చిరు సినిమాలో పూరి పాత్ర‌..?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌న్న‌ది పూరి జ‌గన్నాథ్ క‌ల‌. 150వ చిత్రం పూరి చేతికి వెళ్లిన‌ట్టే వెళ్లి చేజారిపోయింది. ఆ త‌ర‌వాత కూడా పూరి త‌న వంతు ప్ర‌య‌త్నాలు చేశాడు. అయితే ఇప్పుడు చిరు చేస్తున్న ఓ సినిమాకి త‌న వంతు సాయం అందించ‌బోతున్నాడ‌ట‌.

వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం `గాడ్ ఫాద‌ర్‌`. మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ అయిన `లూసీఫ‌ర్‌`ని చిరు రీమేక్ చేస్తున్నాడు. మోహ‌న్ రాజా ద‌ర్శ‌కుడు. ఇటీవ‌ల ఊటీలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. పూరికి `లూసీఫ‌ర్‌` సినిమా అంటే చాలా ఇష్టం. చిరు ఈ సినిమా చేస్తున్నాడ‌ని తెలిసి తెలుగులో, చిరుకి త‌గిన‌ట్టుగా ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుందో కొన్ని స‌ల‌హాలూ సూచ‌న‌లు ఇచ్చాడ‌ట‌. `గాడ్ ఫాద‌ర్‌` స్క్రిప్టు పూర్త‌యిపోయినా పూరి ఇచ్చిన స‌ల‌హాలు బాగుండ‌డంతో.. వాటిని కూడా జోడించి కొత్త సీన్లు రాసుకుని, దానికి అనుగుణంగా స్క్రిప్టు మార్చిన‌ట్టు ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. పూరిది మంచి మాస్ బ్రెయిన్‌. చిరుని తాను ఎలా చూడాల‌నుకుంటున్నాడ‌ని, ఎలా చూపించాల‌ని ఆశ ప‌డుతున్నాడో.. అలాంటి ఎలివేష‌న్లు, సీన్లూ.. చెప్పి ఉంటాడు. చిరుకి అది బాగా న‌చ్చి ఉంటుంది. అలా.. `గాడ్ ఫాద‌ర్‌`లో పూరి త‌న వంతు పాత్ర పోషించేశాడు. మ‌రి ఆ సీన్లు ఏమిటో? ఎలా వ‌చ్చాయో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close