వరి

భాజపా జాతీయ మహిళా మోర్చా ఇన్-చార్జ్ పురందేశ్వరి నిన్న ఒక ప్రముఖ మీడియా ఛానల్ నిర్వహించిన ‘పబ్లిక్ టాక్’ కార్యక్రమంలో ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతూ చాలా ఆసక్తకరమయిన విషయాలు చెప్పారు.

తెదేపా-బీజేపీల మధ్య భేదాభిప్రాయల గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ “ప్రస్తుతం మేము పొత్తులలోనే ఉన్నాము. ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్యనే భేదాభిప్రాయాలుండటం సహజం అటువంటిది మిత్రపక్షాలుగా ఉన్న తెదేపా-బీజేపీ మధ్య భేదాభిప్రాయాలు ఉంటే అదేమీ అసహజమయిన విషయం కాదు. చిన్న చిన్న సమస్యలుంటే వాటిని ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడుకొని పరిష్కరించుకొంటున్నారు. తెదేపాకి మిత్రపక్షంగా మేము మిత్రధర్మాన్ని పాటిస్తున్నాము అలాగే తెదేపా నేతలు కూడా వ్యవహరించాలని కోరుకొంటున్నాము. వారు ఎంతసేపు కేంద్రం ఏమి ఇవ్వలేదో వాటి గురించి మాట్లాడుతున్నారే కానీ ఇచ్చిన వాటి గురించి చెప్పడం లేదు. దాని వలన వాళ్ళు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నట్లవుతోంది. దాని వలన కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయడం లేదనే అపోహ, అనుమానాలు ప్రజలలో ఏర్పడ్డాయి. ఆ అనుమానాలను, అపోహలను తొలగించడానికే మా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రిలో మా పార్టీ నిర్వహించిన బహిరంగ సభకు హాజరయ్యారు. అది మా బాధ్యతగా భావించాము. తెదేపా నేతలపై కూడా ఆ బాధ్యత ఉందని మేము భావిస్తున్నాము,” అని అన్నారు.

“తెదేపాకి మిత్రపక్షంగా ఉన్నంత మాత్రాన్న రాష్ట్రంలో మా పార్టీని బలోపేతం చేసుకోకూడదని ఎక్కడా నిబంధన లేదు. భాజపా కూడా ఒక రాజకీయ పార్టీయే కనుక దానిని బలోపేతం చేసుకొనేందుకు మేము తప్పకుండా గట్టిగా కృషి చేస్తున్నాము. మున్ముందు కూడా చేస్తాము. ఆ ప్రయత్నాలలో భాగంగానే పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను చేపట్టాము. దానికి ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది. సుమారు 25 లక్షల మంది ప్రజలు మా పార్టీలో సభ్యత్వం స్వీకరించారని తెలిసింది. రాష్ట్రాభివృద్ధి కొరకు కేంద్రప్రభుత్వం అందిస్తున్న సహాయసహకారాలను చూసి రాష్ట్ర ప్రజలు సంతోషం చెందుతున్నందునే ప్రజలు మా పార్టీలో చేరుతున్నారని మేము భావిస్తున్నాము. అందుకే మొన్న రాజమండ్రి బహిరంగ సభకు కూడా అంత భారీగా ప్రజలు తరలి వచ్చేరు. రాష్ట్రానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తామని ఇచ్చిన హామీకి మా పార్టీ, కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని పురందేశ్వరి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close