హీరోయిన్ల వేట‌లో ద‌ర్శ‌కేంద్రుడు

ద‌ర్శ‌కేంద్రుడికి మ‌ళ్లీ సినిమాల‌పై ధ్యాస మ‌ళ్లింది. ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్లు, ఓ హీరోతో సినిమా తెర‌కెక్కించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. బాహుబ‌లి నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు. రాఘ‌వేంద్ర‌రావు నిర్మాత‌గా ఉంటూనే ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌బోతున్నాడు. ఇది మూడు క‌థ‌లు. మూడు క‌థ‌ల‌కూ లింకు వేసుకుని క్లైమాక్స్ సిద్ధం చేశారు. ఒక్కో క‌థ‌కు ఒక్కో ద‌ర్శ‌కుడు ప‌ని చేస్తాడ‌న్న‌మాట‌. క్రిష్‌, బివిఎస్ ర‌వి, గౌత‌మ్ తిన్న‌నూరి, అనిల్ రావిపూడి.. ఇలా యువ ద‌ర్శ‌కుల లిస్టు ద‌ర్శ‌కేంద్రుడి ద‌గ్గ‌ర ఉంది. వీళ్ల‌తో రాఘ‌వేంద్ర‌రావు సంప్ర‌దింపులు కూడా జ‌రిపారు. క్రిష్‌, బివిఎస్ ర‌వి దాదాపు ఖాయ‌మ‌య్యారు. అనిల్ మ‌హేష్ బాబు సినిమాతో బిజీగా ఉండ‌డం వ‌ల్ల‌… ఈ ప్రాజెక్టులో పాలుపంచుకుంటాడా? లేదా? అనేది అనుమానంగా మారింది.

మ‌రోవైపు ద‌ర్శ‌కేంద్రుడు క‌థానాయిక‌ల కోసం వేట మొద‌లెట్టాడు. ఆయ‌న మ‌న‌సులో పెద్ద పెద్ద హీరోయిన్లే ఉన్నారు. కాక‌పోతే ఇది ప్ర‌యోగాత్మ‌క చిత్రం. ఒకొక్క‌రి పాత్ర నాలుగైదు స‌న్నివేశాల‌కు ప‌రిమితం అవుతుంది. ఇలాంటి సినిమాల్లో న‌టించ‌డానికి స్టార్‌ హీరోయిన్లు ముందుకు వ‌స్తారా? అనేదే డౌటు. లేదంటే ముగ్గురుని కొత్త‌వాళ్ల‌నే తీసుకోవాల్సివ‌స్తుంది. ఇప్ప‌టికిప్పుడు ముగ్గురు కొత్త‌వాళ్ల‌ని ఎంపిక చేయ‌డం అంత సుల‌భం కాదు. జులై నుంచి షూటింగ్ ప్రారంభించాల‌ని రాఘ‌వేంద్ర‌రావు భావిస్తున్నాడ‌ట‌. మ‌రి.. అంత‌లోగా ఎవ‌రు దొరుకుతారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close