సెలవుపై వెళ్ళిన వీసీ అప్పారావు: సస్పెండ్ చేయమన్న ప్రొఫెసర్‌కే ఇన్‌ఛార్జ్ బాధ్యతలు

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలింది. వైస్ ఛాన్సలర్ అప్పారావును సెలవుపై పంపించింది. ఆయన స్థానంలో యూనివర్సిటీలోని ప్రొఫెసర్ విపిన్ శ్రీవాత్సవను ఇన్‌ఛార్జ్ వీసీగా నియమించింది. విశేషమేమిటంటే రోహిత్, అతని అనుచరులను గతంలో సస్పెండ్ చేయాలని సిఫార్సు చేసిన కమిటీకి శ్రీవాత్సవ నాయకత్వం వహించారు. మరోవైపు ఈ పరిణామంపై విద్యార్థులు మరింత మండిపడుతున్నారు. వీసీ అప్పారావును సెలవుపై పంపిస్తే సరిపోదని, అతనిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమపై సస్పెన్షన్ వేటు వేయాలని సిఫార్స్ చేసిన ప్రొఫెసర్‌కే ఇన్ ఛార్జ్ వీసీ బాధ్యతలు అప్పగించటమేమిటని ప్రశ్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రోహిత్ ఆత్మహత్యకు బాధ్యులపై చర్యలు తీసుకోవటం వంటి ఐదు డిమాండ్లపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఏడుగురు విద్యార్థుల నిరసనను భగ్నం చేసి నిన్న ఆసుపత్రిలో చేర్చటంతో వారి స్థానంలో మరో ఏడుగురు విద్యార్థులు ఇవాళ దీక్ష ప్రారంభించారు. వైస్ ఛాన్సలర్ అప్పారావును తొలగించటం, రోహిత్ కుటుంబానికి రు.50 లక్షల పరిహారం చెల్లింపు వంటి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు దీక్ష కొనసాగిస్తామని విద్యార్థులు చెప్పారు. ఇక నిన్న ఆసుపత్రిలో చేర్చిన ఏడుగురు విద్యార్థులలో ఐదుగురి పరిస్థితి మెరుగుపడటంతో వారిని ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్‌లో రిపోర్ట్ చేయమని చెప్పినట్లు యూనివర్సిటీ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రవీంద్ర కుమార్ చెప్పారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. మరోవైపు దీక్షలకు సారధ్యం వహిస్తున్న జేఏసీ రేపు చలో హెచ్‌సీయూ కార్యక్రమం నిర్వహించనుంది. అటు, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీని దర్శించి రోహిత్ సహచరులకు సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close