మంజునాథ్ కమిషన్‌కు ఒక్క నెల చాలంటున్న రఘువీరా

హైదరాబాద్: కాపులను బీసీల్లో చేర్చటంపై మంజునాథ్ కమిషన్‌ నివేదిక ఇవ్వటానికి 9 నెలలు పడుతుందని ప్రభుత్వం చెబుతుండగా, 3 నెలల్లో ఇవ్వమని ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఒక్కనెలలోనే నివేదిక పూర్తి చేయొచ్చని చెబుతున్నారు.

రఘువీరా ఇవాళ హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, కాపుల విషయంలో చంద్రబాబు వైఖరిని తప్పుబట్టారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీలను ప్రకటించి కూడా 18 నెలల తర్వాత కమిషన్ వేశారని, ఇప్పటికి కూడా ఆ కమిషన్‌లో సభ్యులను నియమించలేదని గుర్తు చేశారు. కాపు కార్పొరేషన్‌కు సంవత్సరానికి రు.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇవ్వలేదని, ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే విధంగా ఉండటంతో కాపులు ఆందోళనకు దిగటం న్యాయమేనని చెప్పారు. దీనికి పరిష్కారాన్ని కూడా సూచించారు. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, సెంటర్ ఫర్ అకడమిక్ సోషల్ సైన్సెస్ సంస్థలకు కాపుల గణాంకాలు సేకరించే పనిని అప్పజెపితే వారు ఒక్క నెలలోనే ఆ పనిని పూర్తి చేస్తారని చెప్పారు. ఇవన్నీ కాదనుకుంటే 2011లో భారత ప్రభుత్వం కులగణన సర్వే చేసిందని, సామాజిక-ఆర్థిక సర్వే కూడా జరిగిందని వాటిలోనుంచి కూడా కాపుల వివరాలను తెలుసుకోవచ్చని అన్నారు. వీటన్నింటినీ మంజునాథ్ కమిషన్‌కు ఇచ్చి నివేదికను నెలరోజుల్లో తెప్పించుకోవచ్చని రఘువీరా సూచించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అగ్రదేశాలు పక్కనపెడుతుంటే ఇండియాలోనే ఎందుకు? ఈవీఎంలే బీజేపీ బలమా..?

లోక్ సభ ఎన్నికల వేళ మరోసారి ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సాంకేతికతకు పెద్దపీట వేసే అగ్రదేశాలు సైతం ఈవీఎంలను పక్కనపెడుతుంటే ఇండియాలో మాత్రం ఎందుకు ఈవీఎంలతోనే ఎన్నికలను నిర్వహిస్తున్నారనే ప్రశ్నలు...

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close