టి. కాంగ్రెస్‌లో ఇక బహిరంగ ధిక్కరింపులు ఉండవా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని 42 మంది ప్రముఖుల్ని.. ఒకేసారి పిలిచిన ఆ పార్టీ అధ్యక్షుడు.. రాహుల్ గాంధీ…విడివిడిగానే అయినా.. అందరికీ.. ఒక విషయాన్ని మాత్రం సూటిగా చెప్పారంటున్నారు. కాంగ్రెస్‌లో అందరూ అనుకుటున్నట్లుగా.. ప్రజాస్వామ్యాన్ని ఎక్కువగా అనుభవించేసి… సొంత పార్టీ నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా .. మీడియాకు ఎక్కితే మాత్రం… వివరణలు ఇచ్చుకునే అవకాశం కూడా ఉండదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. రాహుల్‌తో భేటీ తర్వాత బయటకు వచ్చిన ఉత్తమ్‌ సహా… ముఖ్యనేతలు ఇదే చెప్పారు. చివరికి.. ఉత్తమ్ అంటే.. ఇంతెత్తున లేచే.. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా.. ఇదే మాట చెప్పారు. ఏదైనా పార్టీ వేదిక మీదే మాట్లాడుకోవాలి కానీ.. మీడియాకు ఎక్కవద్దని రాహుల్ సూచించించారని చెప్పుకొచ్చారు. వాళ్లకు అది సూచనే కావొచ్చు కానీ… నిజంగా అది హెచ్చరిక అని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

పార్టీ లైన్ దాటితే ఎంతటి వారినైనా పార్టీ నుంచి గెంటి వేయడం ఖాయం. పార్టీ ముఖ్యనేతలు అంటే పీసీసీ చీఫ్ ఇతర పెద్దలు చెప్పినట్లే నడుచుకోవాలి.. పదే పదే ఫిర్యాదులతో ఢిల్లీకి వస్తే.. అదే పెద్ద మైనస్ అవుతుంది. మూడు గంటల పాటు ప్రతి నేతతోనూ విడివిడిగా మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో పార్టీ పరిస్థితి చాల మెరుగ్గా ఉందని.. కలసి కట్టుగా గెలుపు కోసం పని చేయాలని ఆదేశించారు. పార్టీ గీత ఎవరైనా దాటితే ఎంతటి సీనియర్ నాయకుడైనా సరే కఠిన చర్యలు తప్పవని నేరుగానే హెచ్చరించారంటున్నారు. ఎన్నికలు ముగిసేవరకు ఫిర్యాదులతో ఏ ఒక్క నేత ఢిల్లీ రావొద్దని తేల్చి చెప్పారు.

రాహుల్ గాంధీ.. ఒకే రోజు మూడు గంటల పాటు… తెలంగాణకు కేటాయించడం.. ముఖ్యనేతలందర్నీ పిలిచి మాట్లాడటం.. ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అంతే కాదు.. నేతలతో ఆయన మాట్లాడే తీరులో కూడా కాస్తంత మార్పు వచ్చింది. తమకే పదవులు కావాలన్నట్లుగా.. ఇతరుల్ని తీసేయాలన్నట్లుగా వ్యవహరిస్తూ.. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే… పార్టీ మారిపోతామని.. హెచ్చరించే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చాలా స్ట్రాంగ్‌గానే వార్నింగ్ ఇచ్చారని అంటున్నారు. అదే నిజమైతే.. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక నోరు మెదపకపోవచ్చు. ఎందుకంటే.. వాళ్లకి ఇక బయట పార్టీల్లో ఇప్పుడు అవకాశాలు లేవు మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close