బాహుబలి.. రాజమౌళి స్వస్తి !!

వెండితెర అద్భుతం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ప్రేక్షకులను అబ్బురపరుస్తోంది. ‘బాహుబలి ది: బిగినింగ్‌’ కు కొనసాగింపుగా వచ్చిన ‘..కన్‌క్లూజన్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం ‘బాహుబలి’ రికార్డుల మోత మోగిస్తోంది. ఇండియన్ సినిమా రికార్డులన్నీటిని చెరిపేసింది బాహుబలి. బాలీవుడ్ రికార్డులు కూడా బద్దలైపోయాయి. ఇక చెప్పుకోవాడానికి బాహుబలి తప్పితే ఇంక ఏమీ మిగల్లేదు. ఆ రేంజ్ లో ప్రభంజనం సృస్టించింది బాహుబలి.

ఇదంతా అంత సులువుగా సాధ్యకాలేదు. బాహుబలి కోసం ఐదేళ్ళ పాటు యజ్ఞం చేశాడు దర్శకుడు రాజమౌళి. ఆ కష్టం మాటల్లో చెప్పలేం. హీరో ప్రభాస్ కూడా తన కెరీర్ లో ఐదేళ్ళు రాజమౌళి చేతిలో పెట్టేశాడు. చిత్ర యూనిట్ మొత్తం రాజమౌళిని బలంగా నమ్మింది. ఆ నమ్మకాని వమ్ము చేయలేదు రాజమౌళి. ‘బాహుబలి’అంటూ ఓ క్లాసిక్ పీస్ ను అందించారు. సినిమా ఉన్నంత కాలం ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయే ఓ దృశ్యకావ్యాన్ని తీశాడు రాజమౌళి.

సినిమా తీయడం ఒక ఎత్తు, ఆ సినిమా స్థాయి ఏమిటో జనాలకు చెప్పడం మరో ఎత్తు. ఈ విషయంలో కూడా తన ముద్ర వేశాడు రాజమౌళి. సినిమా మొదలైనప్పటి నుండి కంటికిరెప్పలా కాపాడుకున్నాడు. బాహుబలి విషయంలో రాజమౌళి తీసుకున్న కేర్ అంత ఇంత కాదు. బాహుబలిని ‘బ్రాండ్’ గా మలిచిన తీరు ఖచ్చితంగా ఎంబీఏ పుస్తకాల్లో పెట్టాలి. ఒక సినిమాని బ్రాండ్ గా మలచడం ఎలా ? అనేది బాహుబలిని చూసి నేర్చుకోవాల్సిందే. ఏ ఒక్క క్షణం ఓపిక కోల్పోలేదు రాజమౌళి. బాహుబలి ప్రమోషన్ లో రాజమౌళి వ్యహరచన అమోఘం. ఇది చాలా దగ్గర పరిశీలించిన వారికి అర్ధమౌతుంది. జనరల్ గా సినిమాకి పబ్లిసిటీ డిజైనర్స్ వుంటారు. కాని రాజమౌళి బాహుబలి విషయంలో ఆ బాధ్యతను కూడా భుజాన ఎత్తుకున్నారు. దీనికి కోసం గొప్ప టీం వర్క్ చేశారు. ఆ టీం ఆయనే నాయకత్వం వహించారు. అయితే ఇప్పుడా పని ముగిసింది. బాహుబలి ప్రమోషన్ కు లండన్ లో శుభం కార్డు వేశారు రాజమౌళి. బాహుబలికి సంబధించిన ప్రమోషన్ లో నా పని ముగిసింది. ఇదే చివరి అడుగు. అందరికీ ధన్యావాదాలు” అంటూ సెలవు తీసుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా లండన్ లో టీంతో దిగిన ఓ ఫోటో ను కూడా అభిమానులతో షేర్ చేశారు జక్కన్న.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.