సాయిని కాదని దిల్ రాజు రాజ్ తరుణ్ కు ఛాన్స్ ఇచ్చాడు

హీరోగా ఎంట్రీ ఇచ్చి నటించిన మూడు సినిమాల్లో రెండు సినిమాలను హిట్ చేసుకున్న హీరో సాయి ధరం తేజ్. మెగా అభిమానులను అతి తక్కువ కాలంలో తన బుట్టలో వేసుకున్నాడు. అయితే దిల్ రాజు బ్యానర్ లో ప్రస్తుతం సుప్రీం సినిమా చేస్తున్న సాయి తన తర్వాత సినిమా కూడా దిల్ రాజు చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ సినిమాకు నూతన దర్శకుడు సతీష్ వేగ్నేష్ దర్శకత్వం వహిస్తున్నాడని అన్నారు.

అయితే సడెన్ గా ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ సాయి చేతుల నుండి యువ కెరటం రాజ్ తరుణ్ చేతికి వచ్చింది. ‘శతమానం భవతి’ అనే అచ్చమైన తెలుగు టైటిల్ తో వస్తున్న ఈ సినిమా దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ఈ సంవత్సరం దసరా బరిలో విడుదల చేయనున్నారు.

వరుస విజయాలతో ఫుల్ ఫాంలో ఉన్న రాజ్ తరుణ్ రీసెంట్ రిలీజ్ సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు కాస్త నిరాశ పరచినా అవకాశాలు మాత్రం వెళ్లువల్లా వచ్చి పడుతున్నాయి. దిల్ రాజు బ్యానర్ లో సినిమా తర్వాత రాజ్ తరుణ్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మాణంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

సెంచరీకి చేరువలో చింతమనేనిపై కేసులు..!!

చింతమనేని ప్రభాకర్...మాస్ లీడర్. ఆయన ఆహార్యం కూడా అలాగే ఉంటుంది. ఎన్నికల్లో టీడీపీ తరఫున దెందులూరు నుంచి పోటీ చేస్తోన్న చింతమనేని ప్రభాకర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ కు...

ఎంపీ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన బర్రెలక్క పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె నామినేషన్ దాఖలు చేశారు. తన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close