మీడియాని ఉతికి ఆరేస్తున్న పూరి

మొహం మీద కొట్టిన‌ట్టు మాట్లాడ‌డం పూరి హీరోల‌కే కాదు.. పూరీకీ అల‌వాటే. ఆయ‌న పెన్ను ఈ విష‌యంలో మ‌హా ఫాస్టుగా ప‌రుగులు పెడుతుంటుంది. ఈసారి ఆయ‌న క‌న్నూ, పెన్నూ మీడియాపై ప‌డింది. పూరి ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రం ‘ఇజం’. ఇందులో హీరో క్యారెక్టర్‌కి రెండు షేడ్స్ ఉంటాయి. ఓ పాత్రలో మీడియా రిపోర్టర్ గా క‌నిపించ‌నున్నాడు క‌ల్యాణ్‌రామ్. ఆ పాత్రని ఆధారంగా చేసుకొని మీడియాని కార్నర్ చేసే సీన్లు రాసుకొన్నాడ‌ని స‌మాచారం. మీడియా నైతిక విలువ‌లేంటి? అనే టాపిక్ మీద పూరి సుదీర్ఘమైన సీన్ రాసుకొన్నాడ‌ట‌. అందులో మీడియాని ఎండ‌గ‌ట్టే కార్యక్రమం మ‌హా ర‌స‌వ‌త్తరంగా సాగ‌బోతోంద‌ని టాక్‌. ఈ విష‌యంలో గురువు రాంగోపాల్ వ‌ర్మ కూడా పూరికి కొన్ని స‌ల‌హాలూ సూచ‌న‌లూ ఇచ్చిన‌ట్టు టాక్‌. గురువు గారి అండ‌తో పూరి మరింత‌గా రెచ్చిపోయి ఆ సీన్‌ని టేక‌ప్ చేశాడ‌ట‌.

ఇది వ‌ర‌కు ‘కెమెరామెన్ గంగ‌తో రాంబాబు’ లోనూ ఇదే జ‌రిగింది. సాధార‌ణ వార్తకు మీడియా మ‌సాలా అద్ది ఎలా ప్రసారం చేస్తోంది అనే విష‌యాన్ని బ్రహ్మానందం – ప‌వ‌న్ ల నేప‌థ్యంలో కాస్త కామెడీగా తీశాడు. ఆ సీన్‌లోనే ప్రకాష్‌రాజ్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల వ్యక్తిగ‌త జీవితాల‌కు సంబంధించిన ప్రస్తావ‌న కూడా సాగుతుంది. స‌రిగ్గా ఇజంలోనూ ఇలాంటి ట్రిక్కే ప్లే చేశాడ‌ట. మీడియా ఏమీ లేని చోట పుకార్లను ఎలా వండుతుంది? మైలేజీ కోసం ఎన్ని పాట్లు ప‌డుతుంది? అనే విష‌యాన్ని సెటైరిక‌ల్‌గా డీల్ చేస్తూ చూపించాడ‌ట‌. అలాగ‌ని మీడియాకు నెగిటీవ్ అయిపోతే లేనిపోని స‌మ‌స్యలొస్తాయి. సినిమా ఫ్లాప్ అయితే అదే మీడియాతో తిట్లు తినాల్సివ‌స్తుంది. అందుకే మీడియాని అక్కడ‌క్కడ‌క హైలెట్ చేస్తూ కొన్ని సీన్లు తీశాడ‌ట‌. ‘ఇజం’ సినిమాపై ఆయా స‌న్నివేశాలు చాలా ప్రభావం చూపిస్తాయ‌ని తెలుస్తోంది. మొత్తానికి పూరి కి మీడియాపై ఉన్న అక్కసంతా తీర్చుకోవ‌డానికి ‘ఇజం’ అనే ఆయుధం దొరికింది. మ‌రి పూరి ఎంత రెచ్చిపోయాడో, మీడియాని ఎంతగా రెచ్చగొట్టాడో తెలియాలంటే ఈ సినిమా రావాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close