కాలి నడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాహుల్ గాంధీ..!

దేశంలో ప్రముఖ నేతలందరూ.. తిరుమల శ్రీనివాసుని భక్తులే. ఒక్కసారి కూడా దర్శించుకోని వారు అరుదు. రాహుల్ గాంధీ ఇప్పటి వరకూ తిరుమలకు రాలేదు. మొదటి సారి ఆయన శుక్రవారం తిరుమలకు వస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చాలా సార్లు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. ఎమర్జెన్సీ కాలంలోనూ…. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఓటమి తరువాత… కూడా ఆమె తిరుమలకు వచ్చారు. తిరుమలేశుని ఆశీస్సులు తీసుకుని ఆమె మళ్లీ ప్రధాని అయ్యారు. భారత తొలి ప్రధాని నెహ్రు కూడా ఓ సారి తిరుమలకు వచ్చారు. రాజీవ్ గాంధీ కూడా పలు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఈ నెల 22న తిరుపతికి రానున్నారు. సంప్రదాయబద్దంగా దర్శనం చేసుకోనున్నారు. అది కూడా కాలిబాటన తిరుమలకు నడచివెళ్లి మరీ స్వామి వారిని దర్శించుకోనున్నారు.

రాహుల్ గాంధీ ఇటీవలి కాలంలో… హిందూ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన శివభక్తునిగా మారడమే కాదు… అనేక భక్తియాత్రలు చేసారు. అనేక రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్నింటినీ సందర్శించారు. అనేక మఠాలు, పలువురు స్వామీజీల ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు. ఆయా ఆలయాలకు వెళ్లినపుడు అక్కడి సంప్రదాయాలను పాటిస్తున్నారు. అక్కడ కట్టు బొట్టును తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన సందర్శించిన ఆలయాల్లో ఎక్కువ శైవ ఆలయాలే..! మొదటి సారి ప్రముఖమైన వైష్ణవ ఆలయాన్ని రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. అదే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయం.

కైలాస మానస సరోవరం యాత్రతో మొదలు పెట్టి ఇలా అన్ని ఆలయాలను రాహుల్ గాంధీ దాదాపుగా చుట్టేశారు. మధ్య ప్రదేశ్ లో రాహుల్ గాంధీ అయిదు ఆలయాలు సందర్శిస్తే… ఆలయాలకు అనుబంధంగా వున్న 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 13 గెలుచుకుంది. రాజస్థాన్ లో మూడు ఆలయాలు రాహుల్ గాంధీ సందర్శిస్తే… ఆలయాల ప్రభావం ఉన్న 28 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 12 గెలుచుకుంది. చత్తీస్ ఘడ్ లో రెండు ఆలయాలను రాహుల్ గాంధీ సందర్శిస్తే… ఆలయాలకు అనుబంధంగా వున్న 12 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 10 గెలుచుకుంది. సెక్యూలర్ ముద్రతో హిందూ ఓటర్లకు దూరమైన కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు రాహుల్ గాంధీ ఇలా ఆలయాలను తిరుగుతున్నారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీన్ని రాహుల్ కూడా ఖండించరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close