భాజ‌పాని చెప్ప‌మంటే.. కాంగ్రెస్ ని అడ‌గ‌మంటున్నారేంటి..?

ఆంధ్రాకు మీరు చేసింది చెప్ప‌మంటే… కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాల‌ని భాజ‌పా నాయ‌కులు పురందేశ్వ‌రి అంటున్నారు! తాజాగా ఓ ప్రెస్ మీట్ లో ఆమె మాట్లాడుతూ… య‌థావిధిగా టీడీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏ రాష్ట్రానికీ చేయ‌నంత సాయం చేస్తూ, ఇంకోప‌క్క అభాండాలు మోసే పార్టీ భాజ‌పా త‌ప్ప మ‌రొక‌టి ఉండ‌ద‌న్నారు! విభ‌జ‌న చ‌ట్టంలోని ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర 85 నుంచి 90 శాతం వ‌ర‌కూ కూడా అన్నింటినీ కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌ర్తించిన అంశం ప్ర‌జ‌లు గుర్తించాల‌న్నారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అవుతున్న ప్ర‌తీపైసా కేంద్రం నుంచే వ‌స్తోంద‌నీ, ఒక‌వేళ కేంద్రం సాయం చేయ‌క‌పోతే పోల‌వ‌రం ప‌నులు జ‌రిగేవా అనే అంశాన్ని ప్ర‌జ‌లు ఆలోచించాల‌న్నారు.

యూసీలను రాష్ట్ర ప్ర‌భుత్వం స‌క్ర‌మంగా ఇవ్వ‌డం లేదు కాబ‌ట్టే, రావాల్సిన నిధులకు అక్క‌డ కొంతమేర ఇబ్బంది క‌లుగుతోంద‌న్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తిలో తాత్కాలిక నిర్మాణాలే త‌ప్ప‌, శాశ్వ‌త క‌ట్టడాలేవీ లేవ‌ని పురందేశ్వ‌రి విమ‌ర్శించారు. కేంద్రం రూ. 15 వంద‌ల కోట్లు మాత్ర‌మే రాజ‌ధాని నిర్మాణానికి ఇచ్చింద‌ని అంటున్నార‌నీ, కానీ ఆ సొమ్ము ఇచ్చింది తాత్కాలిక నిర్మాణాల కోసం కాద‌ని ఆమె చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీల‌ది అనైతిక క‌ల‌యిక అంటూ ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. భావ‌సారూప్య‌త లేని అనైతిక క‌ల‌యిక‌ను ప్ర‌జ‌లు ఆమోదిస్తార‌ని తాము భావించ‌డం లేద‌న్నారు. ఆంధ్రాకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌నే అంకిత భావం కాంగ్రెస్ కి ఉండి ఉంటే… బిల్లులో దాన్ని ఎందుకు పొందుప‌ర‌చ‌లేద‌న్నారు. అదే ప్ర‌శ్న‌ను ఈరోజున ముఖ్య‌మంత్రి కాంగ్రెస్ పార్టీకి వెయ్యాలి క‌దా అన్నారు.

ఏపీ హోదాకి భాజ‌పా ఏం చేసిందో చెప్ప‌కుండా, అదే ప్ర‌శ్న‌ను కాంగ్రెస్ ను అడ‌గ‌మంటారేంటి..? విభ‌జ‌న స‌క్ర‌మంగా కాంగ్రెస్ చేయ‌లేదు కాబ‌ట్టే గ‌త ఎన్నిక‌ల్లో ఆంధ్రాలో తుడిచిపెట్టుకుపోయింది. ఏపీకి జ‌రిగిన అన్యాయం నేప‌థ్యంలో ఆ పార్టీకి ప్ర‌జ‌లు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు. గ‌డచిన నాలుగున్న‌రేళ్లూ భాజ‌పా అధికారంలో ఉంది క‌దా… హోదా ఇవ్వొద్ద‌ని ఎవ‌రు చెప్పారు..? విభ‌జ‌న చ‌ట్టంలో లేనివి కూడా ఆంధ్రాకు ఇచ్చేశామ‌ని అంటున్నారు క‌దా! అదే క్ర‌మంలో హోదా ఎందుకు ఇవ్వ‌లేక‌పోయారు..? ప‌్ర‌తీరోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒక‌టి చెప్పాల‌నే ఉద్దేశంతోనే ఏపీ భాజ‌పా నేత‌లు మాట్లాడుతున్నారే త‌ప్ప‌… వాటిల్లో వాస్త‌వాలేంటీ, కేంద్రం నుంచి వ‌చ్చిన ప్ర‌యోజనాలేంటీ, త‌మ నుంచి ప్ర‌జ‌లు ఆశిస్తున్న స‌మాధానాలేంటీ… ఇవేవీ వారికి ప‌ట్ట‌వేమో. విభ‌జ‌న చ‌ట్టంలోని హామీలు ‘ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర’ అన్నీ అమ‌లు చేశారంటారు పురందేశ్వ‌రి. ఈ దగ్గ‌ర ద‌గ్గ‌రేంటి..? పోల‌వ‌రం కోసం ప్ర‌తీపైసా కేంద్రం నుంచే వ‌స్తోంద‌ట‌! క‌రెక్టే, కానీ రాష్ట్రానికి రావాల్సిన‌ చెల్లింపులు మాటేంటి? కాంగ్రెస్‌, టీడీపీల క‌ల‌యిక అనైతికం అంటున్నారు, ఆ ప‌రిస్థితి భాజ‌పా వ‌ల్ల ఉత్ప‌న్న‌మైందా కాదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close