ఎన్టీఆర్‌కి దర్శ‌కేంద్రుడి దిశా నిర్దేశిక‌త్వం

ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి కోసం తొలిసారి బాల‌కృష్ణ కెప్టెన్ కుర్చీలో కూర్చోవ‌డానికి డిసైడ్ అయిపోయినట్టే. చివ‌రి ప్ర‌య‌త్నంగా ఈరోజు ఆయ‌న‌.. కె.రాఘ‌వేంద్ర‌రావుని క‌లుసుకున్న‌ట్టు స‌మాచారం. ‘ఈ సినిమా మీరు చేయొచ్చు క‌దా’ అని రాఘ‌వేంద్ర‌రావుని మ‌రోసారి అడిగార్ట బాల‌య్య‌. కానీ రాఘ‌వేంద్ర‌రావు సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్టు స‌మాచారం. అయితే ‘ద‌ర్శ‌క‌త్వ ప‌ర్వ‌వేక్ష‌కుడు’గా ఉండ‌డానికి రాఘ‌వేంద్ర‌రావు అంగీక‌రించిన‌ట్టు తెలుస్తోంది. బాల‌య్య‌కు న‌టుడిగా సుదీర్ఘ‌మైన అనుభ‌వం ఉంది. ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు ఎలాంటివో ఆయ‌న‌కు తెలియంది కాదు. అందుకే ఈ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానికి ఆయ‌న ధైర్యం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడిగా బాల‌య్య‌కు ద‌ర్శ‌కేంద్రుడు స‌ల‌హాలూ, సూచ‌న‌లు ఇస్తార‌న్న‌మాట‌. కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల విష‌యంలో మీ స‌ల‌హాలు కావాల‌ని బాల‌య్యే రాఘ‌వేంద్ర‌రావుని అడిగిన‌ట్టు స‌మాచాంర‌. దానికి రాఘవేంద్ర‌రావు కూడా అంగీక‌రించార‌ని తెలుస్తోంది. రాజ‌మౌళి తెర‌కెక్కించిన ‘స్టూడెంట్ నెం.1’కి రాఘేవేంద్రుడు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌కుడిగా ఉన్నారు. `ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు`కీ ఇలాంటి బాధ్య‌తే చేప‌ట్టారు. ఇప్పుడు మ‌రోసారి ఆ పాత్ర పోషించ‌బోతున్నార‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close