మళ్లీ జ‌గ‌న్ గూటికే చేరిన రాజ‌శేఖ‌ర్‌

పిల్లి పిల్ల‌ల్ని చంక‌న పెట్టుకుని ఊరంతా తిరిగిన‌ట్టుంటుంది రాజ‌శేఖ‌ర్ వ్య‌వ‌హారం. జీవితతో క‌ల‌సి దాదాపు ప్ర‌తీ పార్టీలోకూ అడుగుపెట్టి వ‌చ్చేశారు. ఏ పార్టీలోనూ ఈ జంట‌కు ఆద‌ర‌ణ ద‌క్క‌లేదు. వైకాలోనూ కొంత‌కాలం ఉన్నారు. `నేను జీన్స్ వేసుకోవ‌డం జ‌గ‌న్‌కి ఇష్టం లేదు.. అందుకే ఆపార్టీలో ఉండ‌లేక‌పోయా` అంటూ రాజ‌శేఖ‌ర్ కూడా కామెంట్లు చేశాడు. అయితే చివ‌రికి మ‌ళ్లీ అదే జ‌గ‌న్ పార్టీలోకి చేరిపోయాడు రాజ‌శేఖ‌ర్‌. ఈరోజు హైద‌రాబాద్‌లోని లోట‌స్ ఫాంట్‌లోజ‌గ‌న్ స‌మ‌క్షంలో మ‌రోసారి వైకాపా తీర్థం పుచ్చుకున్నారు ఈ సినీ దంప‌తులు. జ‌గ‌న్ విజ‌యానికి కృషి చేస్తామ‌ని.. రొటీన్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఏ పార్టీలో చేరినా.. అక్క‌డ యేడాది కూడా కొన‌సాగ‌ని పోగ్రెస్ రిపోర్ట్ వీళ్ల‌ది. మ‌రి ఇక్క‌డ ఎంత కాలం ఉంటారో చూడాలి. ప‌రిస్థితులు ఏమైనా, వ‌చ్చిన‌వాళ్లు ఎలాంటివాళ్లైనా.. కండువా క‌ప్ప‌డం జ‌గ‌న్‌కి వెన్న‌తో పెట్టిన విద్య‌. అందుకే.. సినిమావాళ్లు జ‌గ‌న్ ఆపీసు ముందు క్యూ క‌డుతున్నారు. ఈ సినీ గ్లామ‌ర్ ఎన్నిక‌ల వేళ ఏమాత్రం ప‌నికొస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

ఎక్స్‌క్లూజీవ్‌: పాట‌లే లేకుండా రౌడీ ప్ర‌యోగం

ఇది వ‌ర‌కు సినిమా అంటే ఆరు పాట‌లు ఉండాల్సిందే అనే అలిఖిత నిబంధ‌న ఉండేది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ ఇదే కొన‌సాగింది. అయితే... ఇప్పుడు సినిమాలో ఒక్క పాట ఉన్నా చాలు, జ‌నాల్లోకి...

ఒకటో తేదీన పించన్లిస్తారా ? మరో 30 మంది వృద్ధుల బలి కోరతారా ?

మళ్లీ ఒకటోతేదీ వస్తోంది. పించన్లు పంచే సమయం వస్తోంది. వారం రోజుల ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం ప్రారంభించాయి. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ...

ఎక్ల్‌క్లూజీవ్: ర‌వితేజ ‘దొంగ – పోలీస్‌’ ఆట‌!

ఇటీవ‌ల 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు'లో గ‌జదొంగ‌గా క‌నిపించాడు ర‌వితేజ‌. ఇప్పుడు మ‌ళ్లీ దొంగ‌త‌నాల‌కు సిద్ధ‌మైపోయాడు. ర‌వితేజ క‌థానాయ‌కుడిగా జాతిర‌త్నాలు ఫేమ్ అనుదీప్ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ఈ చిత్రాన్ని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close