‘ద‌ర్బార్’ విష‌యంలో ఓ మ్యాజిక్ జ‌రిగింది: ర‌జ‌నీకాంత్‌

ఈ సంక్రాంతికి మ‌హేష్‌బాబు, అల్లు అర్జున్‌ల‌కు పోటీగా ఓ త‌మిళ సినిమా వ‌స్తోంది. డ‌బ్బింగ్ బొమ్మే అయినా – మ‌న స్టార్ హీరోలల‌కు సైతం వ‌ణుకు పుట్టించే సినిమా అది. అదే… ద‌ర్బార్‌. జ‌న‌వ‌రి 9న విడుద‌ల కాబోతోంది. అంటే ఈ సంక్రాంతికి బ‌రిలోకి దిగే మొద‌టి పుంజు ర‌జ‌నీకాంతే. ఈ సినిమాపై ర‌జ‌నీ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. మురుగ‌దాస్ స్క్రీన్ ప్లేతో క‌నిక‌ట్టు చేశాడ‌ని, అస‌లు ఈ సినిమాలోనే ఓ మ్యాజిక్ జ‌రిగింద‌ని చెప్పుకొచ్చాడు ర‌జీనీ. కాసేప‌టి క్రితం హైద‌రాబాద్‌లో ‘ద‌ర్బార్‌’ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ర‌జ‌నీ మాట్లాడుతూ “అంద‌రూ సినిమా బాగా హిట్ కావాల‌నే చేస్తారు. అయితే సినిమా చేసే స‌మ‌యంలో ఓ మ్యాజిక్ జ‌రుగుతుంది. ఆ మ్యాజిక్ మ‌న చేతుల్లో ఉండ‌దు. అలాంటి మ్యాజిక్ ఈ సినిమాకు జ‌రిగింది. మురుగ‌దాస్‌గారితో ప‌నిచేయాల‌ని 15 ఏళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ సినిమాకు కుదిరింది. ఈ క‌థ‌ను వింటే హీరో, నిర్మాత ఎలా చేశారీ సినిమాను అనుకుంటారు. కానీ మురుగ‌దాస్‌గారు ఇచ్చిన స్క్రీన్‌ప్లే అద్బుతంగా ఉంది” అని చెప్పుకొచ్చాడు ర‌జ‌నీ.

త‌న ఎన‌ర్జీ సీక్రెట్ గురించి పంచుకుంటూ “ఇంత వ‌య‌సులోనూ ఇంత ఎన‌ర్జిటిక్‌గా ఎలా ఉన్నార‌ని కొంత మంది అడుగుతుంటారు. త‌క్కువ‌గా ఆశ‌ప‌డండి. త‌క్క‌వగా బాధ‌ప‌డండి.. త‌క్కువ‌గా భోజ‌నం చేయండి.. త‌క్కువ‌గా నిద్ర పోండి.. త‌క్కువ‌గా ఎక్స‌ర్‌సైజ్ చేయండి, త‌క్కువ‌గా మాట్లాడండి.. ఇవ‌న్నీ చేస్తే సంతోషంగా ఉంటాం” అంటూ ఆ ర‌హ‌స్యాన్నీ బ‌య‌ట పెట్టేశాడు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close