రజని అక్కడి ఫంక్షన్ కి ఒప్పుకుంటాడో లేదో…?

డిఫరెంట్ గెట్అప్ తో వస్తున్న కబాలి సినిమా తరువాత రజనీ చేస్తున్న చిత్రం ‘రోబో 2. 0’. ఈ చిత్రం యావత్ సౌత్ ఇండియాలోనే కాకా, ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ ఆవైటెడ్ మూవీగా ఈ సినిమా సంచలనం సృష్టిస్తోంది. రజనీ, శంకర్ ల రోబో కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రాన్ని దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ (లండన్) నిర్మిస్తోంది. ఈ సినిమాకి ఏ. ఆర్ . రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా రజనీ సరసన యామీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోంది. 2017 లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఢిల్లీ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. విషయం ఏంటంటే…. గతం లో రోబో చిత్రం ఆడియో ఫంక్షన్ మలేసియా, కౌలాలంపూర్ లో ఎంతో ఘనగా జరుపుకుంది. అదే విధంగా ప్రస్తుతం తెలిసిన సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియో వేడుకను ఘనంగా లండన్ లో నిర్వహించాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే లైకా ప్రొడక్షన్స్ హెడ్ ఆఫీస్ లండన్ లోనే ఉంది. అందుకే అన్నింటికీ అనుకూలంగా ఉంటుందని అక్కడ నిర్వహించాలనే ప్లాన్ లో ఉన్నారట నిర్మాత. కానీ ఎప్పుడూ అభిమానులకు పెద్ద పీఠ వేసే రజనీ తన అభిమానులకు దూరంగా ఎక్కడో లండన్ లో ఆడియో కార్యక్రమాన్ని చేయడానికి ఒప్పుకుంటారా లేదా అనేదే తేలాల్సిన విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close