రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవి క్యారెక్టర్ చేసిన వివేక్ ఓబెరాయ్ సతీమణిగా.. పరిటాల సునీత పాత్రలో టాలీవుడ్‌కు పరిచయం అయింది రాధికాఆప్టే. రక్తచరిత్ర మొదటి పార్ట్ కమర్షియల్ గానూ మంచి విజయం సాధించింది. పరిటాల సునీత పాత్రలో రాధికాఆప్టే బాగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. పద్దతిగా ఉండే హీరోయిన్ అనుకున్నారు. కానీ ఆమె పద్దతి వేరని తర్వాత తెలిసింది. తమిళ, తెలుగు సూపర్ స్టార్లతో కొన్ని సినిమాల్లో చేసి తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.
సందర్భం వచ్చినప్పుడల్లా సౌత్ ఇండస్ట్రీపై రాధికా ఆప్టే ఆరోపణలు
రాధికా ఆప్టే దక్షిణాది చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా టాలీవుడ్లో పురుష ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని ఆరోపిస్తారు. గతంలో పలు ఇంటర్వ్యూలలో హీరోలను దేవుళ్లలా చూస్తారని, కథానాయికలకు కనీస గౌరవం ఉండదని విమర్శిస్తూ ఉంటారు. ఇటీవల ఇంటర్యూల్లోనూ అదే చేశారు. “ అమ్మా.. ప్యాడింగ్ ఇంకా పెంచాలి” చెబుతారన్నారు. అంటే దక్షిణాదిలోనే అలా చెబుతారా..?. హిందీ సినిమా ఇండస్ట్రీలో చెప్పరా? . ఏకంగా ఆపరేషన్లు చేయించుకుని రమ్మని చెబుతారా అన్న సందేహం.. ఆమె మాటలు విన్న వారికి వస్తుంది. అలాగే ఒక ప్రముఖ హీరో షూటింగ్ సెట్లో తన అనుమతి లేకుండా తన పాదాలను తడిమినప్పుడు, తాను అందరి ముందర గట్టిగా మందలించానని రాధికా ఆప్టే తెలిపారు. ఆ హీరో ఇండస్ట్రీలో చాలా పవర్ఫుల్ అని తెలిసినప్పటికీ, తన ఆత్మగౌరవం కోసం ఎదురుతిరిగానని కూడా ప్రకటించుకున్నారు. అందుకే దక్షిణాది సినిమాలు చేయడం లేదని కూడా అంటున్నారు.
బోల్డ్ సినిమాలతో ఇమేజ్ కోల్పోయిన రాధికా ఆప్టే
రాధికా ఆప్టే బాలీవుడ్ లో గొప్ప సినిమాలు చేయలేదు. సినిమాల్లో బోల్డ్ పాత్రలు , నగ్నంగా నటించే సీన్లు ఉన్న సినిమాల్లోనే ఆమె నటించారు. దీంతో ఆమె ఇమేజ్ అలాంటి పాత్రలకే కరెక్ట్ అన్న ముద్ర పడిపోయింది. పార్చ్డ్ అనే సినిమాలో ఒక నగ్న సన్నివేశంలో నటించారు. ఆ సమయంలో ఆ క్లిప్పింగ్స్ లీక్ అవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ లో పెళ్లయిన మహిళ తన విద్యార్థితో పెట్టుకునే సంబంధం, లైంగిక అసంతృప్తి చుట్టూ తిరిగే కథలో నటిచారు. క్లీన్ షేవన్ అనే షార్ట్ ఫిలింలో కూడా ఆమె ఒక నగ్న సన్నివేశంలో నటించారు. దీనికి సంబంధించిన ఫోటోలు లీక్ చేసుకున్నారు. సాక్రెడ్ గేమ్స్ లో ఆమె పాత్ర మరింత వివాదాస్పదం. హంటర్ అనే బీగ్రేడ్ సినిమాలో ఆమె పాత్ర చూసిన వారికి కళాత్మక సినిమాల్లో నగ్నంగా నటిస్తానని వాదనలు తప్పని అర్థమవుతాయి. ఇలాంటి ఇమేజ్ తో ఆమెను దక్షిణాది సినిమాల్లో ఎవరు తీసుకుంటారు?
బాలీవుడ్ లో గుర్తింపు అలాంటి క్యారెక్టర్లతోనే – అక్కడ అవే అవకాశాలు
నిజానికి దక్షిణాదిలోనే ఆమె కమర్షియల్ హీరోయిన్ గా చేశారు. బాలీవుడ్ లో ఆమె చేసినవన్నీ నగ్న పాత్రలే. అవకాశాల కోసం నటనలో భాగంగా శరీరాన్ని ప్రదర్శించాల్సి వస్తే అందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదని ఆమె బహిరంగంగా చెబుతూ ఉంటారు. విదేశాల్లో వేదికలపై లేదా సినిమాల్లో నగ్నంగా నటించడాన్ని ఒక కళగా చూస్తారని ఆమె ఉదాహరిస్తుంటారు. కేవలం మన సమాజంలోనే దీనిని తప్పుగా చూస్తారని ఆమె అభిప్రాయం. ఆమె ఉద్దేశం అదే అయితే కమర్షియల్ సినిమాల్లో నటించకుండా ఉండాల్సింది. డబ్బు కోసం నటించానని చెప్పుకుని ఇప్పుడు.. నిందలేస్తే దాన్ని సరైన వ్యక్తిత్వం అనరు.
