త‌మిళ్ లో ర‌జ‌నీ.. తెలుగులో తార‌క్..

సినిమా ఇండ‌స్ట్రీ, సెంటిమెంట్ క‌వ‌ల‌ల్లాంటివి. ఒక‌దానితో ఒక‌టి ముడిప‌డి ఉంటాయి. ఒక సినిమా ఒక ఫార్ములాలో స‌క్సెస్ అయితే.. ఇక మిగిలిన వారంతా అదే ఫార్ములా ప‌ట్టుకుంటారు. ఒక సినిమాలో హీరోకి ముద్దు సీన్ ఉంటే ఆ మూవీ హిట్ అవుతుంద‌నుకుంటే.. ఇక అంద‌రూ అదే బాట ప‌డ‌తారు. అప్పుడెప్పుడో ఫ్యాక్ష‌న్ బ్యాక్ డ్రాప్ తో సినిమాలు వ‌స్తే.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా అవే సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు హార‌ర్ కామెడీ హిట్ కొట్ట‌గానే.. అవే క‌థ‌లు పుట్టుకొస్తున్నాయి. అయితే.. ఇలాంటి సెంటిమెంట్స్ ను బ్రేక్ చేశారు ఇద్ద‌రు.

తెలుగులో ర‌జ‌నీకాంత్ సాధించిన స‌క్సెస్ ని టాలీవుడ్ లో తార‌క్ సాధించాడు. అంత గొప్ప ఘ‌న‌త ఏంట‌నుకుంటున్నారా? అదే గ‌డ్డం క‌థ‌. హీరో గ‌డ్డంతో క‌నిపిస్తే.. ఆ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అవుతుంద‌నే ముద్ర చాన్నాళ్లుగా ఉంది. అయితే ఆ సెంటిమెంట్ ను అప్ప‌ట్లో ర‌జ‌నీకాంత్ బ్రేక్ చేశాడు. బాషా సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. ఆ త‌ర్వాత చాలా మంది త‌లైవాని ఫాలో అయ్యారు. అజిత్, ఇత‌ర హీరోలు గ‌డ్డంతో హిట్ కొట్టారు.

ఇక తెలుగులో కూడా ఈ సెంటిమెంట్ బ‌లంగా ఉంది. త‌మిళ తంబీల కంటే మ‌న ద‌గ్గ‌రే ఇది ఎక్కువ‌. మెగా ఫ్యామిలీ హీరోల్లో చిరంజీవి బిగ్ బాస్ లో గ‌డ్డంతో న‌టించాడు. అది డిజాస్ట‌ర్ అయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ పంజాలో యాక్ట్ చేశాడు. అదీ అట్ట‌ర్ ఫ్లాప్ అయింది. ఇక నంద‌మూరి ఫ్యామిలీలో బాబాయ్ బాల‌య్య కూడా అధినాయ‌కుడులో గ‌డ్డంతో న‌టించాడు. అది కూడా ఫ్లాప్ ఖాతాలో చేరిపోయింది. (లెజెండ్ లో గ‌డ్డం చాలా ట్రిమ్ గా ఉంటుంది). వెంక‌టేశ్ – షాడో, క‌మ‌ల్ హాస‌న్ – ఈనాడు సినిమాలు కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌లేపోయాయి..

దీంతో గ‌డ్డం సెంటిమెంట్ బ‌లంగా నాటుకుపోయింది. అయితే ఈ సెంటిమెంట్ ను తార‌క్ బ్రేక్ చేసిన‌ట్టే క‌నిపిస్తోంది. నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో త‌న స్టైలిష్ గ‌డ్డం కూడా సినిమాను గ‌ట్టెక్కించ‌డంలో కీ రోల్ ప్లే చేసిందంటున్నారు. అందుకే త‌మిళ్ లో త‌లైవా, తెలుగులో తార‌క్ సెంటిమెంట్ ను బ్రేక్ చేశార‌ని టాక్ న‌డుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close