సిక్కు అల్లర్లపై రాహుల్ టార్గెట్..! గోద్రాపై నోరెందుకు లేవదు..?

యూరప్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ… లండన్‌లో బ్రిటీష్‌ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో సిక్కు అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ హస్తంపై ఓ సభ్యుడు ప్రశ్న అడిగారు. దానికి రాహుల్ గాంధీ సమాధానం చెప్పారు. అది ప్రతీకారంగా జరిగిన దాడులే తప్ప… పార్టీకి సంబంధం లేదన్నారు. ఆ సమాధానం వచ్చినప్పటి నుంచి.. బీజేపీ…అదో పెద్ద తప్పు అన్నట్లు ప్రచారం చేసేస్తోంది. బీజేపీ అనుకూల మీడియా చర్చకార్యక్రమాలు కూడా నిర్వహించేస్తోంది. నిజానికి 2005, ఆగస్టు 11వ తేదీన అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ సిక్కు అల్లర్లకు బేషరుతుగా క్షమాణలు చెప్పారు. ఆయన ఒక్క సిక్కు సామాజిక వర్గానికే కాకుండా మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పారు.

ఈ సిక్కు అల్లర్ల వ్యవహారంలో రాహుల్ గాంధీని కార్నర్ చేయడానికి బీజేపీ అనుకూల మీడియా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంది. నిజానికి ఆ అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ వయసు 14 ఏళ్లు మాత్రమే. అయినా సరే ఆ అంశంపై ప్రశ్నలు వేసి.. రాహుల్ ను ఇబ్బంది పెట్టాలనే ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీ పరంగా తప్పితే.. రాహుల్‌కు ఏ మాత్రం సంబంధం లేదని సిక్కు అల్లర్ల విషయంలో… ఆయనను అంతగా కార్నర్ చేస్తున్న వారు… గోద్రా వ్యవహారాన్ని మాత్రం అసలు పట్టించుకోరు. సిక్కు అల్లర్లప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో.. 2002లో గుజరాత్‌లో మత మారణహోమం జరిగినప్పుడు అప్పటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే వ్యవహరించింది. ఇది బహిరంగ రహస్యం. ఇప్పుడు మోడీ ఎక్కడకు వెళ్లినా గోద్రా గురించి ఎవరూ ప్రశ్నించరు. ఒకప్పుడు సిక్కు అల్లర్లకు వ్యతిరేకంగా రాహుల్‌గాంధీని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన అర్నాబ్‌గోస్వామి, ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు గుజరాత్‌ అల్లర్ల ప్రస్తావనే తీసుకరాలేదు.

2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్‌ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం చైర్మన్‌రాఘవన్ మోదీ ప్రధాన మంత్రి అయ్యాక సైప్రస్‌ దేశానికి హైకమిషనర్‌ అయ్యారు. దీని వెనుక ఎలాంటి లోగుట్టు లేదని చెప్పుకోలేం. ఇవన్నీ తెలిసి కూడా…. మీడియా పేరుతో మేధావుల పేరుతో.. రాహుల్‌కు ఏ మాత్రం సంబంధం లేని అంశాన్ని ఆయతో వివాదాస్పద సమాధానాలు చెప్పించి.. ఎప్పుడో మానిపోయిన గాయాన్ని మళ్లీ మళ్లీ రేపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ..కళ్లు ముందు జరిగిన ఘోరానికి సాక్ష్యంగా ఉన్న మోడీని మాత్రం గోద్రా విషయంలో ప్రశ్నించడానికి నోళ్లు రావు. మరి సమానత్వం ఉన్నట్లేనా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com