పూరి జగన్నాథ్‌కి డిజాస్టర్లు కొత్త కాదు. ఓ ఫ్లాప్ తర్వాత హిట్ ఇచ్చి మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి రావడం ఆయనకు అలవాటే. అయితే ఈసారి లైగర్, డబుల్ ఇస్మార్ట్ వంటి భారీ డిజాస్టర్లు తగిలాయి. అంతకుముందు ఇస్మార్ట్ శంకర్ లాంటి హిట్ ఇచ్చినా, మహబూబా, రోగ్, ఇజం వంటి ఫ్లాప్‌లు చూశారు.
ఇంత ఫెయిల్యూర్ ట్రాక్‌లోనూ ఆయన ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను సెట్ చేశారు. విలక్షణ నటుడు విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు. నిజానికి ఇది చాలా సర్ప్రైజ్ కాంబినేషన్ అనే చెప్పాలి. హీరోయిజానికి కొత్త నిర్వచనం చెప్పిన పూరి, నటనలో కొత్త ఒరవడి సృష్టించిన సేతుపతి కలయిక నిజంగా విలక్షణమే.
ఈ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి స్లమ్ డాగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. పూరి బర్త్‌డే కానుకగా గ్లింప్స్ కూడా రానుంది. ఈ సినిమా విజయం పూరికి చాలా కీలకం. ఎందుకంటే పూరి లాంటి దర్శకుడు మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వస్తే ఆ జోష్ వేరే ఉంటుంది. ఆయన ఫ్యాన్స్ కూడా వింటేజ్ పూరిని చూడాలని ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు స్లమ్ డాగ్ తెరదించాలి.
