డ్ర‌గ్స్‌పై పూరి సినిమా : స్క్రిప్టు రెడీ

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం టాలీవుడ్‌ని ఓ కుదుపు కుదిపేసింది. రోజుకొక్క‌రు సిట్ విచార‌ణ‌కు హాజ‌ర‌వ్వ‌డం, అక్క‌డ నడిపిన హైడ్రామా.. ఇవ‌న్నీ తెలుగు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండే ఉంటుంది. పూరి, ముమైత్‌, ర‌వితేజ లాంటి సెల‌బ్రెటీలు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో ఇరుక్కోవ‌డంతో మీడియాకు కావ‌ల్సినంత ఫుటేజీ దొరికిన‌ట్టైంది. ఈ విష‌యంలో మీడియా ఓవ‌రాక్ష‌న్ త‌నను హ‌ర్ట్ చేసింద‌ని పూరి ఓ సంద‌ర్భంలోనూ చెప్పారు. అన్న‌ట్టు ఈ టోట‌ల్ ఎపిసోడ్‌పై ఆయ‌నిప్పుడు ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్దం చేసుకొంటున్నారు. దానికి సంబంధించిన స్క్రిప్టు కూడా పూర్త‌య్యింది. ”డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం అప్పుడే మ‌ర్చిపోయా. అది నా దృష్టిలో ఒక్క‌రోజు వ్య‌వ‌హారం. కేసు కాదు, ఏమీ లేదు. కేవ‌లం విచార‌ణ నిమిత్తం పిలిచారంతే” అంటూ క్లారిటీ ఇచ్చాడు పూరి. ఈ ఎపిసోడ్‌పై సినిమా తీసే ఆలోచ‌న ఉందా అని అడిగితే.. ”అవును.. ఆ ఆలోచ‌న ఉంది. అందుకు సంబంధించిన స్కిప్టు కూడా సిద్ద‌మైంది” అన్నారు పూరి. అయితే.. ఆ సినిమా ఎప్పుడు తీస్తారో మాత్రం చెప్ప‌లేదు. మొత్తానికి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారాన్ని పూరి మ‌ళ్లీ కెలుకుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఆ కేసులో ఇరుక్కొన్న పూరి.. ఓ సినిమా తీస్తే.. అది నిజంగా సంచ‌ల‌న‌మే. సినిమా ఎలా ఉన్నా, ఓపెనింగ్స్‌కి ఢోకా లేదు. మ‌రి ఈ క‌థ‌ని ఎప్పుడు ప‌ట్టాలెక్కిస్తాడో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయమే బంగారమాయెనా…

హారర్ సినిమా అనగానే ఆడియన్స్ లిమిట్ అయిపోతారు. స్టార్ హీరోలు ఈ కథలని వినడానికి పెద్ద ఆసక్తి చూపించారు. కానీ చాలా మంది ఫిల్మ్ మేకర్స్ కి హారర్ సినిమాలంటే క్రేజ్. నిజానికి...

భయమా..? అభద్రతాభావమా..?

కొద్ది రోజుల కిందట వరకు దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల పరిస్థితి ఉన్నప్పటికీ ఎన్నికలకు సమయం సమీపించే కొద్దీ ఆ పార్టీ గ్రాఫ్ వేగంగా పతనం అవుతూ వస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్...

ఖ‌మ్మం పంచాయితీ మ‌ళ్లీ షురూ… ఈసారి కాంగ్రెస్ లో!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాలు అంటేనే ఎప్పుడూ ఏదో ఒక పంచాయితీ న‌డుస్తూనే ఉంటుంది. అధికార పార్టీలో నాయ‌కుల మ‌ధ్య స‌యోధ్య చాలా క‌ష్టం. మొన్న‌టి వ‌ర‌కు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న స‌మ‌యంలో తుమ్మ‌ల‌,...

దాస‌రికి ఇదే ఘ‌న‌మైన నివాళి!

మే 4... ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు జ‌న్మ‌దినం. దాస‌రి పుట్టిన రోజుని ద‌ర్శ‌కుల దినోత్స‌వంగా జ‌రుపుకొంటుంది టాలీవుడ్. ద‌ర్శ‌కుల‌కు కూడా స్టార్ స్టేట‌స్ క‌ల్పించిన దాస‌రికి ఇది స‌రైన నివాళే. అయితే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close