నాకు ద‌మ్ముంది… మీకు ద‌మ్ముందా: మీడియాని ఛాలెంజ్ చేసిన పూరి

టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కేసు స‌రికొత్త మ‌లుపులు తిరుగుతోంది. ఈ వ్య‌వ‌హారంలో ఇప్ప‌టి వ‌ర‌కూ 12మంది బుక్క‌య్యారు. ఇంకా బ‌య‌ట‌కు రాని పేర్లు చాలానే ఉన్నాయ‌ని వినికిడి. ఆ పేర్లు బ‌య‌ట‌కు ఎందుకు రాలేదు? అస‌లు ఈ వ్య‌వ‌హారంలో ఇంకెవ‌రు ఉన్నారు? అనే ఆస‌క్తి నెల‌కొంది. మ‌రోవైపు 12మందిలో చాలామంది ”మాకు ఎలాంటి సంబంధం లేదు.. మేం అమాయ‌కులం” అంటున్నారు. కానీ.. పూరి జ‌గ‌న్నాథ్ మాత్రం కాస్త డిఫ‌రెంట్ గా స్పందించాడు. ”ఈ విష‌యంలో చాలా మందికి లింకులు ఉన్నాయి. వాళ్ల పేర్లు బ‌య‌ట‌పెట్ట‌గ‌ల ద‌మ్ము నాకుంది.. రాసే ద‌మ్ము మీకుందా” అంటూ ఓపెన్ గా మీడియాకు ఛాలెంజ్ విసిరాడు పూరి. పూరిని సంప్ర‌దించ‌డానికి కొంత‌మంది మీడియా మిత్రులు రెండ్రోజులుగా శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎట్ట‌కేల‌కు పూరి లైన్‌లోకి వ‌చ్చాడు. ఫోన్‌లో కొంత‌మంది పాత్రికేయుల‌తో పూరి మాట్లాడాడు. కొంత‌మంది పేర్లు బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది. అందులో ఒక‌రు ఇండ్ర‌స్ట్రీలో కాక‌లు తిరిగిన ‘న‌ట‌’ కుటుంబం నుంచి వ‌చ్చిన వార‌సుడని తెలుస్తోంది. మిగిలిన ఇద్ద‌రూ నిర్మాత త‌న‌యుల‌ని స‌మాచారం. `ఎలాగూ మునిగాం క‌దా, మిగిలిన‌వాళ్ల‌నీ ముంచేద్దాం` అన్న ఫీలింగ్ ఎవ‌రికి వ‌చ్చినా.. ఇలా చాలా మంది పేర్లు బ‌యట‌కు వ‌చ్చేస్తాయ్‌. మ‌రి ఈ చిట్టా విప్పేదెవ‌రో చూడాలి. అన్న‌ట్టు ఈరోజు పూరి మీడియా ముందుకు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ టీవీ ఛాన‌ల్ లైవ్‌లో పూరి క‌నిపిస్తార‌ని, ఆయ‌నే కొన్ని పేర్లు వెల్ల‌డించే అవ‌కాశాలున్నాయ‌ని స‌మాచారం. పోలీసు శాఖ ఈ రోజు రెండో లిస్టుని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. అందులో పూరి చెప్ప‌బోయే పేర్లు ఉంటాయా? లేదా? వాళ్ల‌ని ‘హైడ్‌’ చేసే ప్ర‌య‌త్నాలేమైనా జ‌రిగే అవ‌కాశాలున్నాయా అనేది ఆస‌క్తిగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com