రఘురామరాజు సీఐడీని బెదిరిస్తున్నారట..!

ఏ కేసులు పెట్టారో కూడా చెప్పకుండా మనుషుల్ని రాత్రికి రాత్రి ఎత్తుకుపోయే సరికొత్త వ్యవస్థగా మారిన సీఐడీని రఘురామకృష్ణరాజు బెదిరిస్తున్నారట.  తాము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తామని వారు హెచ్చరిస్తున్నారు. వారు ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లదల్చుకుంటే రాజకీయ నేతల్లా.. మీడియాకు ప్రకటనలు చేసేవారు కాదు..నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే అదే మీడియాకు సమాచారం అయ్యేది. కానీ.. తమను రఘురామకృష్ణరాజు బెదిరిస్తున్నారంటూ… మీడియాకు సమాచారం ఇచ్చారు. అసలు ఈ బెదిరింపులు ఏమింటే… తన ఫోన్ గురించి.. రఘురామకృష్ణరాజు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం.  లీగల్ నోటీసులు పంపించండి.

రఘురామరాజు ఫోన్ విషయంలో సీఐడీ రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణలన్నింటినీ ఖండించింది. ఆయన ఫోన్‌ను అధికారికంగానే సీజ్ చేశామని.. కోర్టులో ప్రొడ్యూస్ చేశామని చెప్పింది.కానీ ఇప్పుడు అది ఫోరెన్సిక్ ల్యాబ్ కస్టడీలో ఉందని చెబుతోంది. ఆ ఫోన్ మోడల్.. అందులో ఉన్న నెంబర్ గురించి తమకేమీ తెలియదని…  రఘురామకృష్ణరాజు చెప్పిందే రాసుకున్నామని సీఐడీ చెబుతోంది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వస్తేనే అసలు నిజం తెలుస్తుందని… సీఐడీ చెబుతోంది. ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. మే 18న సెల్ ఫోన్ ను ప్రాథమిక విశ్లేషణ ,డేటా , ఫొటోలు  డంపింగ్ చేసేందుకు ఏపి ఎస్ ఎఫ్ ఎల్ కు పంపామని ఇంకా అక్కడే ఉందని సీఐడీ చెబుతోంది. ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పది రోజుల తర్వతా అంటే 27న తేదీన ఫోన్‌ నుంచి  డంపింగ్ చేసిన వివరాలను.. విశ్లేషణ చేసిన డేటా వివరాలను మే 31న కోర్టుకు సమర్పించామని చెప్పుకొచ్చారు.

రఘురామకృష్ణరాజు ఢిల్లీలోఫిర్యాదు చేశారని.. మే 18 వ తేదీ నుంచి సెల్ ఫోన్ ఏపి ఎఫ్ ఎస్ ఎల్ కస్టడీలో ఉంది కాబట్టి..సీఐడి అధికారులు వినియోగించే అవకాశం లేదని వాదించారు. మీడియాలో వచ్చిన కథనాలకు సీఐడీ ఎలా స్పందించిందో కానీ.. బెదిరిస్తున్నారన్నట్లుగా సీఐడీ కొత్తగా ప్రొజెక్ట్ చేయజానికి ప్రయత్నించడం ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం ద్వారా.. రఘురామకృష్ణరాజునే.. స్లో అవ్వాలని హెచ్చరించినట్లు అయిందన్న విశ్లేషణలు కూడా ఇతరుల నుంచి వస్తున్నాయి. సీఐడీ ఏదైనా చట్ట ప్రకారం చేయాలి.. మీడియాతో మైండ్ గేమ్ ఆడటం రాజకీయం అవుతుంది. ఇప్పుడు సీఐడీ అదే చేస్తోందన్నవిమర్శలు ఎదుర్కొంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close