వారం తర్వాత వైసీపీ నుంచి రఘురామకృష్ణంరాజు బహిష్కరణ..!?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ హైకమాండ్ షోకాజ్ నోటీసు జారీ చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో విజయసాయిరెడ్డి.. నోటీసు జారీ చేసి వారం రోజుల్లో సమాధానం చెప్పాలన్నారు. గత పది రోజులుగా.. పార్టీకి.. పార్టీ నిర్ణయాలకు.. పార్టీ అధినాయకత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటలను.. షోకాజ్ నోటీసులో వివరించి.. వాటికి వివరణ ఇవ్వాలని ఆదేసించారు. లేకపోతే.. తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రఘురామకృష్ణంరాజు.. తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గే అవకాశం లేదు కాబట్టి.. విజయసాయిరెడ్డి జారీ చేసిన షోకాజ్ నోటీసుకు కూడా దూకుడు తగ్గకుండా.. సమాధానం ఇస్తారని అంచనా వేస్తున్నారు.

వాస్తవానికి రఘురామకృష్ణంరాజు పార్టీ అధినేత జగన్ గురించి ఒక్కటంటే.. ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఆయనను పొగుడుతూనే ఉన్నారు. ఏబీఎన్ లాంటి చానళ్లతో మాట్లాడేటప్పుడు కూడా మరో మూడు టర్మ్ లు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటారని గట్టిగా చెప్పారు. అయితే జగన్ చుట్టూ కోటరీ ఉందని.. తమను ఆయనను కలవనివ్వడం లేదని ఆరోపిస్తున్నారు. జగన్ కలిసే అవకాశం వస్తే.. తన బాధలు చెప్పుకుంటానని.. చెబుతున్నారు. అయితే.. పార్టీలోని ఇతర నేతలపై… పార్టీ విధానాలపైన మాత్రం ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. ఆయన తీరు ఇబ్బందికరంగా మారడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని భావిస్తున్నారు.

తనకు ప్రాణహాని ఉందని.. కేంద్రహోంమంత్రికి లేఖ రాయడం.. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల నుంచే ఉందని… ఆరోపించడం.. హైకమాండ్‌కు మరింత కోపం తెప్పించింది. ఎమ్మెల్యేలను కించ పరిచారన్న కారణాన్ని కూడా షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజు నేడో రేపో.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తారని ప్రచారం జరుగుతున్న సమయంలో.. షోకాజ్ నోటీసు జారీ చేయడం.. ఆసక్తి రేపుతోంది. వారం తర్వాత ఆయనను సస్పెండ్ చేయడమో… పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ లోపు పరిస్థితులు ఏమీ మారకపోతే.. అదే జరగొచ్చంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

బస్సు యాత్ర : వైసీపీ రాంగ్ స్ట్రాటజీ

ఎన్నికల షెడ్యూల్ వచ్చినా నోటిఫికేషన్ రావడానికి సమయం ఉండటంతో...జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇరవై ఒక్క రోజుల పాటు ఇరవై ఒక్క పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి బస్సు యాత్ర...

చ‌ర‌ణ్ సినిమాలో.. సుకుమార్ హ్యాండ్ ఎంత‌?

సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై ద‌ర్శ‌కుడు సుకుమార్ ఓ సినిమా తీశాడంటే అందులో త‌న క్రియేటీవ్ ఇన్వాల్వ్‌మెంట్ కూడా త‌ప్ప‌కుండా ఉంటుంది. 'విరూపాక్ష‌' సినిమా స్క్రీన్ ప్లేలో సుకుమార్ ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close