పారితోషికాన్నీ త్యాగం చేసిన రాజ‌మౌళి

బాహుబ‌లి 2 వెయ్యి కోట్ల సినిమా అవ్వ‌డానికి ప‌రుగులు తీస్తోంది. తొలిభాగం దాదాపుగా ఆరొంద‌ల కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. మొత్తంగా కలుపుకొనిచూస్తే ఈ రెండు సినిమాలూ దాదాపు రూ.1500 కోట్లు సాధించ‌బోతున్న‌ట్టు లెక్క‌. ఆర్థికంగా బాహుబ‌లి సినిమాల విష‌యాన్ని అంచ‌నా వేయ‌డానికి ఈ అంకెకు మించిన ఆస‌రా ఏముంటుంది? బాహుబ‌లి సిరీస్ తో రాజ‌మౌళి బాగా మిగులుచ్చుకొన్నాడ‌ని, భారీ ఎత్తున పారితోషికం తీసుకొన్నాడ‌ని, అది రూ.60 కోట్ల‌కుపైమాటే అని ర‌క‌రకాల ఊహాగానాలు వ్య‌క్తం అవుతున్నాయి. రాజ‌మౌళి ఈ సినిమా ద్వారా ఎంత మిగిల్చుకొన్నాడో రాజ‌మౌళికీ, ఆ నిర్మాత‌ల‌కే ఎరుక గానీ.. నిజానికి ఈ ప్రాజెక్టు మొద‌లెట్టేట‌ప్పుడు పారితోషికం ప్ర‌స్తావ‌నే రాలేద‌ట‌. బాహుబ‌లిని ఇప్పుడంటే ఆహా ఓహో అని పొగిడేస్తున్నాం, క‌రిగిపోతున్న రికార్డుల‌ను చూసి త‌రించిపోతున్నాం గానీ.. మొద‌లెట్టేట‌ప్పుడు మాత్రం భ‌యం భ‌యంగానే ఉంద‌ట‌. ఇంత పెట్టుబ‌డి పెడుతున్నాం… తిరిగి రాబ‌ట్ట‌డం కుదిరే ప‌నేనా? అంటూ లెక్క‌లేసుకొన్నార్ట‌. ఒక‌వేళ అటూ ఇటూ అయితే పారితోషికాలు వెన‌క్కి ఇచ్చేయ‌డానికి రాజ‌మౌళి, ప్ర‌భాస్‌, రానా సంసిద్ద‌మ‌య్యార్ట‌.

అప్ప‌టి వ‌ర‌కూ తీసుకొంటున్న పారితోషికం కంటే.. త‌క్కువ మొత్త‌మే ఎగ్రిమెంట్‌లో రాసుకొన్నార‌ని, పారితోషికాల్ని `త్యాగం` చేయ‌డంతోనే.. బాహుబ‌లి సినిమా మొద‌లైంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని రాజ‌మౌళి సైతం అంగీక‌రించాడు. ”మేం చేస్తోంది రిస్క్ అని మాకు తెలుసు. అందుకే పారితోషికాలు త‌గ్గినా ఫ‌ర్వాలేద‌నుకొన్నాం” అని అస‌లు గుట్టు విప్పేశాడు. అయితే… బాహుబ‌లి 1 సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం, పార్ట్ 2పై అంచ‌నాలు పెర‌గ‌డం, దానికీ ఊహించిన దానికంటే ఎక్కువ మార్కెట్టే జ‌ర‌గ‌డంతో.. రాసుకొన్న పారితోషికాల కంటే ఎక్కువ మొత్తం చెల్లించార్ట నిర్మాత‌లు. ఆ మొత్తం ఎంత‌న్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close