నా అభిప్రాయం తప్పని నిరూపించినందుకు థాంక్స్: రాజమౌళి

నాగార్జున, కార్తి, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఊపిరి సినిమా నిన్న ప్రపంచ వ్యాపతంగా 2000 థియేటర్లలో విడుదలయ్యి మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొంది. ఎప్పుడూ ప్రయోగాలకు సిద్దంగా ఉండే నాగార్జున ఈ సినిమాలో నడుం క్రింద భాగం చచ్చుబడి, వీల్ చైర్ కే పరిమితమయిన కోటీశ్వరుడి పాత్రలో అత్యద్భుతంగా నటించారు. అతనికి సహాయకుడిగా కార్తి కూడా పోటీపడి మరీ నటించాడు. ఈ సినిమా ‘అన్ టచబుల్స్’ అనే ఫ్రెంచ్ సినిమాకి రీమేక్. దానిని దర్శకుడు వంశీ అత్యద్భుతంగా తెలుగులో రీమేక్ చేసారు. ఈ సినిమాని చూసిన దర్శకుడు వంశీ, నాగార్జున, కార్తిలను ప్రశంసిస్తూ ట్వీటర్ లో మెసేజ్ లు పెట్టారు.

“‘ఇన్ టచబుల్స్’ సినిమా నా ఫేవరేట్ సినిమా. ఆద్యంతం భావోద్వేగాలతో నిండి ఉండే ఆ సినిమాను వంశీ తెలుగులో తీస్తున్నట్లు తెలిసినపుడు, వంశీ ఆ సినిమాను సరిగ్గా తీయలేరని భావించాను. కానీ ఆయన అత్యద్భుతంగా తీసి నా అభిప్రాయం తప్పని నిరూపించారు. అందుకు వంశీకి థాంక్స్. కార్తి అత్యద్భుతంగా నటించాడు. నాగార్జునగారు రొటీన్ కి భిన్నంగా చేసి ఒక కొత్త ఒరవడిని సృష్టించారు. ఈ సినిమాను నిర్మించిన పీవీ గారికి, చిత్ర యూనిట్ కి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసుకొంటున్నాను. ఈ సినిమా మన మనసులని చిరకాలం వెంటాడుతుంది. కనుక ఎవరూ ఈ సినిమాని మిస్ అవ్వొదు,” అని ట్వీట్ చేసారు.

ఈ సినిమాపై “ఈ వేసవి డంకా బజాయించినట్లు మొదలయింది. ఊపిరి సినిమా గురించి చాలా గొప్పగా వింటున్నాను. నాగార్జున సర్ మీకు ఊపిరి సినిమా యూనిట్ సభ్యులు అందరికీ నా అభినందనలు,” అని హీరో నితిన్ కూడా ట్వీట్ మెసేజ్ పెట్టాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంత్రి బుగ్గన సిబ్బంది బెదిరింపులు…మహిళ సూసైడ్..!?

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సిబ్బంది అత్యుత్సాహం ఓ మహిళా నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి.కనీస మానవత్వం చూపకుండా బెదిరింపులకు దిగడంతో ఓ నిరుపేద మహిళా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కోనసీమ జిల్లా కొత్తపేటకు...

మేనిఫెస్టో మోసాలు : జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ ఏది బ్రో !

చంద్రబాబునాయుడు నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి పథకం పెట్టి.. భృతి ఇచ్చి.. ఇలా భృతి తీసుకునేవాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి ఎప్పటికప్పుడు ఉద్యోగాలిచ్చేలా వ్యవస్థను సృష్టిస్తే.. జగన్ ెడ్డి ఏపీకి...

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close