‘మ‌హాన‌టి’ టీమ్ పై ద‌ర్శ‌కేంద్రుడి అల‌క‌

మ‌హాన‌టి ఆడియో ఫంక్ష‌న్ కి అతిథిగా వ‌చ్చాడు రాఘ‌వేంద్ర‌రావు. సాధార‌ణంగా అతిథులుగా వెళ్లే.. అన్నీ పాజిటీవ్ పాయింట్లే మాట్లాడ‌తారు. కానీ.. రాఘ‌వేంద్ర‌రావు ఆడియో ఫంక్ష‌న్ సాక్షిగా.. చిత్ర‌బృందంపై త‌న అల‌క‌ని చూపించేశాడు. ‘సావిత్రి బ‌యోపిక్ తీస్తూ.. న‌న్ను సంప్ర‌దించ‌లేదు. ఈ విష‌యం బాధించింది’ అంటూ నిర్మొహ‌మాటంగా చెప్పేశాడు. సావిత్రితో త‌న‌కు చాలా అనుబంధం ఉంద‌ని. స‌హాయ ద‌ర్శ‌కుడిగా త‌న కెరీర్ సావిత్రి సినిమాతోనే మొద‌లైంద‌ని గుర్తు చేసుకున్నారు రాఘ‌వేంద్ర‌రావు. త‌ను సెట్‌కి పిలిస్తే సావిత్రి వ‌చ్చేవార‌ని, ప‌నేం లేదు వెళ్లిపోండి అంటే వెళ్లిపోయేవార‌ని అంత‌టి అనుబంధం త‌న‌కు ఉంద‌ని… ఒక్క‌సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లారు. నిజానికి నాగ అశ్విన్ సావిత్రితో అనుబంధం ఉన్న చాలా మందిని క‌లుసుకోలేదు. అందులో జ‌మున కూడాఉన్నారు. సావిత్రి, జ‌మున స‌మ‌కాలికులు. జ‌మున‌ని క‌లిస్తే చాలా విష‌యాలు తెలిసేవి. కానీ.. నాగ అశ్విన్ ఎందుకో ఆ ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఈ విష‌యంపై జ‌మున కూడా త‌న అల‌క‌ని, చిరు కోపాన్నీ చూపించేశారు. ఇప్పుడు ద‌ర్శ‌కేంద్రుడి వంతు వ‌చ్చింది. ఇంకా ఈ లిస్టులో ఎంత మంది ఉన్నారో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘కాంతార 2’లో మోహ‌న్ లాల్‌?

దేశాన్ని కుదిపేసిన క‌న్న‌డ చిత్రం 'కాంతార‌'. ఏమాత్రం అంచ‌నాలు లేకుండా, ఏమాత్రం ప్ర‌మోష‌న్లు చేయ‌కుండానే పాన్ ఇండియా స్థాయిలో విజ‌య ఢంకా మోగించింది. క‌న్న‌డ చిత్ర‌సీమ స్థాయిని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది. ఇప్పుడు...

మంత్రి ఉత్తమ్ ఇలాకాలో విద్యార్ధినిలకు అస్వస్థత..రీజన్ అదేనా..?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని గురుకుల పాఠశాలలో విద్యార్థులు వరుసగా అస్వస్థతకు గురి అవుతుండటం కలకలం రేపుతోంది. యదాద్రి భువనగిరి జిల్లా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కు గురై ఇటీవల ఓ విద్యార్ధి...

చిలుకూరుకు పోటెత్తిన భక్తులు…ఫుల్ ట్రాఫిక్ జామ్

కోరిన కోరికల్ని తీర్చే సుప్రసిద్ధ చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలకు భక్తులు పోటెత్తారు. ఆలయ సిబ్బంది అంచనా వేసిన దానికంటే పది రేట్లు ఎక్కువగా రావడంతో క్యూలైన్లు అన్ని నిండిపోయాయి. ఆలయానికి...

అచ్చెన్నాయుడు అన్నీ అలా కలసి వస్తున్నాయంతే !

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు అన్నీ అలా కలసి వస్తున్నాయి. ఆయన ప్రత్యర్థి .. దువ్వాడ శ్రీనివాస్.. భార్య చేతిలోనే పదే పదే ఓడిపోతున్నారు. తాజాగా మరోసారి ఆయన భార్య రంగంలోకి దిగారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close