చైతన్య : రఫెల్‌పై రాహుల్‌వి అబద్దాలైతే.. అసలు నిజాలెందుకు చెప్పరు..?

రఫెల్ డీల్ వ్యవహారంపై దేశమంతా గగ్గోలు పెడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. నేరుగా.. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించి … అనిల్ అంబానీకి వేల కోట్ల రూపాయలు దోచి పెట్టారనేదానికి.. పక్కాగా సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. దీనిపై… మౌలికమైన ప్రశ్నలకు సమాధానాలు కేంద్రం చెప్పడం లేదు. కానీ… రాహుల్ అబద్దాలు చెబుతున్నారని.. రఫెల్‌ స్కాంపై మాట్లాడేవారంతా.. దేశభక్తి లేని వారని… వాదిస్తున్నారు. అధికారి ట్విట్టర్ ఖాతాలో ఒలకబోసిన తమ పరిజ్ఞానాన్ని ఏపీ బీజేపీ నేత.. విష్ణువర్ధన్ రెడ్డి ఇక్కడ బ్లాగ్‌లో రాసుకొచ్చారు. “నిజమైన వాస్తవాలు” పేరుతో ఆయన రాసుకొచ్చిన దాంట్లో .. ఒక్కటైనా.. దేశ ప్రజల్లో ఉన్న సందేహాలు తీర్చే ప్రయత్నాలు చేశారు. ఆ పది ప్రశ్నల్లోనే… ప్రజల్లో అనుమానాలున్నాయి. వాటికి ” సూటిగా సుత్తిలేకుండా సమాధానం చెప్పే ధైర్యం ఉందా..?”. దేశ రక్షణ సొమ్మును… దొంగతనం చేయలేదని.. నిజాయితీగా నిరూపించుకుంటారా..?

రిలయన్స్ ఎంపిక ఎలా జరిగింది :

రక్షణ రంగానికి సంబంధించి.. ఏమి కొన్నా.. ఓ నిబంధన ఉంటుంది. అదేమిటంటే.. విదేశాల నుంచి ఏమి కొన్నా యాభై శాతం.. భారతీయ పార్టనర్ షిప్‌ కంపెనీలతో తయారు చేయాలనేది ఆ క్లాజ్. దీని వల్ల ఏమిటంటే… ఇండియాలో రక్షణ పరికరాల కంపెనీలు అభివృద్ధి చెందుతాయి. రాఫెల్ డీల్‌లో … డీల్ కుదుర్చుకుంటున్న కంపెనీ ఇండియన్ పార్టనర్‌ను తెచ్చుకోవాలి. యూపీఏ హయాంలో.. జరిగిన చర్చల్లో ఇండియన్ పార్టనర్‌గా హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌ను… ఉంచారు. కానీ ఎన్డీఏ వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ కంపెనీ అయిన హెచ్‌ఏఎల్‌ను తొలగించి.. రిలయన్స్ డిఫెన్స్‌కు చోటు కల్పించారు. అప్పటికి మూడు రోజుల ముందే పేపర్లపై అనిల్ అంబానీ కొత్త కంపెనీ పెట్టారు. తర్వాత రెండు వారాల్లోపే.. పాత ఒప్పందం రద్దు చేసి.. హెచ్‌ఏఎల్‌ను తొలగించి… అనిల్ అంబానీ..కంపెనీకి భాగస్వామిగా చేర్చారు. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదంటున్నారు. అసలు వాళ్లే ఎంపిక చేసుకున్నా… భారత ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థను కాదని.. రిలయన్స్ ను ఎందుకు అంగీకరించాలి..? ఎలాంటి కంపెనీ లేకపోయినప్పటికీ.. ఎందుకు అంబానీని ఫ్రాన్స్ తీసుకెళ్లారు..?. అసలు ప్రభుత్వం సిఫార్సు చేయకపోతే దసోతో .. రిలయన్స్ ఎలా ఒప్పందం చేసుకుంటుంది..?

రిలయన్స్ ఎంపికలో ప్రభుత్వ పాత్ర లేదని సుప్రీంకోర్టు చెప్పిందా..?

రఫేల్ అంటే.. సుప్రీంకోర్టు అనేస్తున్నారు ఇప్పుడు బీజేపీ నేతలు. సుప్రీంకోర్టుకు అన్నీ తప్పుడు సమాచారం ఇచ్చారని అనేక ఆధారాలు బయటకు వచ్చాయి. వస్తున్నాయి. ఇండియన్ ఆఫ్‌సెట్ ఓనర్ ఎవరన్నదానిపైనే ఇప్పుడు ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. అనిల్ అంబానీ కంపెనీని ఆఫ్‌సెట్ పార్టనర్‌గా చేర్చారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం… ప్రాన్స్ కంపెనీ.. ఇండియన్ పార్టనర్‌గా ఎవర్ని ఎంచుకుంటుందో.. తమకు సంబంధం లేదని చెబుతోంది. ఇది తప్పని… హెచ్‌ఏఎల్ అధినేత ఇంతకు ముందే ప్రకటించారు. ఒప్పందం చేసుకున్న సమయంలో ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఉన్న హోలాండే కూడా ప్రకటించారు. దసో సీఈవో ఫ్రాన్స్ తమకు హెచ్‌ఏఎల్‌పై… నమ్మకం ఉంది.. భారత ప్రభుత్వానికే లేదని చెప్పారు. కానీ సుప్రీంకోర్టులో ప్రభుత్వం దానికి భిన్నమైన ప్రకటన చేసింది.

పీఎంవో ప్రత్యక్ష ప్రమేయంపై నిజాలేంటి..?

ఏడుగురు సభ్యులతో కూడిన అత్యున్నత కమిటీ.. ఈ రాఫెల్ డీల్‌ వ్యవహరాన్ని చక్క బెట్టాలి. ఆ కమిటీ పని చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం వారి విధుల్లో జోక్యం చేసుకుంది. సమాంతరంగా చర్చలు జరిపింది. పీఎంవో కార్యాలయంలోని ఆష్రఫ్ అనే అధికారి.. నేరుగా.. ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ అమ్మకాల కమిటీతో ఫోన్ లో చర్చలు జరిపారు. ఈ చర్చలు.. కమిటీతో పాటు సమాంతరంగా జరిగాయి. చివరికి ఆ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఫ్రాన్స్ అధికారి.. లేఖ రాస్తే కానీ.. ఇక్కడ రాఫెల్ కొనుగోళ్లను పరిశీలిస్తున్న కమిటీకి ఈ విషయం తెలియలేదు. ఫ్రాన్స్ అధికారులతో పీఎంవో ఎందుకు చర్చలు జరపాల్సి వచ్చింది..?. రహస్యంగా, రక్షణ మంత్రిత్వ శాఖకు తెలియకుండా… పీఎంవో ఫ్రాన్స్‌తో చర్చలు జరపడం ఎందుకు..? ఫ్రాన్స్ చెప్పే దాకా పీఎంవో దీన్ని ఎందుకు రహస్యంగా ఉంచింది..? . ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్‌లో ఎందుకు చెప్పలేదు..?

ఫ్రాన్స్ ప్రభుత్వంతోనే ఒప్పందం చేసుకున్నామని అబద్దాలు ఎందుకు చెప్పారు..?

ఈ ఒప్పందం.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం అని..ఇందులో అవినీతి ఏముందని.. మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. ఇదే వాదన సుప్రీంకోర్టులో వినిపించింది. ఒక వైపు దసో కంపెనీతో ఒప్పందం చేసుకున్నాం.. ఆ కంపెనీ ఆఫ్‌సెట్‌ పార్టనర్‌గా ఎవర్ని ఎంపిక చేసుకున్నా తమకు సంబంధం లేదని చెబుతున్నారు. మరో వైపు భారత ప్రభుత్వానికి.. ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్య ఒప్పందం అంటారు. రెండు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరితే.. ఇండియన్ ఆఫ్‌సెట్ పార్టనర్‌గా ఎవర్ని ఎంచుకోవాలన్న అంశంపై.. భారత ప్రభుత్వానికి సంబంధం ఉండదా..?. అసలు.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య డీల్ కాకపోయినా.. అధి యుద్ధ విమానం.. రక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం. ప్రభుత్వం కచ్చితంగా జోక్యం చేసుకోవాలి. అయినా కూడా.. ప్రభుత్వానికి.. ప్రభుత్వానికి మధ్య కుదిరిన ఒప్పందం అయినప్పుడు.. ఆఫ్‌సెట్ పార్టనర్‌ విషయంపై ప్రభుత్వానికి కచ్చితంగా అధికారాలు ఉంటాయి. ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య డీల్ అయితే.. దసోల్ట్ కంపెనీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు చెల్లించింది. దాదాపుగా ఒక బిలియన్ యూరోస్.. ఏ బ్యాంక్ గ్యారెంటీ లేకుండా.. భారత ప్రభుత్వం దసో కంపెనీకి చెల్లించింది. డబ్బులు తీసుకుని విమానాలు సప్లయ్ చేయకపోతే.. ఎవర్ని అడుగుతారు..?

కొనుగోళ్ల రూల్స్‌లో ఒక్కటీ ఎందుకు పాటించలేదు..?

2013లో తీసుకున్న నిబంధనలను ఫాలో అయ్యామని సుప్రీంకోర్టులో కేంద్రం వాదించింది. ఇది కూడా పూర్తిగా అబద్దం. 2015లో… అకస్మాత్‌గా… ఫ్రాన్స్ పర్యటనలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ డీల్ ను కుదుర్చుకున్నారు. ఆ సమయంలో… రక్షణ మంత్రి పారీకర్ గోవాలో చేపల మార్కెట్ ప్రారంభిస్తున్నారు. 2016లో ఒప్పందంపై సంతకాలు పెరిగాయి. 2013 డిఫెన్స్ ప్రొక్యూర్ మెంట్ పాలసీ ఏం చెబుతోంది..?. మొదట.. డిఫెన్స్ ఎక్విజేషన్ కౌన్సిల్ సమావేశం కావాలి.. ఆ తర్వాత.. కేబినెట్ కమిటీ అని సెక్యూరీటీ ఎఫైర్స్ క్లియర్ చేయాలి. ఇవేమీ చేయలేదు. సాంకేతిక పరిజ్ఞానం బదిలీ సహా.. అనేక దేశ ప్రయోజనాలను పణంగా పెట్టేలా నిబంధనలు ఎందుకు సడలించారు.

విమానం ధర 300 రెట్లు ఎలా పెరిగింది..?

యూపీఏ హయాంలో చేసుకున్న ఒప్పందంలో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయాలని ఉంది. కానీ కొత్త ఒప్పందంలో దాన్ని తీసేశారు. ఇది దస్సాల్ట్ కంపెనీకి లాభం చేకూర్చారు. ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిన పని లేదు. ఇక్కడేం జరిగిందంటే.. ఈ క్లాజ్ తీసేస్తాం.. మేం చెప్పిన కంపెనీని ఒప్పందంలో చేర్చుకోమని లాబీయింగ్ జరిగింది. భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని తాకట్టు పెట్టి…అనిల్ అంబానీకి లాభం చేకూర్చారు. దీనికి దస్సాల్ట్ కంపెనీ.. సంతోషంగా ఒప్పుకుంది. మోడీ కొత్తగా చేసుకున్న ఒప్పందంలో ఒక్కో యుద్ద విమానం ధరను 24.30 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. అంటే.. గత ఒప్పందంతో పోలిస్తే ఈ ఒప్పందం ప్రకారం ఒక్కో విమానానికి మూడు వందల శాతం అధిక ధర చెల్లించాలని నిర్ణయించారు. మూడేండ్లలోనే ఇంతగా ధరల్లో తేడా ఎలా వచ్చింది..? యూపీఏ ఒప్పందం ప్రకారం విమానాల తయారీ సాంకేతికతను భారత్‌కు బదిలీ చేయడానికి దస్సాల్ట్‌ అంగీకరించింది. తాజా ఒప్పందంలో అందుకు అవకాశమివ్వలేదు. మోడీ చేసుకున్న ఒప్పందాన్నే మోడీ ఉల్లంఘించారు. రాఫెల్ ధర సీక్రెట్ అని.. దేశ ప్రయోజనాలకు భంగం అని బీజేపీ చెబుతోంది కానీ… దసో కంపెనీ తన వార్షిక నివేదికలో ఎప్పుడో ఆ వివరాన్ని బయటపెట్టింది. దాని వల్లే బయటకు తెలిసింది. కానీ.. అధికారికంగా చెబితే.. ఎక్కడ బుక్కయిపోతామేమోనన్న భయంతోనే… బీజేపీ దేశ రక్షణ అంటూ కొత్త డ్రామాలు ఆడుతోంది.

ఇది దేశాన్ని దోచుకున్న వ్యవహారమే..!

మార్చి 25 2015లో దస్సాల్ట్ సీఈవో సంతకాలే మిగిలి ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత పదిహేను రోజుల్లో ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఈ విషయం ఫారిన్ సెక్రటరీకి తెలియదు. వారం రోజుల ముందు వరకు.. రక్షణ మంత్రికి కూడా తెలియదు. ఎందుకంటే.. అప్పటి రక్షణ మంత్రి.. ఒప్పందానికి వారం రోజుల ముందు కూడా.. హెచ్‌ఏఎల్‌తో ఒప్పందం ఉంటుందని మాట్లాడారు. రాఫెల్‌ ఒప్పందంపై పారిస్‌లో ప్రధాని మోడీ సంతకం చేయడానికి రెండురోజుల ముందు భారత విదేశాంగ కార్యదర్శి జైశంకర్‌ చేసిన ప్రకటన అందరినీ ఆశ్యర్య పరిచింది. ఈ ఒప్పందం నుంచి హెచ్‌ఏఎల్‌ను తప్పిస్తున్నట్టు ఆయన ప్రశ్నించారు. ఈ విషయాన్ని భారత్‌లోని ఉన్నతాధికారులకు కూడా తెలియకుండా అత్యంత గోప్యంగా ఎందుకు ఉంచారన్నదే ప్రశ్న..? మొత్తంగా చూస్తే.. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఉన్న భారత ప్రయోజనాలను కాపాడే.. క్లాజులన్నింటినీ తొలగించి… ప్రైవేటు కంపెనీకి లాభం కలిగేలా.. ఒప్పందం చేసుకున్నారు. అంటే.. స్కాం జరిగిందని.. స్పష్టంగా అర్థమైపోతూనే ఉంది.

రఫెల్‌పై మాట్లాడితే మాట్లాడితే దేశభక్తి లేదంటారు..? . దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్… అన్న గడ్డ మనది. కానీ.. దేశంలో ఉన్న మనుషుల మధ్య… చిచ్చు పెట్టి.. భిన్నత్వంలో ఏకత్వంగా కలసి ఉంటున్న ప్రజలను చీల్చి… రాజకీయాలు చేస్తున్న బీజేపీనే అసలైన దేశద్రోహపార్టీ. ఆ దేశద్రోహ పార్టీనే.. ఇప్పుడు దేశాన్ని దోచుకుంటోంది. బీజేపీకి .. ఆ పార్టీ నేతలకు దేశం అంటే.. ఒక్క బీజేపీనే. .. భారతదేశం కాదు. విష్ణువర్ధన్ రెడ్డికి నోరుంది. ఆయన ఏదైనా… టాపిక్ ఎక్కడికో తీసుకెళ్లగలరు. అందుకే..ఇక్కడ రాత పూర్వకంగా వీటికి సమాధానం వ్వాలి. రాహుల్ అబద్దాలు చెప్పారు.. ఫ్రాన్స్ అబద్దం చెప్పింది.. సుప్రీంకోర్టు చెప్పింది.. ఇవన్నీ… రాజకీయంగా మాట్లాడుకునే మాటలు. కానీ ప్రజల మనసుల్లో ఈ అనుమానాలున్నాయి. తీర్చగలరా..?. సూటిగా.. సుత్తి లేకుండా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విజ‌య్ పాత లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు తీస్తారా?

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన 'డియ‌ర్ కామ్రేడ్‌', 'ఖుషి' చిత్రాల తాలుకూ క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఏమిటి? ఈ సినిమాల వ‌ల్ల నిర్మాత‌లు న‌ష్ట‌పోయారా, లాభ‌ప‌డ్డారా? ఈ లెక్క‌ల‌న్నీ బ‌య‌ట‌కు రాబోతున్నాయి. విజ‌య్...

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close