బీజేపీ పాలనలో రెండు ఇండియాలు.. రాహుల్ ప్రసంగానికి దేశం ఫిదా !

ఒక్కో సారి దేనికైనా అంచనాలు ఉండవు. కానీ ఎక్స్‌ట్రార్డినరీ అవుతుంది. ఆ విషయం మెల్లగా ప్రజల్లోకి వెళ్తుంది. ఓ చోట ఓ వ్యక్తి ప్రసంగించినప్పుడు అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. కానీ స్పందించడానికి ఎవరికీ నోళ్లు రావు.  ఎక్కడో ఓ వ్యక్తి లేచి చప్పట్లు కొడతాడు. దాంతో మిగతా వారు ధైర్యం తెచ్చుకుని  అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇస్తారు. అచ్చంగా అలాంటి సిట్యూయేషన్ ఇప్పుడు రాహుల్ గాంధీ ఫేస్ చేస్తున్నారు. పార్లమెంట్ లో మూడు రోజుల కిందట రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ఇప్పుడు దేశం మొత్తం వైరల్ అవుతోంది. అద్భుతమైన ప్రసంగం అంటూ ప్రశంసలు వచ్చేలా చేస్తోంది.

రాహుల్ ప్రసంగం అంతా సూటిగా సుత్తి లేకుండా దేశంలో జరుగుతున్న పరిణామాల్ని కాంగ్రెస్ పార్టీ కోణంలో చాలా స్పష్టంగా వ్యక్తీకరించారు. కేరళ ఎంపీగా ఆయన దక్షిణాది సమస్యల్ని.. కేంద్రం చూపిస్తున్న వివక్షతను వెల్లడించిన వైనం వైరల్‌గా మారుతోంది. రాష్ట్రాల అధికారాలను లాక్కుంటూ సమాఖ్య స్ఫూర్తిని కేంద్రం నిర్వీర్యం చేస్తున్న తీరుపై రాహుల్ గాంధీ సునిశితమైన విమర్శలు చేశారు. రాజ్యాంగం ప్రకారం భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని, దానిని “రాజ్యం”గా పరిపాలించలేమని అన్నారు. భారతదేశం వివిధ భాషలు, సంస్కృతుల సమ్మేళనం అని అన్నారు. ఫెడరలిజం, వాక్ స్వాతంత్ర్యం, డిబేట్స్ ప్రజాస్వామ్యానికి ముఖ్యమన్నారు. సమాఖ్య వ్యవస్థలో సహకారం అవసరాన్ని రాహుల్ నొక్కి చెబుతూ.. ఒకసారి అశోకుడు, మౌర్యులు గురించి తెలుసుకోవాలని, వారు మాటలు, చర్చల ద్వారానే రాజ్యాలను పాలించారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి చరిత్రపై అవగాహన లేదని, రాష్ట్రాల యూనియన్ అనే భావనను అణగదొక్కేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. మాట్లాడుకోవడం, చర్చల ద్వారానే నిర్ణయాలు తీసుకోవాలని రాహుల్ అన్నారు కేంద్ర ప్రభుత్వం దండించడం ద్వారా పాలించవచ్చు అనే దృక్పథంలో ఉందని విమర్శించారు. ” న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్ఠ ద్వారా పాలన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలనూ ఒప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించలేదు.

కొన్నాళ్ల క్రితం ఓ ఇండియన్ స్టాండప్ కమెడియన్ అమెరికాలో ప్రదర్శన ఇస్తూ రెండు ఇండియాల గురించి కామెంట్స్ చేశారు. దానిపై దేశంలో బీజేపీ నేతలు దుమారం రేపారు. కానీ రాహుల్ గాంధీ అదే రెండు ఇండియాల గురించి పార్లమెంట్‌లోనే కేంద్రాన్ని ప్రశ్నించారు. తన దృష్టిలో ప్రస్తుతం రెండు ఇండియాలు ఉన్నాయన్న రాహుల్…ఒకటి పేదల ఇండియా, మరోటి ధనవంతుల ఇండియా ఉందంటూ విమర్శించారు. ” ఇప్పుడు రెండు భారత దేశాలు ఉన్నాయి. ఒక భారతదేశం.. అత్యంత ధనవంతుల కోసం, అపారమైన సంపద, అధికారంతో, ఉద్యోగం, నీటి కనెక్షన్, విద్యుత్ కనెక్షన్ అవసరం లేని వారికోసం.. మరొక భారతదేశం పేద ప్రజల కోసం..” అని విశ్లేషించారు. ఈ రెండు ఇండియాల మధ్య అంతరం అంతకంతకూ పెరుగుతోందన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నిరుద్యోగం గురించి కనీసం ప్రస్తావన కూడా లేదన్నారు. దేశ యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోందన్నారు. 2021లో దేశంలో 3 కోట్ల మంది యువత ఉద్యోగాలు కోల్పోయారని చెప్పారు రాహుల్. UPA పదేళ్ల పాలనలో పది కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్న రాహుల్‌…ప్రస్తుతం బీజేపీ పాలనలో 23 కోట్ల మంది మళ్లీ పేదరికంలోకి జారుకున్నారని  విమర్శించారు.

రాహుల్ గాంధీ ప్రత్యేకంగా తమిళనాడు గురించి ప్రస్తావించారు.  దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న తమిళుల సమస్యల గురించి వివరించారు. రాష్ట్రాలు ఎదుర్కొంటున్న వివక్షను వివరించారు. కేంద్ర సంస్థల్ని వాడుకుని రాజకీయంగా ఎలా వేధిస్తున్నారో వివరించారు. చివరిగా బీజేపీ, మోడీ పాలన దేశానికి ఎంత నష్టం చేస్తుందో కళ్లకుకట్టారు. అందుకే అందరూ ఇప్పుడు రాహుల్‌ను శభాష్ అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎడిటర్స్ కామెంట్ : ట్యాపింగ్ – దొరికినవాడే దొంగ !

"టెక్నాలజీ మన జీవితాల్లోకి చొచ్చుకు వచ్చాక మన ప్రతి కదలికపై మరొకరు నిఘా పెట్టడానికి అవకాశం ఇచ్చినట్లే. తప్పించుకునే అవకాశం లేదు.." కాకపోతే ఈ అవకాశం అధికారం ఉన్న వారికే వస్తుంది....

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close