శేఖ‌ర్ నిండా మునిగిన‌ట్టేనా?

`న‌న్ను నిల‌బెట్టండి.. ఈ సినిమాని హిట్ చేయండి.. ఈ సినిమా పోతే.. అమ్ముకోవ‌డానికి ఆస్తులు కూడా లేవు..` అంటూ దీనంగా వ్యాఖ్య‌లు చేశారు రాజ‌శేఖ‌ర్‌. దాన్ని బ‌ట్టి `శేఖ‌ర్‌` సినిమాపై రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న కుటుంబం ఎంత ఆధార ప‌డిందో అర్థ‌మ‌వుతూనే ఉంది. జోసెఫ్ కి రీమేక్ గా వ‌చ్చిన సినిమా ఇది. జోసెఫ్ హిట్‌. దాన్ని ఎంత సాదా సీదాగా తీసినా… తెలుగులో వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న భ‌రోసా. దానికి తోడు… రాజ‌శేఖ‌ర్‌కి రీమేకులు క‌లిసొచ్చాయి. దాంతో.. శేఖ‌ర్ ని బ‌లంగా న‌మ్మారు. పెట్టుబ‌డి పెట్టారు. తొలి రోజు `ఓకే` అనే టాక్ వ‌చ్చింది. అయితే.. కోర్టు కేసులు.. ఈ సినిమాని నిలువునా ముంచేశాయి. గ‌త సినిమాల భారం `శేఖ‌ర్‌`పై బ‌లంగా ప‌డింది. రూ.65 ల‌క్ష‌ల డిపాజిట్ చెల్లించ‌ని కార‌ణంగా ఈ సినిమాని నిలిపివేస్తూ.. కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. వీకెండ్ లో సినిమా లేక‌పోవ‌డం.. శేఖ‌ర్‌ని `కిల్‌` చేసేసింది. ఇప్పుడు కోర్టు కెక్కి.. స్టే ఆర్డ‌రుని వెన‌క్కి తెచ్చుకుని, సినిమాని కొన‌సాగించే టైమ్ లేదు. పైగా… సోమ‌వారం నుంచి సినిమా థియేట‌ర్ల‌లో ఉన్నా, పెద్ద‌గా ఫ‌లితం లేదు. వ‌చ్చేవారం.. `ఎఫ్ 3` వచ్చేవారం వచ్చేస్తోంది. ఇక ఆ సినిమా వ‌స్తే… `శేఖ‌ర్‌`ని ప‌ట్టించుకునేవాళ్లే ఉండ‌రు. ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వ‌మ‌ని ముందు ఆఫ‌ర్లు వచ్చాయి. అప్పుడు అమ్ముకొన్నా… శేఖ‌ర్ గ‌ట్టెక్కేసేవాడు. ఇప్పుడు ఓటీటీ పోయింది.. థియేట‌ర్ రిలీజ్‌కి వెళ్లినా, ఫ‌లితం లేకుండా పోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close