ఈ కుర్రాడు.. మ‌ళ్లీ పెంచేశాడండీ..!

కుర్ర హీరో రాజ్ త‌రుణ్ సుడి ఓ రేంజులో తిరుగుతోంది. వ‌రుస‌గా మూడు హిట్ల‌తో హ్యాట్రిక్ కొట్టాడు. ఆ త‌ర‌వాత సీత‌మ్మ అందాలు – రామ‌య్య సిత్రాలు ఫ్లాప్ అయ్యింది. అయినా.. త‌రుణ్ క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేదు. తాజాగా ఈడోర‌కం – ఆడోర‌కం సినిమా కూడా హిట్ బాట ప‌ట్టేసింది. ఇది మంచు విష్ణు సినిమాగా చ‌లామ‌ణీ అయిన‌ప్ప‌టికీ, టికెట్లు తెగుతోంది మాత్రం పోస్ట‌రుపై రాజ్ త‌రుణ్ బొమ్మ‌చూసే. అందుకే ఇదే అదును అనుకొని మ‌రోసారి త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేశాడ‌ట రాజ్‌త‌రుణ్‌. కుమారి 21 ఎఫ్ కి రూ.60 ల‌క్ష‌లు అందుకొన్న ఈ కుర్రాడు.. ఇప్పుడు ఏకంగా రూ.కోటి వ‌ర‌కూ డిమాండ్ చేస్తున్నాడ‌ట‌.

దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి అంటారు. దాన్ని రాజ్‌త‌రుణ్ కూడా ఫాలో అవుతున్నాడు. ఉయ్యాల జంపాలకు త‌రుణ్ అందుకొన్న‌ది ఆరు ల‌క్ష‌లేన‌ట‌. ఆ త‌ర‌వాత సినిమా చూపిస్త‌మావ‌కు రూ.20 ల‌క్ష‌లు ప‌లికాడు. ఆ హిట్టుతో కుమారి 21 ఎఫ్‌కి మూడు రెట్లు అధికంగా పారితోషికం అందుకొన్నాడు. ఈడోర‌కం.. కోసం మంచు ఫ్యామిలీ ఇచ్చినంత మారు మాట్లాడ‌కుండా తీసుకొన్నాడు త‌రుణ్‌. ఇప్పుడు మాత్రం రూ. కోటి ఇవ్వాల్సిందే అంటున్నాడ‌ట‌. రాజ్‌త‌రుణ్ మేనేజ‌ర్ రాజార‌వీంద్ర ఏకంగా 1.25 ల‌క్ష‌ల‌ రూపాయ‌లు డిమాండ్ చేసి.. ఆఖ‌ర్లో బేరాన్ని రూ.కోటికి ఫిక్స్ చేస్తున్నాడ‌ట‌. ఇప్పుడు రాజ్‌.. హావాన‌డుస్తోంది. అందుకే.. అడిగినంత ఇవ్వ‌డానికి కూడా నిర్మాత‌లు ఎగ‌బ‌డుతున్నారు. చూద్దాం.. ఈ వెలుగు ఎంత కాల‌మో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోకి కేకే , కడియం..!!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా కేసీఆర్ సన్నిహిత నేతలు కూడా హస్తం గూటికి చేరేందుకు...

‘లెజెండ్’ ఎఫెక్ట్.. జయం మనదే

బాలకృష్ణ లెజెండ్ సినిమా ఈనెల 30న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా పదేళ్ళు పూర్తి చేసుకున్న నేపధ్యంలో రీరిలీజ్ కి పూనుకున్నారు. ఈ సినిమా 2014 ఎన్నికల ముందు వచ్చింది. ఆ...

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close